Sidebar

07
Wed, May

నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 17042018

దీంతో కొంత మంది పెద్దలకు కన్ను కుడుతుంది.. అందుకే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలాగైనా ఆపి, చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తియ్యాలి అనే ప్లాన్ వేస్తున్నారు... దీంట్లో భాగంగా, ఈ రోజు ఒరిస్సా రాష్ట్రం, పోలవరం ఆపెయ్యాలి అంటూ సుప్రీం కోర్ట్ ని కోరింది. పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగడం లేదని, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకు కూడా విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాదించింది.

polavaram 17042018

పొరుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు కూడా పాటించకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరంకు అనుమతులు ఇచ్చిందిన ఒడిశా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి అనేక అనుమతులు కూడా పెండింగ్‌లో ఉన్నందున పోలవరం నిర్మాణంపై స్టే విధించాలని వాదనలు వినిపించారు. అయితే అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని ఏపీ వివరణ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 2కు వాయిదా వేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగానే పోలవరం నిర్మాణం జరుగుతోందని సీడబ్ల్యూసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరిగుతాయో, ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read