మా-చ-ర్ల-లో తమపై హ-త్యా-య-త్నం జరిగినప్పుడే, దా-డి-కి పాల్పడిన వారి వివరాలను మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేశామని, కానీ డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీనేతల కాల్ డేటాను పరిశీలించాల్సి ఉందని చెప్పడం చూస్తుంటే, తమపై జరిగిన హ-త్యా-య-త్నం ఎందుకు సఫలీకృతం కాలేదన్నబాధ పోలీసుల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. తమపై జరిగిన హ-త్యా-య-త్నం-లో తమ కాల్ డేటాను పరిశీలిస్తామంటున్న డీజీపీ, దానితో పాటుగా మాచర్ల సీఐ, ఎస్సై, తమపై దా-డి చేసిన తురకా కిశోర్, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలించాలని ఉమా డిమాండ్ చేశారు. మాచర్ల సీఐ తాము ఎటువెళుతోంది, ఎక్కడుంది వంటి వివరాలను బయటకు వెల్లడించాడని, స్థానిక పోలీసుల సహాయసహాకారాలవల్లే తమపై దా-డి జరిగిందని బొండా తేల్చిచెప్పారు. తమపై అంతతీవ్ర స్థాయిలో హ-త్యా-య-త్నా-నికి పాల్పడితే, దానిపై తొలుత కేవలం రెండు కేసులు నమోదయ్యాయని, నిందితులకు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్స్ పెట్టకుండా, తూతూమంత్రంగా కేసులు పెట్టి, నామ్ కే వాస్తేగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారన్నారు. తమపై జరిగిన హ-త్యా-య-త్నం, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేశాక, అప్పుడు నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారన్నారు.
సీఆర్పీసీ సెక్షన్ -160 కింద తమకు నోటీసు ఇచ్చి, విచారణ కోసం మాచర్ల రావాలని చెప్పడం జరిగిందన్నారు. ఒకసారి హ-త్యా-య-త్నం చేస్తే, తాము తప్పించుకున్నాము కాబట్టి, తిరిగి మరోసారి తమను హ-త-మా-ర్చా-ల-న్న ఉద్దేశంతోనే మళ్లీ మాచర్ల రమ్మంటున్నట్లుగా అనిపిస్తోందన్నారు. పోలీసలు తమకు పంపిన నోటీసుచూస్తుంటే, మమ్మల్ని హ-త-మా-ర్చ-డా-ని-కి మాచర్లలో అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లుగా అర్థమవుతోందన్నారు. పోలీస్ వ్యవస్థ వైసీపీ జెండాలు చేతపట్టి, ఆపార్టీ చొక్కాలు వేసుకొని పనిచేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. తమపై హ-త్యా-య-త్నం చేసిన కిశోర్, మరి కొందరిని ఎవరు పంపారు.. తమపై దా-డి చేయమని వారికి ఎవరు చెప్పారు... తాము మాచర్లకు వస్తున్నట్లుగా వారికి చెప్పిందెవరు... వారి వెనకున్నదెవరో చెప్పాలన్నారు. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, ఇద్దరూ పథకం ప్రకారమే, ప్రణాళికబద్దంగా తమపై హ-త్యా-య-త్నం చేయించారని బొండా ఆరోపించారు. మాచర్లలో తమను చం-పి-తే, ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలపై పడుతుంది తద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీకి టీడీపీ వారు ముందుకు రాకుండా చేయొచ్చనే సందేశం రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే తమపై దా-డి-కి పాల్పడ్డారన్నారు.
తనస్వార్థంకోసం, తాననుకున్నది నెరవేర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి ఎంతకైనా తెగిస్తున్నాడన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసుపై తమ అభిప్రాయం తెలియచేశామని, గుంటూరు పోలీసులపై తమకు నమ్మకంలేదని, తమ పర్యటనవివరాలను స్థానిక ఎమ్మెల్యేకు, అతని సోదరుడైన వెంకట్రామిరెడ్డికి తెలియచేసింది వారేనని చెప్పడం జరిగిందన్నారు. తమపై దా-డి చేయించిన వ్యక్తులైన మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల పేర్లు లేకుండా కేసుల నమోదుచేశారన్నారు. హైకోర్టు న్యాయవాది సహా, తమను దారుణంగా చం-ప-డా-ని-కి యత్నించినవారిని వదిలేసి, అనామకులపై కేసులుపెట్టి, విచారణ పేరుతో తమను మాచర్లకు రమ్మనడం చూస్తుంటేనే, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో.. ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పోలీసులు పంపిన నోటీసుపై తాము హైకోర్టులో ప్రైవేట్ కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు బొండా తెలిపారు. వైసీపీ కార్యకర్తలకన్నా ఎక్కువగా అత్యుత్సాహంతో పనిచేస్తున్న గుంటూరు రూరల్ ఎస్పీ, మరికొందరు పోలీసులను నమ్మలేకే తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు టీడీపీనేత స్పష్టం చేశారు. తమపై హ-త్యా-య-త్నం జరిగిన నాటినుంచి, పోలీసులు స్పందిచింన తీరు సహా, అన్ని వివరాలను హైకోర్టు దృష్టికి తీసుకెళతామన్నారు.
గుంటూరు రూరల్ ఎస్సీ, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కాల్ డేటాతో పాటు, తమ కాల్ డేటాను కూడా పరిశీలించి తీరాల్సిందేనని ఉమా స్పష్టంచేశారు. కాల్ డేటా వివరాలన్నీ మీడియా ముందు పెట్టి, డీజీపీ కార్యాలయంలో విచారణ జరిపితే, తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఆ విచారణలో రామకృష్ణారెడ్డి ప్రమేయం ఏమిటి... తురకా కిశోర్ ఎవరు.. అతనితో ఎవరు మాట్లాడారు అన్నీ తెలుస్తాయన్నారు. మాచర్లకు, తమకు సంబంధంలేదని, తామెవరమో.. తాము మాచర్లకు ఎందుకు వస్తున్నామో... ఆ వివరాలన్నీతురకా కిశోర్ కు ఎవరిచ్చారో తెలియాలన్నారు. తమపై దా-డి చేయడానికి మూడుచోట్ల స్కెచ్ లు వేసిందెవరు.. వెల్దుర్తి వాసులు మమ్మల్ని అడ్డుకోవడమేంటి.. పోలీస్ స్టేషన్ కి పర్లాంగు దూరంలోనే తమపై హ-త్యా-య-త్నం జరిగితే అవేమీ పట్టించుకోకుండా, మరలా విచారణకు రావాలని పోలీసులే చెప్పడం చూస్తుంటే, మరోసారి మమ్మల్ని చం-పేం-దు-కే-న-నే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశించినా కూడా సదరు పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వంవిధుల్లో కొనసాగించడం చూస్తుంటే తమ అనుమానాలన్నీ నిజమేనని అనిపిస్తోందన్నారు. వ్యవస్థలను కాపాడేది న్యాయస్థానాలేనని, వాటిలో తమకు న్యాయం జరుగతుందున్న నమ్మకం ఉందని, అందుకే ప్రైవేట్ కేసు వేయాలని నిర్ణయించుకున్నామన్నారు.