టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ పోలవరం పై చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు... పోలవరం పై కోర్టులో నడుస్తున్న కేసులను అందరూ గమనించాలన్నారు.... పోలవరంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని తెలిపారు... ఆయన ఇబ్బంది లేకుండా, చూస్తానని చెప్పారని చెప్పారు చంద్రబాబు... అన్ని వివరాలతో ప్రధానిని కలిసినా బడ్జెట్‌లో పోలవరం ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. .. నిజానికి, సుప్రీమ్ కోర్ట్, పోలవరం కేసు విషయంలో, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి, ముగ్గురు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచిస్తూ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది...

polavaram 15022018 2

అప్పట్లో చంద్రబాబు దీని పై స్పందిస్తూ, పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ప్రధానియే సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.... అయితే, అప్పట్లో ప్రధాని ఈ విషయం పై పట్టించుకోకపోవటంతో, చంద్రబాబే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో మాట్లాడారు... ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన అలా చేస్తున్నారని తనకు అనిపిస్తోందని చెప్పారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన వెనక్కి తగ్గారని చంద్రబాబు చెప్పారు....

polavaram 15022018 3

పోలవరంపై అసెంబ్లీలో చర్చ పెడతానంటే అమిత్ షా, జైట్లీలు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని గుర్తు చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఇబ్బందులు పడుతుంటే... పనులు త్వరగా కావాలని మరో కాంట్రాక్టర్‌ను తీసుకొచ్చామని బాబు తెలిపారు. గతంలో ఫేజ్-1 డీపీఆర్, తాజాగా రివైజ్జ్ డీపీఆర్ పంపామని చెప్పారు. అవరోధాలు తొలిగి ఇప్పుడు ప్రాజెక్టు దారిలో పడిందని సమావేశంలో బాబు అన్నారు. ఒక ప్రాజెక్టు కోసం కేంద్రం వద్దకు, ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఏకైకా ముఖ్యమంత్రిని తానే అని చెప్పుకొచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read