రాష్ట్ర పోలీసులపై వైసీపీ గురిపెట్టింది. పోలీసు వ్యవస్థ లక్ష్యంగా ప్రతిరోజూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తోంది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఇప్పటిదాకా తమ దాడిని కొనసాగిస్తూ వచ్చిన ఆ పార్టీ, ఇప్పుడు కొన్ని ప్రధాన జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు ఇబ్బందిగా మారతారని భావించే పోలీసులపై ఫిర్యాదులు చేస్తోంది. డీజీపీపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండురోజుల కింద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే క్రిమిన ల్ కేసులు ఎదుర్కొంటున్నారని మరికొందరు పోలీసు అధికారులపైనా వైసీపీ శుక్రవారం ఫిర్యాదు చేసింది.
వైసీపీ ప్రధా న కార్యదర్శి నాగిరెడ్డి, లీగల్‌సెల్ అధ్యక్షుడు కాటంరాజు వెం కటేశ్శర్మ ఒక జాబితానూ అందజేశారు. సదరు జాబితాలోని పోలీసులు క్రిమినల్ స్వభావం కలిగి ఉన్నారని.. ఆరోపించా రు. ఒంగోలు డీఎస్పీ రాధేశ్ మురళీ, ఏలూరు రూరల్ సీఐ వైవీ లచ్చునాయుడు, నందిగామ రూరల్ ఎస్ఐ నూతలపా టి నాగేశ్వరరావు, కోడూరు ఎస్ఐ ప్రియకుమార్, ఎస్ఐ సురేశ్, కానిస్టేబుళ్లు శివనాగరాజు, ఎస్.చిరంజీవిరావు, పి.హరిబాబు తదితరులపై ఫిర్యాదు చేశశరు. ఈ ఫిర్యాదు ప్రతిని కూడా ద్వివేదీ డీజీపి ఠాకూర్‌కు పంపారు.
మైండ్‌గేమ్! ఇలా ఫిర్యాదులు చేయడంలో వైసీపీ ఉద్దేశాలు వేరని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పోలీసులు తమ విధుల ను స్వేచ్ఛగా నిర్వర్తించకుండా చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యం గా కనిపిస్తోందని పేర్కొంటున్నాయి. వైసీపీ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లు ఫిర్యాదులు అందినప్పుడు స్వేచ్ఛగా చర్యలు తీసుకోకుండా ఆపార్టీ మైండ్‌గేమ్‌కు దిగుతోందని అంటున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డి ప్రచారానికి వెళ్లినప్పుడు తమ గ్రామానికి రావొద్దని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో మ రో గ్రామానికి వెళ్లినప్పుడు అవినాశ్‌రెడ్డి తన అనుచరులను మోహరించారు. అక్కడ గ్రామస్థులకు, అవినాశ్ అనుచరుల కూ మధ్య గొడవ చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు గ్రహించారు. ఎన్నికల నియమావళి ప్రకారం వాహనాల శ్రేణిని పంపిస్తామని అవినాశ్ కు స్పష్టం చేయగా ఆయన తప్పుబట్టారు. పోలీసులు అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.