ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్ర విచిత్రాలు బహుసా ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండవు. ఒక పక్క జీతాలకు డబ్బులు లేవు అంటారు, ఆదాయం లేదు అంటారు, మరో పక్క మూడు రాజధానులు, 26 జిల్లాలు, 26 ఎయిర్ పోర్ట్ లు, 26 మెడికల్ కాలేజీలు, ఇలా రకరకాలుగా, వింత వింతగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ కూడా హడావిడి నిర్ణయాలు. ఏదో రాత్రి కలలో గుర్తుకు వచ్చి, ఉదయం చేసేసినట్టు ఉంటుంది. మూడు రాజధానుల విషయంలో కూడా అలాగే అయ్యింది. వాళ్ళ కోటరీ మాత్రమే డిస్కస్ చేసుకుని, ఎవరికీ చెప్పకుండా, ప్రజలలో చర్చ లేకుండా, ఉన్నట్టు ఉండి మూడు రాజధానులు అన్నారు. అది ఎంత కామెడీ అయ్యి కూర్చుందో, చివరకు ఆ బిల్లు వెనక్కు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలను చేసేసారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. ఏంటి ఇలా జరిగింది అని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. నిద్ర లెగిసి చుసేసరికి, మా జిల్లా మారిపోయింది అని గోల చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి, కొత్త జిల్లాల ఏర్పాటు పై చర్చ నడుస్తుంది. అయితే ఇది మొత్తం పద్దతి ప్రకారం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం వార్తలు చూసి షాక్ అయ్యారు.

cabinet26012022 2

నిన్న అర్జెంట్ గా ఆన్లైన్ లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది అట. అందులో రెవిన్యూ మంత్రి ధర్మాన, ఈ ప్రతిపాదన పెట్టటం, క్యాబినెట్ మొత్తం ఒకే చెప్పటం, వెంటనే గెజిట్ వచ్చేయటం జరిగిపోయాయి అంట. ఎందుకు ఇంత అర్జెంట్ గా రాత్రికి రాత్రికి చేసారో, వాళ్ళకే తెలియాలి. ఇక ఇప్పుడు ప్రజలు తేరుకుని చూసే సరికి చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో కృష్ణమ్మ లేదు. ఎన్టీఆర్ జిల్లాలో, ఎన్టీఆర్ సొంత ఊరు లేదు. డెల్టా ప్రాంతంలో కాలువలు లేవు. హిందూపురం జిల్లా, మదనపల్లె జిల్లా లేవు. ఇలా మొత్తం గందరగోళంగా మారిపోయాయి. నూజివీడు తీసుకుని వెళ్లి ఏలూరులో కలిపారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, గెజిట్ విడుదల చేసి అభ్యంతరాలు ఉంటే చెప్పాలి అని చెప్పటం. అసలు ఒక పక్క కొత్త జనాభా లెక్కలు అయ్యే దాకా, ఇది వద్దు అని కేంద్రం అంటుంటే, ఇది చెల్లదు అని తెలిసినా, ఎందుకు హడావిడిగా ఇది చేసారో, జగన్ గారికే తెలియాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read