ఆంధ్రోడు కొట్టిన దెబ్బకి,మొన్నే కర్ణాటకలో బీజేపీకి చుక్కలు కనిపించాయి... ఒక 10సీట్లు పోయి ఉంటాయి తక్కువలో తక్కువ... ఆ 10 సీట్లే తగ్గినయ్యి మెజారిటికి.... ఆ 10 సీట్ల లోటు పూడ్చుకోవటానికి బేరసారాలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు... దేశవ్యాప్తంగా పరువు పోయింది... బీజేపీ వేసుకున్న విలువలు అనే ముసుగు తొలిగిపోయింది.... ఒక్క ముక్కలో చెప్పాలంటే... రెండు నెలల్లో బీజేపీని గుడ్డలూడదీసి నడిరోడ్డు మీద నుంచో పెట్టాడు చంద్రబాబు నాయుడు... తెలుగువారికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపు అక్కడి తెలుగువారందరినీ ఏకం చేసింది. తెలుగువారు ప్రభావం చూపగలిగిన స్థానాలు ఆ రాష్ట్రంలో సుమారు 50 ఉంటే.. అందులో 40 చోట్ల కాంగ్రెస్‌, జేడీఎ్‌సలే గెలిచాయి.

bjp 31052018 2

ఇప్పుడు మరో సారి, బీజేపీకి అదే కర్ణాటకలో తెలుగు వారు మన పవర్ చూపించారు.. కర్ణాటకలోని రాజరాజశ్వేరి నగర్ ఎన్నిక ఫలితం గురువారం వెలువడింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన మునిరత్నం బీజేపీ అభ్యర్థిపై 46,100 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 80,282 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 34,064 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థికి 23,526 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి మునిరాజ్ గౌడ, జేడీఎస్ నుంచి జీహెచ్ రామచంద్ర బరిలో నిలిచారు. కర్ణాటకలోని రాజరాజశ్వేరి నగర్ లో, దాదాపుగా 25 శాతం మంది తెలుగు వారు ఉంటారనే అంచనా ఉంది.

bjp 31052018 3

మే 12 న కర్ణాటకలో 222 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారం బయటపడటంతో ఆర్‌ఆర్ నగర్‌లో, బీజేపీ అభ్యర్థి హఠాన్మరణంతో జయనగర్‌లో పోలింగ్ వాయిదా పడింది. దీంతో మొన్న ఎన్నిక జరగ్గా, ఈ రోజు కౌంటింగ్ జరిగింది. చంద్రబాబుకు, ఆంధ్రాకు చుక్కలు చూపుతామని కమలనాథులు, ఇప్పటికైనా మారండి... ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసారు... ఆంధ్రా ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టాలి అని చూసారు.. కడుపు మండిన ఆంధ్రోడి దెబ్బ ఎలా ఉంటుందో చూసారు... చూడటానికి సైలెంట్ గా ఉంటారు కానీ పగ పడితే పాము కన్నా ప్రమాదకరం... ఏ ఆంధ్రుడిని అయితే ఇబ్బంది పెట్టాలి అని చూశావో అదే ఆంధ్రుడు మీ పార్టీని అధికారానికి దూరం చేసాడు.. ఆ ఆంధ్రుడి వల్లే, మీ పార్టీ చేసే దిగజారుడు రాజకీయాలను దేశం మొత్తం తెలిసేలా చేసాడు.. ఇప్పటికి అయినా పద్దతి మార్చుకుని ఆంధ్రాకి న్యాయం చేయండి... లేకపోతే ఈ సారి ఆంధ్రోడు కొట్టే దెబ్బకు మీ భవిష్యత్తు కనుమరుగు అవుతుంది... 125 ఏళ్ళ మీ ఫ్రెండ్ పార్టీని అడగండి, మా ఆంధ్రోడి దెబ్బ ఏంటో క్లియర్ గా చెప్తారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read