జియో టాగింగ్ అంటాడు.... టెక్నాలజీ అంటాడు... ఇవన్నీ జరిగే పనేనా అంటూ ఉంటారు, కొంత మంది... అదే టెక్నాలజీతో ఏంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు చంద్రబాబు... స్మశానాల్లో పెన్షన్ లు తీసుకున్న రోజులు కూడా మనం చూశాం... అంతటి దోపిడీ చూసిన ప్రజలకి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంకి పెన్షన్ తీసుకున్నారో కూడా మన ముందు ఉంచుతున్నారు...

తాజాగా, ఇవాళ లక్ష మంది పేదలకి ప్రభుత్వం ఇల్లు కట్టించింది... ఇవాళ గాంధీ జయంతిని పురస్కరించుకుని గృహప్రవేశాలు జరిగాయి... ఇదో శుభకార్యంగా భావిస్తూ, గృహప్రవేశాలు చేసిన లబ్దిదార్ల దంపతులకు రాష్ట్రం ప్రభుత్వం పక్షాన నూతన వస్త్రాలను కూడా బహుకరించారు... ఇది వరకు మనం చూసాం... ఇందిరమ్మ ఇల్లు అని, ఉన్న పూరి పాకలు పీకి, ఊరి బయట మొండి గోడలతో మమ అనిపించి, కాంట్రాక్టర్ల జేబులు నింపారు.... అది కూడా చాలా తక్కువ... నాలుగు పిల్లర్లు లేపి, ఇవే ఇల్లు అంటూ, బిల్లులు పెట్టుకుని, పేదల డబ్బులు నోక్కేసారు...

ఇప్పుడు చంద్రబాబు వచ్చారు... ప్రతి పేద వాడి మొఖంలో భరోసా ఇస్తూ, సొంత ఇంటి కలను నిజం చేస్తున్నారు... ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభించారు.. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యమని చెప్పారు...

ఈ ప్రక్రియ అంతా ఎంత పారదర్శకంగా జరిగింది అంటే... కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించేటప్పుడు, లబ్దిదారులకు ఫోన్ చేసి, ఎవరైనా లంచం అడిగారా అని అడిగి తెలుసుకుంటున్నారు.. ప్రతి ఇంటినీ జియో ట్యాంగింగ్ చేసి, ఫోటోలు తీసి వెబ్సైటులో పెట్టారు...

మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...
ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do
ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, ఇవాళ గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి...
మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do

Advertisements

Advertisements

Latest Articles

Most Read