ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాదుడే బాదుడులో దూసుకు పోతుంది. ఆదాయ మార్గాల అన్వేషణ కోసం, కనిపించిన ప్రతి దాని పైన పన్నులు వేస్తుంది. ఇప్పటికే ఎప్పుడో 30 ఏళ్ళ నాడు, ఎన్టీఆర్ కట్టిన గ్రామీణ, పట్టాన గృహ నిర్మాణం కింద నిర్మించిన ఇళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ కింద, ప్రభుత్వం డబ్బులు వసూలు చేయటం ప్రారంభించింది. ఇదే పెద్ద రచ్చ అనుకుంటుంటే, ఇప్పుడు తాజాగా మరో బాదుడుకి రెడీ అయ్యింది. వ్యవసాయ భూముల్లో ఏవైతే నిర్మాణాలు జరిగాయో, ఆ నిర్మాణాలకు నాలా పన్ను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఆ నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెనాల్టీతో సహా డబ్బులు కట్టాలని, కొత్త బాదుడి రెడీ అయ్యారు. గతంలో ఇళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పెట్టగా, ఇది వన్ టైం కలెక్షన్ ఓటీసీని ప్రభుత్వం పెట్టింది. ఈ ఓటీసీ పధకంలో, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలతో పాటు, అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో, ఎక్కడైతే వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టారో, అవి గుర్తించే పనిలో పడ్డారు. ఆ డేటా మొత్తం ఇప్పటికే రెవిన్యూ అధికారులు ద్వారా, కలెక్టర్లు సేకరించారు. ఈ మొత్తానికి కూడా నాలా పన్ను, ఫైన్ తో కట్టి క్రమబద్దీకరించుకునేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం సూచించింది.

shock 19012022 2

దీని వల్ల ప్రజలకు అధికారికంగా, ఆమోద ముద్ర వేసినట్టు అవుతుందని, ప్రజలకు ఒప్పించాలని చెప్పారు. దీంతో ఇప్పుడు వాళ్ళను నచ్చ చెప్పే పనిలో అధికారులు పడ్డారు. ఈ లెక్కలు అన్నీ వేసిన ప్రభుత్వం, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బులు వస్తాయని ఆశిస్తుంది. ఆదాయం బాగా వస్తుందని ప్రభుత్వ అధికారులు లెక్కలు కట్టారు. ఇప్పటికే దీని పై మోఖిక ఆదేశాలు ఇవ్వగా, త్వరలోనే దీని పైన అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, నాలా పన్ను వసూలు కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో , అదే విధంగా పట్టన ప్రాంతాల్లో, నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, ఇలా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని, ఈ నిర్మాణాలకు సంబంధించి, ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి, చాలా మంది అనుమతులు తీసుకోలేదని, అందుకే ఈ వన్ టైం కలెక్షన్ ద్వారా వారికి బాంపర్ ఆఫర్ ఇచ్చి, డబ్బులు వసూలు చేస్తే, వారికి ఆ స్థలం క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి ప్రజలు ఏమంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read