సంక్రాంతి వేళ కృష్ణా జ్జిల్లాలో కోడి పందాలు, ఎడ్ల పోటీలే కాదు... పడవల పోటీలు కూడా ఉంటాయి... ఎక్కడో తెలుసా... కృష్ణాజిల్లాలో కృష్ణా నది సముద్రంలో కలిసే నాగాయలంక, హంసలదీవి సమీపంలో సంక్రాంతిని పురస్కరించుకుని పడవల పోటీలు కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ పోటీలు జర్గుతున్నా పెద్ద గుర్తింపు ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక పండుగలను, రాష్ట్రవ్యాప్త ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని అనే ఉద్దేశంతో క్రిందటి ఏడాది, ఏపీ పర్యాటకశాఖ ఈ పోటీలను నిర్వహించింది. ఈ ఏడాది కూడా, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి...
తరతరాలుగా సముద్రాల్లోను, నదుల్లోనూ సంప్రదాయ పడవల్లో సంచరిస్తూ చేపలను వేటాడే విధానం మత్స్యకారులది. మరుగున పడిపోతున్న మత్స్యకారుల ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటి, వారిలో మానసికోలాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి దివిసీమ సంప్రదాయ పడవల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేరళ రాష్ట్రంలో నిర్వహించినట్లే ప్రతి సంక్రాంతికీ నాగాయలంకలో సంప్రదాయ పడవల పోటీలను నిర్వహించనుండటంతో అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పడవల పోటీలకు నాగాయలంక శ్రీరామపాదక్షత్రం పుష్కరఘాట్ లో నిర్వహిస్తున్నారు.
2016లో జరిగిన కృష్ణా పుష్కరాలకు నాగాయలంకలో జరిగిన పడవ పోటీలు, కృషాతీరం యాత్రికులను, ప్రభుత్వాన్ని విశేషంగా ఆకర్షించాయి. దీంతో ఇక్కడ సంప్రదాయ పడవల పోటీలను నిర్వహించేందుకు పర్యాటకశాఖ తొలి అడుగేసింది. తొలుత 2017 సంక్రాంతికి పడవల పోటీలను నిర్వహించగా, విశేష స్పందన లబించింది. దీంతో ప్రతి ఏడాదీ ఇక్కడ పోటీలను నిర్వహించాలని సంకల్పించింది. ఈ నేపధ్యంలో జలక్రీడల అకాడమీని మంజూరు చేసింది. నదులు, సముద్రంతో అనుబంధమున్న మత్స్యకార సామాజికవర్గంలోని యువతరానికి వివిధ అంశాల్లో శిక్షణనిచ్చి అంతరాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు నాగాయలంక కేంద్ర బిందువు కానుంది. దివిసీమ సంప్రదాయ పడవల పోటీలు నాగాయలంకలో నిర్వహించటంతో దివిసీమలో పండుగ వాతావరణం నెలకొంది. పుష్కరషూట్ ను శోభాయమానంగా అలంకరించారు. నాగాయలంక సెంటర్ నుంచి ఘాట్ వరకు రహదారికిరువైపులా బాదులను పాతి, విద్యుత్ తోరణాలతో ముస్తాబు చేశారు.