బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికల పై దృష్టి పెట్టింది. ఒకే ఈశం, ఒకే ఎన్నిక పేరిట, అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలి అనేది బీజేపీ ఆలోచన. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఇలా అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని, ఇలా జరిగితే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ఉంటుందనే ఆలోచన. దీని పై బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కసరత్తు చేస్తుంది. గతంలోనే ఈ విషయం పై అఖిలపక్ష భేటీ కూడా కేంద్రం నిర్వహించి, అందరి అభిప్రాయలు తీసుకుంది. అయితే కరోనా రావటంతో, కొన్ని కార్యక్రమాలు లేట్ అవుతాయి వచ్చాయి. నిజానికి 2022లో ఎన్నికలకు వెళ్ళాలి అనేది బీజేపీ ఆలోచన. 2022లో ఉత్తరప్రదేశ్ తో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2023, 2024లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే, 2022లోనే జమిలీ ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ అభిప్రాయం. ఇందు కోసం, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వాయిదా వేయటం, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపటం వంటివి చేయలని బీజేపీ ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పటికే లా కమిషన్ కానీ, ఎనికల సంఘం కానీ, ఇప్పటికే కేంద్రానికి తమ అభిప్రాయం తెలియ చేసాయి. అయితే ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికల జాబితా పై కసరత్తు జరిగింది. అంటే పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకే ఓటర్ జాబితా ఉండనుంది.
గతంలో స్థానిక ఎన్నికల ఓటర్ జాబితా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే మునిసిపాలిటీలు, పంచాయతీలు తయారు చేసేవి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ తయారు చేసేది. ఇలా కాకుండా, ఇప్పుడు మొత్తానికి ఒకటే జాబితా, అదీ ఎలక్షన్ కమిషన్ తయారు చేయనుంది. దీనికి సంబంధించి, ఈ నెల 13న ప్రధాని కార్యాలయంలో, ఒక కీలక భేటీ జరిగింది .ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి పీకే మిశ్రా, ఈ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నాతిదికారులు కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఒకే ఎన్నికల జబితీ కోసం, రాజ్యంగా సవరణ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాని, వారిని ఒప్పించే బాధ్యత కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి విధి విధనాలు నిర్వహించి, ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి, జమిలీ ఎన్నికలకు సంబంధం లేదని ఎన్నికల కమిషన్ చెప్తుంది. జరుగుతున్న ప్రచారం నిజం కాదని చెప్తుంది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం, జమిలీ ఎన్నికలకే ఊతం ఇస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన సమస్య రాష్ట్రాలను ఒప్పించటం. మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఏమి చెప్తే అది చేస్తాయి కాబట్టి, కాంగ్రెస్ రాష్ట్రాలు మినిహా, దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.