స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు భారీ గండి పడింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదించటంతో ఎస్సీ,ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నచోట వెనుకబడిన వర్గాల సీట్లు భాగా తగ్గాయి. జిల్లాల వారీగా విశ్లేషణ నివేదికలు విడుదల చేసిన తెలుగుదేశం... కొన్ని జిల్లాల్లో 24 శాతం కూడా దక్కలేదని ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం, జిల్లాల్ని యూనిట్‌గా చేసుకుని జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల కొన్నిజిల్లాలో ఊహించినదాని కంటే బీసీలకు తక్కువగా స్థానాలు వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు పోగా మిగిలినవాటినే బీసీలకు కేటాయిస్తారు. 1995 నుంచి ఇప్పటివరకూ బీసీలకు 34 శాతం సీట్లు దక్కుతున్నాయి. ఈసారి రిజర్వేషన్లు 50 శాతానికే కుదించడం వల్ల బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేశారు. కానీ రిజర్వేషన్ల జాబితా అధికారికంగా విడుదలయ్యాక చూస్తే అంతకుమించి స్థానాలు బీసీలకు కోతపడ్డాయి.

bc 08032020 2

తెలుగుదేశం అంచనాల ప్రకారం 2014తో పోల్చితే నెల్లూరు జిల్లాలో బీసీలకు కేవలం 13.04 శాతం సీట్లు మాత్రమే దక్కాయి. జిల్లాలోని 46 చొప్పున జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో బీసీలకు ఆరేసి చొప్పున కేటాయిచారు. 562 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 59 మాత్రమే బీసీలకు దక్కాయి. మొత్తం 46 మండలాధ్యక్షులకుగాను 16 మండలాల్లో బీసీలకు ప్రాతినిథ్యమే లేదని ఆయా వర్గాలు ఆవేదనలో ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో బీసీలకు ఒక్క జడ్పీటీసీ కూడా కేటాయించలేదు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుంటే ఒక్కటీ బీసీలకు దక్కలేదు. ఐతే ఎంపీపీ మాత్రం బీసీలకు రిజర్వ్‌ చేశారు. తడ మండలంలో ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలుంటే ఒక్క జడ్పీటీసీ సీటు బీసీమహిళకు కేటాయించారు.

ఎంపీపీ ఒక్కటీ ఇవ్వలేదు. గూడూరు నియోజకవర్గంలో ఒక్క 60 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ బీసీలకు ఇవ్వలేదు. బీసీలకు.. తూర్పుగోదావరి జిల్లాలో 20.96 శాతం, కృష్ణాలో 20.4 శాతం, ప్రకాశంలో 19.64 శాతం, విశాఖలో 20.51 శాతం సీట్లే దక్కినట్లు తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలపై కావాలనే వైకాపా కక్షగట్టిందని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తొమ్మిది నెలల వైకాపా పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్ని అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సగం భాగం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తొలి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరించి.. ఈనెల 12న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 21న పోలింగ్ జరుగనుండగా.. ఈనెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి జిల్లాలో 2 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 17 నుంచి 19 వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 20న తొలివిడత నామినేషన్ల పరిశీలన.. 22వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ , అదే రోజు ఫలితాలు వెలువడతాయి.

jagan 08032020 2

ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 9న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.. 14న నామినేషన్ల పరిశీలన.. 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ నిర్వహించి.. 27న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న గ్రామాల విషయంలో, ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించ వద్దు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆపేయాలని ఆ లేఖలో ప్రభుత్వం కోరింది.

jagan 08032020 3

హైకోర్టులో ఈ గ్రామాల విషయంలో కేసులు, వ్యాజ్యాలు ఉన్నందున వాటి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అమరావతి ఉద్యమం నేపథ్యంలో, ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యంలోనే ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసినట్టు అర్ధం అవుతుంది. ఇక్కడ ప్రజలు గత 82 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కనుక ఎన్నికలు పెట్టి, ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో కనిపిస్తే, ప్రభుత్వం పరువు పోతుంది అని, జగన్ ప్రభుత్వం భయంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రజలను పలకరించే ధైర్యం కూడా వైసీపీ చేయలేక పోతుంది. ఈ నేపధ్యంలోనే, ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేం అని తెలియటంతో, ఎన్నికల కమిషన్ కు ఇక్కడ ఎన్నికలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 9 నెలలుగా, ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. వస్తాం అన్న పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. లూలు లాంటి ప్రముఖ కంపెనీలు, మీ ఆంధ్రప్రదేశ్ లో తప్ప, ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం అని చెప్పే పరిస్థతి. ఇక పీపీఏ ల విషయంలో, అయితే, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పరువు పోయే పరిస్థితి వచ్చింది. జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ప్రధానికి లేఖలు రాసి మోర పెట్టుకున్నాయి. ఇక, ప్రపంచంలోని పెట్టుబడిదారులు అందరూ సమావేశం అయ్యే దావోస్ లో, కూడా పీపీఏ ల పైనే విమర్శలు. ఒక ప్రభుత్వం ఓకే అంటుంది, ఇంకో ప్రభుత్వం మారగానే, ఆ ఒప్పందాలు రద్దు చేస్తాయా అని అడుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, పెట్టుబడిదారులకు కాన్ఫిడెన్సు ఇవ్వాల్సిన ప్రభుత్వం, పెట్టుబడుల వాతవరణాన్ని మరింత చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే స్థిరపడి ఉన్న కంపెనీలను కూడా, రాజకీయ కోణంలో చూసి, వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధమైన ధోరణి ఉంటే, ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

galla 08032020 2

ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటి, అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌. ఈ కంపెనీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందినది అని అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు కడుతుంది, ఈ కంపెనీ. 1.2 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ కలిగిన ఈ కంపెనీలో, దాదాపుగా 6 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ కంపెనీ పై జగన్ కన్ను పడింది. రాజకీయ కోణంలో చూస్తూ, వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మొదలైంది. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన భూములినో సగం భూమిని, ఇప్పుడు వెనక్కు తీసుకోవాలని నిర్నయం తీసుకున్నారని, ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసారని, వచ్చే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు.

galla 08032020 3

అమరరాజా కంపెనీ, మొదటిగా చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని కరకంబాడీ ప్రాంతంలో బ్యాటరీస్‌ ప్లాంటు పెట్టింది. ఆ ప్లాంట్ నుంచే బ్యాటరీలను ఉత్పత్తి ప్రారంభించింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆ కంపనీ విస్తరణ కోసం, 483.27ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ 483.27 ఎకరాల గ్రోత్‌కారిడార్‌ ప్రాజెక్టులో 244.38 ఎకరాలను వెనక్కు తీసుకోవాలని, ఏపీఐఐసీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధాకరంగా, ఆ భూమిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు సమాచారం. ఈ భూమిని కూడా పేదలకు పంచి పెడతారా, లేక ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగిస్తుందో తెలియదు కాని, ఇది రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయంగా తెలుస్తుంది. ఇలా అనుకుంటే, కడపలో ఉన్న భ్రమ్మిణి స్టీల్స్ కాని, వాన్పిక్ భూములు కాని, ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, అక్కడ ఒక్క పరిశ్రమ కూడా లేదని, అవి పేదలకు ఎందుకు పంచి పెట్టటం లేదని, ప్రశ్నలు వస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నయానా భయానా, సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో గెలవాలని తాపత్రయపడుతోందని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్. రామసుందర రెడ్డిని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గసమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ఓడితే మంత్రులంతా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయాలని చెప్పడం, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని చెప్పాడన్నారు. సీఎం మాటలు చూస్తుంటే, ఎన్నికల్లో ఎక్కడ అధికారపార్టీ ఓడిపోతుందోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని, అనుకున్నస్థాయిలో అధికారపార్టీకి ఫలితాలు రావన్న భయంకూడా ఆయనలో కనిపిస్తోందని రామయ్య ఎద్దేవాచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచే, జగన్ ముఖ్యమంత్రిగా పరిగణింపబడరని, కేవలం వైసీపీ అధినేతగా మాత్రమే వ్యవహరించబడతారని, అటువంటి వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక నిఘా యాప్ ను ఆవిష్కరించాడన్నారు. ఆ విధంగా యాప్ ను ఆవిష్కరించే అధికారం ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ఉండదని, ఒక పార్టీ అధినేతగా ఉన్న ఆయన, అధికారయంత్రాంగం చేయాల్సిన పనిని తాను చేయడం రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధమన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, తప్పుచేసినవారిని పట్టుకోవడం, అభ్యర్థులు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కే ఉంటుందని రామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక, దానికి విరుద్ధంగా నిఘా యాప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించడం చట్టవిరుద్ధం కాదా అని వర్ల ప్రశ్నించారు. చట్టాలు గౌరవించాల్సిన వ్యక్తే, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తే, కోడ్ ఆఫ్ కండక్ట్ ను ధిక్కరించడం జరిగిందన్నారు. అటువంటి పనికి పాల్పడినందుకు తనపై ఏం చర్యలు తీసుకోవాలో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు. జగన్ నిఘా యాప్ ను ఆవిష్కరిస్తుంటే, అధికారులు దాన్ని నిరోధించకుండా, పక్కనే ఉండి ఆయనకు సహకరించారని, కాబట్టి వారుకూడా శిక్షార్హులే అవుతారని రామయ్య తేల్చిచెప్పారు. నిబంధనావళిని అతిక్రమించినందుకు జగన్ పై, ఇతర అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ ను కలవడం జరిగిందన్నారు.

మద్యం, డబ్బు పంచితే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమైనదని, అదొక తప్పుడు ఆర్డినెన్స్ అని, ప్రతిపక్ష పార్టీ సభ్యులను భయపెట్టి దారికి తెచ్చేందుకు, ప్రభుత్వం దానిని అస్త్రంగా వాడుకుంటోందని వర్ల దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగేవరకు, ఈ 22రోజుల పాలు రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసేస్తే ఏ గొడవ ఉండదని, అటువంటి పనిచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకుండా చట్టం ముసుగులో, గిట్టనివారిపై కక్ష తీర్చుకోవాలని చూడటం ఎంతవరకు భావ్యమని రామయ్య నిలదీశారు. గెలిచినవాడి పదవినికూడా, ముందు సరఫరా చేశాడనో.. డబ్బు పంచాడనో సాకులుచూపి, ఊడపీకేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేవరకు మందుసీసా అనేది కనపడకుండా చేయాలని, మద్యం దుకాణాలన్నీ మూసేయాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిని కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నిఘా యాప్ ను ఆవిష్కరించిన విషయం తనకు తెలుసునని, ఎన్నికల కార్యదర్శి కూడా చెప్పారన్నారు. మద్యం దుకాణాలు మూసేసినంత మాత్రాన ఎవరూ నష్టపోయేది లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వర్ల తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read