నిన్న పోలవరంలో రెండు అద్భుతమైన వార్తలు వినిపించాయి.. అసాధ్యం సుసాధ్యమైంది .. ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 55 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలో నిన్న అద్భుతం జరిగింది... పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం నిన్నటితో పూర్తైంది. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి 412 రోజులు బాగా శ్రమించి రూ.430 కోట్లతో ఈ పనిని పూర్తి చేశారు. నిర్మాణం పొడవు మొత్తం 1396.60 మీటర్లు. వెడల్పు 1.5 మీటర్లు (ఐదు అడుగుల మందం). నదీ గర్భం లోతు 40 మీటర్ల నుంచి 93.50 మీటర్లు ఉంటుంది. లోపల రాయి తగిలే వరకు వెళ్లడంతో సరిపెట్టలేదు. రాయి తగిలిన తరువాత అందులోనే మరో రెండు మీటర్ల దిగువకు వెళ్ళి అక్కడ నుంచి కాంక్రీట్ వేసుకుంటూ వచ్చారు. మరో పక్క నవయుగ సంస్థ నిన్న రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 11,158 క్యూ.మీ. కాంక్రీట్ వేయడం రికార్డు సృష్టించారు.
దీంతో రాష్ట్ర ద్రోహులకు, రాష్ట్ర వినాశనం కోరుకునే వారి కన్ను కుట్టుంది.. సోమవారం, పోలవరం వార్తలతో, న్యూస్ చానల్స్ అన్నీ నిండిపోతాయని, చంద్రబాబు చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారని, దశాబ్దాల ప్రాజెక్ట్, కేవలం చంద్రబాబు వల్లే ముందుకు వెళ్లి, కలగా ఉన్న ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాలుస్తుందని, రైతులు గుర్తిస్తారని, అందుకే టీవీ చానల్స్ లో, పోలవరం వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటానికి, ఈ రాష్ట్ర ద్రోహులు ఒక ఐడియా వేసారు.. మెంటల్ బాగా ఉన్న ఒక మెంటలోడిని దీని కోసం సెలెక్ట్ చేసారు. ఈ మెంటలోడు హైదరాబాద్ లో కూర్చుని బూతులు తిట్టాడు.. ఇక మన రాష్ట్రంలో, ఈ మెంటలోడికి తోడు, బీజేపీ ధర్నా చేసింది. ముద్రగడ ప్రెస్ మీట్ పెట్టాడు.. పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెట్టింది, విజయసాయి రెడ్డి మోత్కుపల్లి దగ్గరకు వెళ్ళాడు, ఇలా అన్ని విధాలుగా, పోలవరం ప్రాజెక్ట్ సాధించిన ఘనత గురించి ప్రజలకు తెలియకుండా, ప్రచారం రాకుండా చెయ్యటానికి ట్రై చేసారు.. కాని, వీరి పప్పులు ఉడకలేదు... ప్రజలు పోలవరం సాధించిన ప్రగతి, చంద్రబాబు కష్టం గుర్తించారు...