ప్రతి ఒక్కరికీ ఏపి ఒక ప్రయోగశాల అయిపొయింది. ఇక్కడ ఉన్న కొంత మంది కుల పిచ్చ గాళ్ళని ఆసరాగా తీసుకుని, హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి రాజకీయం చేసే కొన్ని పార్టీలను అడ్డం పెట్టుకుని, ప్రతి ఒక్కడు వేలు పెడతా, కాలు పెడతా అని బయలుదేరుతున్నారు. తెలంగాణాలో నోరు ఎత్తని వాళ్ళు, కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యని వాళ్ళు, ఇక్కడ చంద్రబాబు పై వీర ప్రతాపం చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి, కొత్త పార్టీలు ప్రకటించి, తెలంగాణాలో పోటీ చేయం, ఏపి మా టార్గెట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే, మన ఏపి ప్రజలు వీళ్ళకు అంత అలుసుగా కనిపిస్తున్నారు. 9 ఏళ్ళు ముఖ్యమ్నంత్రిగా చేసారు, సైబరాబాద్ నిర్మించారు కాబట్టి చంద్రబాబు తెలంగాణాలో ప్రచారం చేసారు. అయితే, కేసీఆర్ అది సాకుగా చూపించి, ఏ నోటితో అయితే ఏపి ప్రజలను కుక్కలు, రాక్షసులు, దెయ్యాలు అన్నాడో, అక్కడికే వచ్చి వేలు పెడతా అంటున్నాడు.

owaisi 12122018

సరే రానివ్వండి, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే చంద్రబాబు ఇక్కడ ఉన్నారు కాబట్టి, వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. కేసీఆర్ కు తోడుగా, మేము వేలు పెడతాం.. జగన్ తో కలిసి ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అంటున్నడు ఒవైసీ.. ఏపీకి వెళ్లి జగన్‌కు మద్దతిస్తానని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీడీపీ రెండు స్థానాలు కూడా గెలవలేదని, జగన్ తో కలిసి మేము ఈ దిశగా పని చేస్తాం అంటున్నారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని, కేసీఆర్, జగన్, నేను కలిసి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం అంటున్నారు. ఇప్పటికే బీజేపీ చుక్కలు చూపిస్తాం అంటుంది, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నాడు, ఇప్పుడు ఒవైసీ వంతు.

owaisi 12122018

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాఖ్యలపై మంత్రి ఫరూక్ మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముస్లింల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం ఒవైసీకి తగదని హితవుపలికారు. ‘‘మా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసుకోవచ్చు...పోటీ చేయవచ్చు మీది, మాది ఒకటే నినాదం...మోదీ హఠావో- దేశ్ బచావో. మోదీతో లాలూచీ పడిన జగన్‌కు మద్దతిస్తామనడం సరికాదు. జగన్ ఎవరివైపు ఉన్నారో తెలుసుకుని మద్దతివ్వాలి’’ అని ఫరూక్‌ కోరారు. మరో పక్క, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్‌పై చంద్రబాబు స్పందించారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read