స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ అయిన వైకాపాతో అమీతుమీ తేల్చుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో సాగుతున్న ఆరాచక పాలనపై ప్రజలకు వివరించి అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా పావులుకదుపుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడడంతో ఆ ప్రభావం అన్ని వర్గాల జనజీవనం పై పడిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని యోచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు అధోగతి పాలవుతుందన్న అంశాన్ని ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నవమాసాలు-నవమోసాలు పేరిట ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించిన తెదేపా అదే ఊపులో స్థానిక సంస్థల్లో విజయబావుట ఎగుర వేసేందుకు కార్యా చరణను రూపొందించుకుంటోంది. గడచిన పది నెలలుగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతో పాటు, అభి వృద్ధి, సంక్షేమానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇదే సమ యంలో సంక్షేమరుణాల నిధులు, వివిధ వర్గాల కేటాయించి న నిధులు పక్కదారి పట్టిన విషయాన్ని ఆయా వర్గాల ప్రజలకు వివరించేందుకు సన్నద్ధమవుతోంది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి విజయం సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపు తోంది. ప్రధానంగా పది అంశాలతో ప్రజలను ఆకట్టుకు నేందుకు తగిన వ్యూహరచన చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోనుంది. గడి చిన 26 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఉండగా ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం వైఫ ల్యం వల్ల 24 శాతానికి కుదించబడ్డాయని దీంతో ఆయా వర్గా లు రాజకీయ సాధికారతను కోల్పోయారన్న విషయాన్ని బలంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించింది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం ముందు చూపుతో అలోచించి సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీలకు సరైన విధంగా రిజర్వేషన్లు ఇవ్వక పోవాతే, భవిష్యత్తులో, బీసీలు అధికారానికి దూరం అవుతారని, అందుకే, వారికి అండగా నిలబడేందుకు, ప్రభుత్వం ఇవ్వకపోయినా, పార్టీ తరుపున రిజర్వేషన్ ఇచ్చేందుకు టిడిపి రెడీ అయ్యింది. 34 శాతం దాటి, అవసరం అయిన చోట, 50 నుంచి 60 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

అంతేకాకుండా రేషన్ కార్డులు, పింఛన్ల తొలగింపు, ఇసుక మాఫియా, అమరావతి, పోలవరం, ఇళ్ళస్థలాల పేరిట భూముల కబ్దా, జేట్యాక్స్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీల పెంపు,నిత్యావసరా ల పెరుగుదల, పండుగ కానుకలు ఎత్తివేత, అన్న క్యాంటీన్ల మూసివేత, నిరుద్యోగ భృతికి మంగళం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిని ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి పింఛన్లు తొలగించడం, 20 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయడం వైకాపా ప్రభుత్వ ద్రోహంగా ప్రజలకు వివరిం చనుంది. రాష్ట్రంలో గతంలో ఉన్న సంక్షేమ పథకాలను, పండుగ కానుకలను ఎత్తివేసి పేదల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ప్రచారానికి సిద్ధమవుతోంది. 35కు పైగా సంక్షేమ పథకాలను ఎత్తివేశారని అంతేకాకుండా నిత్యావసరాల ధరలు ఆమాంతం పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ను ప్రచార అస్త్రాలుగా సంధిచనుంది. మరోవైపు ఎన్నికలకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్సీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పింఛన్లు ఇస్తామని ప్రకటించిన వైకాపా ఆ హామీని నిలబెట్టు కోలేదని ప్రశ్నిస్తున్న తెదేపా దీనిని కూడా స్థానిక పోరులో ఒక అస్త్రంగా సంధించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను కూడా తెదేపా ప్రచారానికి వినియోగించుకుంది. ముఖ్యంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్ళబకాయిలు, రైతు భరోసా పేరిట బురిడీ కొట్టారని అధికారపక్షంపై తెదేపా ఇప్పటికే మండిపడుతోంది. ఈ అంశాలన్నింటిని ఎన్నికలు అస్త్రాలుగా మలుచుకొని ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట వైకాపా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, అమరావతి తరలింపుపై ప్రజా రిఫరెండంకు తెదేపా సిద్ధమవుతోంది. విశాఖలో అధికారపక్ష నేతలు భూకబ్దాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న తెదేపా కజ్జాల వివరాలను ప్రజాక్షేత్రంలో వెల్లడించనుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో కొత్త ఇసుక, మద్యం పాలసీల వల్లజరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో 50 మందికిపైగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం, ఇసుక మాఫియా ప్రధాన అస్త్రాలుగా ఈ ఎన్నికల్లో సంధించనుంది. ముఖ్యం గా మద్యం అమ్మకాలు అక్రమాలు, జే ట్యాక్స్ వసూళ్ళకు అధికారపక్షం పాల్పడుతుందని విస్తృతమైన ప్రచారాన్ని చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్ర మ కేసులు, అమరావతి ఉద్యమం అణచివేత, పోలవరం పనుల నిలుపుదల, రివర్స్ టెండరింగ్ పేరిట రిజర్వ్ టెండ రింగ్ జరుగుతుందనిబలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పనిలో పడింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్థానిక సంస్థల ఎన్నికల్లో సద్వినియోగం చేసుకునే దిశగా వ్యూహత్మ కంగా అడుగులు వేసేందుకు కార్యాచరణను రూపొందించారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ధీటుగా ఎదుర్కొ నేందుకు కీలక కార్యాచరణ అమలు చేసే పనిలో తెదేపా బిజీ.. బిజీ..గా ఉంది.

స్ధానిక సంస్ధల ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ మెండిగా ముందుకెళ్తున్నారని అయినప్పటికీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్దంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాయలంలో స్ధానిక సంస్ధల ఎన్నికల సంధర్భంగా వైసీపీ పాలనలోని వైపల్యాలపై కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ....కరోనా వైరస్ ప్రభావ నేపధ్యంలో ఎక్కువ మంది మహిళలు ఒక చోట సమావేశమైతే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుందంటూ అధికారులు చెప్పటంతో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది మహిళలతో నిర్వహించాల్సిన మహిళా దినోత్సవం నిర్వహించలేదు. కానీ మరి ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? మేము ఇదే విషయాన్ని ఈసీకి తెలియజేశాం. కానీ ఈసీ మా వినతిని పరగనలోకి తీసుకోలేదు. ఎన్నికలపై ముఖ్యమంత్రి మెండిగా ముందుకెళ్తున్నారు. అయినా ఎదుర్కోనేందుకు టీడీపీ సిద్దంగా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి. ఒక్క అవకాశం ఇచ్చినందుకే జగన్ రాష్ర్టంలో విద్వసం సృష్టించారు. 35 సంక్షేమ పధకాలు రద్దు చేశారు. నిత్యవసరాల ధరలు పెంచారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్యక్ల్యం చేశారు. వైసీపీ 10 నెలల పాలనలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి.

వైసీపీ నేతలు ప్రజల ఆస్తులు కజ్జా చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు క్షీణించాయి. పాలన వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ఇప్పుడు మళ్లీ జగన్ కి ఇంకో అవకాశం ఇస్త్తారా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పటికే వైసీపీని గెలిపించి ప్రజలు వైసీపీని గెలింపించి భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టకున్నారు. మరో అవకాశం ఇస్తే మన నాశనాన్ని మనం కోరుకున్నట్లే అని వర్ల రామయ్య ప్రజలకు సూచించారు. ఎవరైనా పరీక్షలు ఉంటే... ఎన్నికలు వాయిదా వేస్తారు. కానీ ఈ రివర్స్ ప్రభుత్వం 10 వ తరగతీ పరీక్షలు వాయిదా వేసింది. పరీక్షలు వాయిదా వేయటం వల్ల విధ్యార్దులు మానసికంగా భాదకు గురైవుతాయరు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎన్నికల సంఘం ముక్కుసూటిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ రాజ్యంగం బద్దంగా, పారదర్శకంగా వ్యవహరించాలి. అని వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ తీరుపై పది ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు వైకాపా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ...జగన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అసహాస్యం చేస్తోంది. రాజ్యాంగంపై గౌరవం లేకుండా వ్యహరిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని స్ధానిక సంస్ధల్లో గెలవాలని అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఎన్నికల కోడ్ ముఖ్యమంత్రి నుంచి సామాన్యుని వరకు అందరూ సమానంగా పాటించాలి. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీకీ ఓటేయకపోతే సంక్షేమ పధకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు.

మంత్రి పేర్ని నాని బందరు నియోజకర్గంలో గ్రామ వాలంటీర్ల చేత ప్రజలను భయపెడుతున్నారు. మా పార్టీకి ఓటెయ్యకపోతే రేషన్, ఫించన్లు, సంక్షేమ పధకాలు రద్దు చేస్తాం. వైసీపీ ఓటేస్తే కొనసాగిస్తాం అంటూ.. ఓటర్ లిస్టు చేత పట్టుకుని గ్రామ సచివాయలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు ప్రజలను భయపెడుతున్నారు. దాన్ని ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టి మహిళలను కూడా మేజిస్ర్టేట్ ముందు హాజరుపర్చారు. కానీ జరిగిన సంఘటనకు వీరిపై పెట్టిన కేసులకు సంబందం లేదని తప్పడు కేసులు పెట్టినట్లగా మేజిస్ట్రేట్ చివాట్లు పెట్టింది. రాష్ర్ట వ్యాప్తంగా ఇదే విధంగా వాలంటీర్లు ప్రజలను బెదిరిస్తున్నారు. పోలీసుల్ని, అధికారుల్ని తమ చిప్పచేతిలో పెట్టుకుని, మద్యం, డబ్బు పంచి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రజాదనం ఇచ్చి వాలంటీర్ల చేత వైసీపీ తరపున ప్రచారం చేయించటం సిగ్గుచేటు. అసలు ఓటర్ లిస్టు వాలంటీర్ల చేతిలో ఎందుకు ఉంది? రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమం మద్యం వ్యాపారం చేస్తున్నారు. నిన్న రాత్రి అమరావతి మండలంలో వైసీపీ నాయకుడు కొత్త తిరుపతిరావు అనే వ్యక్తి తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తరలిస్తూ 900 బాటిళ్లతో అచ్చంటపేట పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇతను వైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యేలే అక్రమంగా లిక్కర్ అమ్మతున్నారనేదానికి ఇదే నిరద్శనం. దీని వెనుక ఉన్న నాయకుల్ని, ఎమ్మెల్యేని పోలీసులు వదిలేసి కేవలం కారును, బాటిళ్లను సీజ్ చేసి అమాయకులన్ని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు పక్క రాష్ర్టాల నుంచి అక్రకమంగా మద్యం తీసుకువచ్చి నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ కింద అమ్మతున్నారు. నెల్లూరు వాళ్లు తమిళనాడు, చిత్తూరు వైసీపీ నాయకులు కర్ణాటక, ఒరిస్సా నుంచి అక్రమంగా మద్యం తరలించి అమ్ముతున్నారు. . అక్రమం మద్యంతో ప్రజల ప్రాణాలు, మహిళల మంగళ సూత్రాలతో వైసీపీ నాయకులు చెలగాటమాడుతున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ని అడ్డుపెట్టుకుని పోలీసులు టీడీపీ అభ్యర్ధులను భయపెడుతున్నారు. అధికారులందరిపై ఒత్తిడి పెంచి వైసీపీ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్త్తోంది. ఒక్క అవకాశం ఇస్తేనే జగన్ రాష్ర్టాన్ని నాశనం చేశారు. మరొక్క అవకాశం ఇస్తే సర్వనాశనం చేస్తారు. మేం విడుదల చేసిన కరపత్రంలో జగన్ పది వైపల్యాను ప్రజలకు వివరిస్తున్నాం. దీనిపై ప్రజలు ఆలోచించి స్ధానిక ఎన్నికల్లో ఓటెయ్యాలి. ఈసీ ఎన్నికలు సక్రమంగా నిర్వహిచాంలి. అధికారులు నిబందనలకు అనుగుణంగా వ్యవహరించాలి. గతంలో జగన్ కి సహకరించిన అధికారలు ఏ విదంగా జైలు కెళ్లారో అధికారులు గుర్తుంచుకోవాలని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాల్లో భారీగా కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ దాదాపు ఏడాది పాటు పరిశీలన జరిపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన అంచనాల్లో ఏకంగా వేల కోట్ల రూపాయలను తగ్గించింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఏకంగా రూ.7,823.13 కోట్లకు కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ (ఆర్‌ఈసీ) దాదాపు ఏడాదిపాటు పరిశీలన జరిపి వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం రూ.47,725.74 కోట్ల మేరకు సవరించిన అంచనాలు ఖరారు చేసింది. దిల్లీలో శుక్రవారం ఆర్‌ఈసీ సభ్యులు సమావేశమై పోలవరం తుది అంచనాలు ఖరారు చేశారు. ప్రధానంగా ప్రాజెక్టు పునరావాసం.. ఆ తర్వాత కుడి, ఎడమ కాలువల పనుల వ్యయంలోనే కోత విధించారు. 2017-18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపింది. వీటిని కేంద్ర జలసంఘం దాదాపు ఏడాదిన్నరపాటు పరిశీలించి, అనేక ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత సాంకేతిక సలహా కమిటీకి పంపింది.

polavaram 08032020 2

ఆ కమిటీ 2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇది ఆర్‌ఈసీ పరిశీలనలో ఉంది. ఏడాది తర్వాత ఇప్పుడు కొలిక్కి వచ్చింది. పోలవరం అంచనాలు ఖరారు చేయడంలో కీలకమైన రెండు కమిటీల ఆమోదమూ పూర్తవడంతో వీటికి ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడమే తరువాయి. ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో దాదాపు రూ.5000 కోట్ల మేర పునరావాస వ్యయంలోనే కోత పడినట్లు సమాచారం. పోలవరం కుడి, ఎడమ కాలువలకు సంబంధించి పని పరిమాణం విషయంలో కమిటీ ప్రశ్నలకు ఇంజినీర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో దాదాపు రూ.2,800 కోట్ల వరకు ఆ పనుల్లో కోత విధించినట్లు సమాచారం.

polavaram 08032020 3

2005-06 ధరల ప్రకారం తొలుత అంచనాలు: రూ.10,151.04 కోట్లకు ఆమోదం. 2010-11 ధరల ప్రకారం అంచనాలు: రూ.16010.45 కోట్లకు ఆమోదం. 2017-18 ధరల ప్రకారం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.55,548.87 కోట్లుప్రస్తుతం సవరణ కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.47,725.74 కోట్లు. అయతే ఇంత జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ఎలాంటి ఒత్తిడి లేదనే చెప్పాలి. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్నాయి. మరో పక్క రాజ్యసభ సీటు విషయంలో, బీజేపీ పై ఒత్తిడి పెట్టి, పనులు చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో కూడా, కేంద్రం పై ఒత్తిడి పెంచకుండా, కేంద్రం ఏది చేసినా, ఏమి చెయ్యకుండా, రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని కేంద్రం ఒక చట్టం తీసుకువచ్చింది. ఇందులో అనేక నిర్ణయాలు, రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోతుంది కాబట్టి, ఏపికి ఎక్కవుగా ఈ చట్టంలో పెట్టారు. అయితే, అవి ఎంత వరకు నేరవేరాయో, ప్రజలకు తెలుసు. ప్రజలకు ఉపయోగపడే విభజన హామీలు, ఒక్కటీ ఇప్పటి వరకు నెరవేరింది లేదు అనే చెప్పాలి. అయినా ప్రజలు కేంద్రంతో పోరాడే వారిని పక్కన పెట్టి, కేంద్రంతో లాలూచి పడే వారినే ఎన్నుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ విభజన హామీల్లో, ఏపికి వివక్ష కొనసాగుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ డైరెక్ట్ గా గొంతు కొస్తే, ఇప్పటి బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా చేసింది ఏమి లేదు. అయితే వీరు డైరెక్ట్ గా కోయ్యకుండా, తడి గుడ్డతో, నొప్పి తెలియకుండా కోస్తున్నారు. ఇప్పుడు కూడా, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సమస్యల పై కేంద్రం వైపు చూస్తున్నా, కేంద్రం కనీసం పట్టించుకోవటం లేదు.

seats 08032020 2

రాష్ట్రంలో అమరావతి విషయం తీసుకుంటే, ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చు చేసి, రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చిన తరువాత, కేంద్రం కూడా 1500 కోట్లు ఇచ్చిన తరువాత కూడా, అమరావతిని మూడు ముక్కలు చేస్తాం అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, కనీసం కేంద్రం పట్టించుకోవటం లేదు. అది మా సమస్య కాదు అని చేతులు దలుపుకుంటుంది. ఇక పోలవరం విషయంలో కూడా అంతే. 72 శాతం పోలవరం పూర్తి చేసిన నవయుగని మార్చేసి, ఈ 10 నెలల్లో, కనీసం 2 శాతం పనులు కూడా పూర్తి చెయ్యకుండా రాష్ట్రం ఉంటే, ఆ విషయంలో కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇక వెనుకబడిన జిల్లాలకు, ఇచ్చే 350 కోట్లు నిధులు, ఇప్పటికి ఆపి, మూడేళ్ళు అయ్యింది. అదీ దిక్కు లేదు. ఇలా దాదాపుగా 16 విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి.

seats 08032020 3

ఇక పొతే, ఈ విభజన హామీల్లో, ఒక రాజకీయ హామీ కూడా ఉంది. ఇవి ప్రజలకు అంతగా ఉపయోగం లేకపోయినా, పరిపాలన సౌలభ్యానికి ఉపయోగపడే హామీ ఇది. అదే యోజకవర్గాల పునర్విభజన. రాష్ట్ర విభజన జరిగినప్పుడు, నియోజకవర్గాల పునర్విభజన చేస్తాం అని చెప్పారు. ఇది కేంద్రం హోం శాఖ పరిధిలో ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అసోం, నాగాలాండ్‌తో పాటు, కొత్తగా విభజించిన జమ్మూకాశ్మీర్‌ లో, సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో, ఉన్న ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనను మాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి దీని గురించి కేంద్రానికి చెప్తున్నా, వేరే రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నారు కాని, కేసీఆర్, జగన్ కు మాత్రం షాక్ ఇచ్చారు. అయినా అమరావతి , పోలవరం లాంటి పెద్ద పెద్ద హామీలే పట్టించుకోని కేంద్రం, ఇలాంటి విషయల్లో మనకు న్యాయం చేస్తుందా.

Advertisements

Latest Articles

Most Read