నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...
దీంతో కొంత మంది పెద్దలకు కన్ను కుడుతుంది.. అందుకే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలాగైనా ఆపి, చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తియ్యాలి అనే ప్లాన్ వేస్తున్నారు... దీంట్లో భాగంగా, ఇప్పుడు ఒరిస్సా కూడా ఎంటర్ అయ్యింది. ఒరిస్సాలో ఎన్నికలు వస్తున్న వేళ, అక్కడ ప్రజలని రెచ్చగొట్టటానికి, అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పోలవరం పనుల్ని తక్షణమే నిలిపివేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒడిశా ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇదే అంశంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి రెండుసార్లు లేఖలు రాశామని, ఒడిశాకు తెలియకుండా ఎలాంటి పనులూ చేపట్టకుండా నిలుపుదల చేయాలని అప్పడు కోరినట్టు చెప్పారు. శబరి, సీలేరు నదీ జలాల విషయం పూర్తిగా తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ నిబంధనల్ని అతిక్రమించడమేనని లేఖలో అభిప్రాయపడ్డారు. ముంపు , పునరావాసం అంశాలు కూడా ఇంకా తేలలేదని, అవి పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని ఆయన కేంద్ర పర్యావరణ శాఖను కోరారు. ఇంకా ఎన్ని మలుపులు తిరిగుతాయో, ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో చూడాలి...