కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామంలో నిర్మిస్తున్న లేల్యాండ్ ప్లాంట్ ఉద్యోగాలకు, ఉపాధి కల్పనా కార్యాలయం, ప్రకటన విడుదల చేసింది. అశోక్ లేల్యాండ్ ప్లాంట్ లో, ట్రైనీ ఉద్యోగాలకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ITI విద్యార్హత ఉన్న వారికి 150 ఖాళీలు ఉన్నాయని, నెలకు 12 వేల జీతం అని చెప్పారు. వయుసు, 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. దీనికి సంబంధించి ఈ నెల 25న గుంటూరులో, 27న తెనాలిలో ఇంటర్వ్యూ లు ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు, సర్టిఫికేట్ జెరొక్ష్ కాపీ, రేషన్ కార్డు, ఆధర్ కార్డు, మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోతో, ఉదయం 9 గంటలకు, ఇంటర్వ్యూ వేదికకు చేరుకువాలి.
మల్లవల్లి గ్రామంలో రూ. 135కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఏటా 2400 బస్ బాడీలు తయారు చేసే బిల్లింగ్ యూనిట్సు రూ.90 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రెండు దశలో మరో రూ.45 కోట్లతో 2400 బస్ బాడీలను తయారు చేసే మరో యూనిటీను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థకు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్లలో 2400 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తర్వాత విడతలో ఛాసిస్లు తయారుచేసే యూనిట్ ను నెలకొల్పవచ్చని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది.
మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్ ఇండస్ర్టియల్ పార్క్ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్ ఇండస్ర్టియల్ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది... మరో పక్క ఇదే ఇండస్ర్టియల్ పార్క్ లో, మోహన్ స్పిన్‌టెక్స్ సంస్థకు ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది... భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్ మిల్లులు, ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి..