ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి పునాదులు వేసిన ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవ ర్నెన్స్ (ఆర్టీజీ) ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వినూత్న ఆలోచనల నుండి పురుడుపోసుకున్న వ్యవస్థ. విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ను శరవేగంగా అభివృ ద్ధిపథంవైపు పయనించేలా కంకణబద్ధుడైన సీఎం చంద్ర బాబుకు ఆర్టీజీఎస్ ఒక ఆయు ధంలా తయారయ్యింది. ఒక దార్శినికతతో, భవిష్యత్ తరా లకు సుపరిపాలన అందించా లన్న ముఖ్యమంత్రికి అత్యా ధునిక సాంకేతిక సహకారం ఎంతో అవసరమన్న ఉద్దేశంలో ఉండ గా శ్రీకారం చుట్టిందే ఆర్టీజీఎస్. 2017 నవంబరు 26న గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సేవలను ప్రారంభించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మరో అడుగు ముందుకు వేశారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) ద్వారా భూగర్భ జల మట్టాల మొదలుకొని వాతావరణంలోని మార్పులను సైతం ఇట్టే పసిగట్టే ఆధునిక సాంకేతిక విధానంతో ప్రజలను విపత్తుల నుండి కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఇటీవల ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన ‘తిత్లి’ తుఫాను విపత్తును ఎదుర్కొనడంలో పూర్తి విజయాన్ని సాధించడానిఇక ఆర్టీజీఎస్ ఎంతగానో దోహదపడింది. దేశంలోనే మొట్టమెదటి ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ఆర్టీజీఎస్ కేంద్రం ఎపీలో సేవలను ప్రారంభించింది. దాదాపుగా 62 అడుగుల పొడవైన వీడియో వాల్ ఆర్టీజీఎస్ ప్రత్యేకత. ఆసియాలోనే అతి పొడవైన వీడియో వాల్ ఇదే. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ లో సాంకేతిక వినియోగం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. దీంతో రూ.1600 కోట్ల ప్రభు త్వం ఆదా చేయగలిగింది. ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలలో పూర్తిస్థాయిలో అక్రమా లను అడ్డుకట్ట వేస్తూ.. సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడింది.
ఇప్పటి వరకూ అందిన ఫిర్యాదులు 1,69,76,311, దీనిలో వ్యక్తిగత ఫిర్యాదులు 1,36,74,648, సామా జిక (కమ్యూనిటీ) ఫిర్యా దులు : 33,01,663, ఇప్ప టి వరకూ పరిష్కరించినవి 73,17,238, పరిశీలన పూర్త య్యి, మంజూరు కానివి : 72,34, 605, ఇంకా పరిశీలించాల్సిన ఫిర్యా దులు : 5,48,552, తిరస్కరించిన ఫిర్యాదులు : 18,75,908. ఆర్టీజీఎస్ మొత్తం 27 ప్రభుత్వశాఖలు అమలు చేస్తున్న 156 పథకాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ, వాటి అమలు తీరుపై నిత్యం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం లో సిబ్బంది నిమగ్నమై ఉంటారు. ఆర్టీజీఎస్ కేంద్రం ఇప్పటి వరకూ 62.27 లక్షల కాల్స్ చేసింది. పరిష్కారవేదికకు అందిన ఫిర్యాదులు మొత్తం : 6,040, విచారణను పూర్తి చేసిన ఫిర్యాదుల సంఖ్య : 2,065, ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నవి : 3,975.