విశాఖలో చంద్రబాబుని అడ్డుకునే క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సాగించిన దౌర్జన్యకాండ చూశాక, జగన్ దాష్టీకంపై, దుర్మార్గపు పాలనపై మరోసారి సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుమారం రేగిందని, జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి విమానం ఎక్కించి పంపించింది చంద్రబాబుని కాదని, కొన్ని లక్షలకోట్ల పెట్టుబడులను అంటూ ఒక పోస్ట్ విపరీతంగా చెలామణి అవుతోందని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వివరించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ పోస్ట్ నూటికినూరుశాతం వాస్తవమని, జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలు, ఎన్ని లక్షలకోట్ల పెట్టుబడులు పక్కరాష్ట్రాలకు తరలిపోయాయో ప్రజలంతా చూశారన్నారు. లులూ గ్రూప్, ఆదానీ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి పరిశ్రమలను తరిమేసి, లక్షలకోట్ల పెట్టుబడులను ఇప్పటికే తరిమేశారని, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని దమనకాండ సాగించడంద్వారా, భవిష్యత్ లో కూడా పారిశ్రామికవేత్తలెవ రూ రాష్ట్రంవైపుచూడకుండా జగన్ ప్రభుత్వం విధ్వంసకాండ సృష్టించిందన్నారు.

విశాఖ నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి 7వేల ఎకరాల భూముల్ని ఇప్పటికే వివిధకారణాలతో కాజేశారని, పేదవాడి భూమిని లాక్కుంటున్న నేపథ్యంలోనే చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చారన్నారు. ఆయనను అడ్డుకునే క్రమంలో జగన్ అండ్ కో సాగించిన వికృతక్రీడతో విశాఖ నగరం శాశ్వతంగా పెట్టుబడులకు దూరమైపోయిందని, పారిశ్రామికవేత్తలెవరూ నగర పొలిమేరల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. జగన్ సర్కారు విశాఖలో ఒకవైపు యుద్ధకాండ సాగిస్తుంటే, ప్రావిడెంట్ గ్రూప్ వారు తెలంగాణలో తమ ఆవిష్కరణ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, కేటీఆర్ తో చర్చలు జరిపిందన్నారు. ఆంధ్రాలో రోడ్లపై వైసీపీమూకలు దమనకాండ సాగిస్తుంటే, తెలంగాణలో అమెరికా సంస్థ రూ.700కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందన్నారు. రాష్ట్రం నుంచి పెట్టబడులు తరిమివేస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పట్టాభి ప్రశ్నించారు. జగన్ గొప్పతనం గురించి కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదస్సులో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం పీపీఏలపై నిర్వహించిన సమీక్షలవల్ల, దేశమే తీవ్రంగా నష్టపోయిందని, భారతదేశ ప్రతిష్ట తీవ్రంగా దిగజారిపోయిందని, దేశంలోకూడా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురాని దుస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింద న్నారు.

ఇండియా సక్సెస్ స్టోరీని జగన్ లాంటి వారు కిల్ చేస్తున్నారని కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. అదే కేంద్రమంత్రి దావోస్ వెళ్లినప్పుడు కూడా ఏపీ ముఖ్యమంత్రి తీరుపై పారిశ్రామికవేత్తలంతా ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. . 2018 జనవరిలో యూఎస్ టీడీఏ (యునైటెడ్ స్టేట్స్ ట్రేడింగ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ) తో విశాఖ అభివృద్ధికి సంబంధించి, చంద్రబాబునాయుడు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దేశంలోనే విశాఖ నగరాన్ని అత్యుత్తమ నగరంగా మార్చడమే ఆనాటి ఒప్పందంలోని ముఖ్య ఉద్దేశమన్నారు. నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా ఉండిఉంటే, తెలంగాణకు తరలిపోయిన రూ.700కోట్ల ప్రావిడెంట్స్ సంస్థ పెట్టుబడులు, ఏపీకే వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు చేసుకున్నఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసి ఉంటే, విశాఖ నగరం అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు పొంది ఉండేదన్నారు. జగన్ నిర్వాకాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ వాసులు ఎక్కడికి వెళ్లినా, మేం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు తమది ఏపీ అని చెప్పుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని, జగన్ రాష్ట్రానికి ఎంతటి తలవంపులు తీసుకొచ్చాడో ఆయన చర్యలతోనే స్పష్టమవుతోందన్నారు. జగన్ అవినీతి చర్యలపై ఇప్పటికే జర్మనీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు ప్రధానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు.

జగన్ నిర్వాకాలు, అవినీతి చర్యల కారణంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోతలు విధించాలని, కేంద్రప్రభుత్వ చేసుకున్న ఒప్పందాలు, విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించే రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులురాకుండా చేయాలని కూడా పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. దీనిపై ఒకచట్టం చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగిందన్నారు. జగన్ చర్యల కారణంగా భవిష్యత్ లో రాష్ట్రానికి ఏవిధమైన నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయిందని, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలని పట్టాభి నిలదీశారు. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పట్టాభి తేల్చిచెప్పారు. 5ఏళ్ల కొకసారి ఎటుపడితే అటు దొర్లుకుంటూ పార్టీల్లోకి వెళ్లే బంతిలాంటి అవంతికి, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని, ఆ బంతిని ఎప్పుడు బూటుకాళ్లతో బంగాళాఖాతంలోకి తందామా అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారని పట్టాభి దెప్పిపొడిచారు.

నిన్న విశాఖలో, వైసీపీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా అంతర్జాతీయ విమానశ్రయంలోకి, రాళ్ళు, గుడ్లు తీసుకు వెళ్లి, వీరంగం సృష్టించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న వ్యక్తి వస్తుంటే, అంత మంది, వేరే పార్టీ వాళ్ళని, అక్కడకు పోలీసులు రాణించిన తీరు పై విమర్శలు వచ్చాయి. అదీ కాక, నాలుగు అయుదు గంటలు, చంద్రబాబుని కదలనివ్వకుండా ఉంటే, వారిని ఎందుకు చెదరగొట్ట లేదు అనే ప్రశ్నకు కూడా వచ్చాయి. సాక్షాత్తు హైకోర్ట్ కూడా ఇదే ప్రశ్న పోలీసులను అడిగింది. ఒకానొక సందర్బంలో, పరిస్థతి చేయి దాటే పరిస్థతి వచ్చినా, పోలీసులు మాత్రం వైసీపీ మూకలను అక్కడ నుంచి తరమకుండా ఉంచటం పై, విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు, ఇందులో ఏమైనా కుట్ర ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే, ఇదే సందర్భంలో, నిన్న చంద్రబాబు భద్రత విషయంలో కేంద్రం వెంటనే స్పందించినట్టు, వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన పరిణామాల పై, కేంద్ర హోం శాఖ స్పందించినట్టు తెలుస్తుంది.

home 28022020 2

నిన్న చంద్రబాబు గారిని నిలువరించే సందర్భం, అరెస్ట్ చేసే సందర్భంలో, పోలీసుల తీరు పై ఆయన కేంద్ర భద్రతా అధికారులు అయిన ఎన్ఎస్‌జీ (NSG) సెక్యూరిటీ, మొత్తం కేంద్ర హోం శాఖకు నివేదించింది. ఇంత జరుగుతున్నా ఆందోళనకారులను క్లియర్ చెయ్యక పోవటం పై వారు ఆందోళన చెందారు. అదే సందర్భంలో, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటనికి వీలు లేదని, పోలీసులు తెగేసి చెప్పారు. మొత్తం విషయాన్ని ఎప్పటికప్పు కేంద్ర హోంశాఖకు నివేదించారు. పరిస్థితి చేయి దాటితే, ఫైర్ ఓపెన్ చేసే అవకాసం ఇవ్వాలి అంటూ, వారు పై నుంచి ఆదేశాల కోసం అడిగినట్టు, అదుపు తప్పితే కనుక, అలాగే చెయ్యండి, అంటూ కేంద్ర హోం శాఖ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

home 28022020 3

అయితే ఈ మొత్తం వ్యవహారం పై కేంద్రం కూడా సీరియస్ అయ్యిందని, డీజీపీకి కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబుని అడ్డుకుంటాం అని మంత్రులు చెప్పినా, రాజు అనే ఒక వ్యక్తి ఆర్గనైజ్డ్‌గా మొత్తం చేస్తున్నట్టు ముందే తెలిసినా, ఎందుకు నిలువరించ లేదు అని వివరణ అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది అంటూ వివరణ కోరినట్టు తెలుస్తుంది. ముందుగా ఆయన రావటానికి పర్మిషన్ ఇచ్చి, తరువాత అల్లరి చెయ్యటానికి వచ్చిన వారిని అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందో వివరణ కోరినట్టు తెలుస్తుంది. అయితే, ఈ విషయం పై, అధికారికంగా సమాచారం లేదు, కొన్ని వార్తా చానల్స్ ఈ విషయం పై, వార్తలు ప్రసారం చేసాయి.

విశాఖపట్నం లో ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నేత మాజి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఈ పిటీషన్ దాఖలు చేసారు. విశాఖ విమానాశ్రయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టులో లంచ్ మోషన్ ను పిటిషన్ దాఖలు చేసారు టీడీపీ నేతలు. విచారణను న్యాయస్థానం స్వీకరించింది. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర కు ముందస్తు అనుమతి తీసుకున్న వైసిపి కార్యకర్తలని నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది పిటీషన్ వేసారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 వాదనలు ధర్మాసనం విననుంది. మధ్యాహ్నం కోర్ట్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేదాని పై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. పర్మిషన్ ఇచ్చిన పోలీసులు, తరువాత వైసీపీ కార్యకర్తలను అంత మందిని ఎయిర్ పోర్ట్ లో, అనుమతి ఎందుకు ఇచ్చారు అంటూ, ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే విషయం కోర్ట్ కూడా అడిగే అవకాశం ఉంది.

నిన్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో చంద్రబాబుని గట్టిగానే అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణులకూ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మధ్య తోపులాట, వాగ్వివాదాల మధ్య తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. చంద్రబాబు రాకను వైఎస్సార్‌ సీపీ శ్రేణులు గోబ్యాక్.. గోబ్యాక్ నినాదాలు చేయగా... రావాలి చంద్రబాబు... జిందాబాదు. చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు నినాదాలతో ఎయిర్ పోర్టు ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఉదయం నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకూ కూడా ఎయిర్పోర్టు ఆవరణంలో ఉద్రిక్తత కొనసాగింది. నగరంలోకి అనుమతివ్వకుండా రాత్రి ఎడున్నర గంటల సమయంలో చంద్రబాబును హైదరాబాదుకు తిప్పి పంపడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపధ్యంలో ఆయనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, మద్దతుగా టిడిపి శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరకముందే... వైఎస్సార్సీ, టిడిపి కార్యకర్తలు, ప్రజాసంఘాలు తదితరులు ఎయిర్‌పోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.

అదే సమయంలో.. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా చంద్రబాబును పోలీసులు కోరారు. అనుమతి ఇచ్చాక వెనక్కి ఎందుకు వెళ్లిపోవాలంటూ చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. గంటపాటు నిరీక్షించిన అనంతరం శాంతి భద్రతల సమస్యల పరిరక్షణకు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద చంద్రబాబుకు ముందస్తు నోటీసు ఇచ్చి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చంద్రబాబుతో పాటు టిడిపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎయిర్పోర్టులోని లాంజ్ కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్లోకి చేరుకున్న చంద్రబాబు, మాజీ మంత్రి చిన రాజప్ప, ఎమ్మెల్యేలు వాస వల్లి గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు వివిధ అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల నడుమ విజయవాడకు కానీ... హైదరాబాదుకు కానీ తిరిగి వెళ్లాలని పోలీసులు కోరినప్పటికీ... తాను వెళ్లేది లేదని తన పర్యటనకు అనుమతి ఇచ్చి... తనను ఎందుకు నిర్బంధించారని చంద్రబాబు ప్రశ్నించారు. తాను వెనక్కి వెళ్లే సమస్యే లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొన్ని శుభకార్యాలకు కూడా వెళ్లాల్సి వుందని చెప్పినప్పటికీ.. పోలీసులు మాత్రం నగరంలోకి వెళ్లేది లేదని స్పష్టంచేశారు. దీంతో రాత్రి ఏడున్నర గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబును విమానంలో హైదరాబాదుకు పంపించారు.

అందరూ అనుకున్నట్టే అయ్యింది. మరో సారి, పోలీసులకు, ప్రభుత్వానికి హైకోర్ట్ చేతిలో మొట్టికాయలు పాడ్డాయి. నిన్న చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వటం, పోలీసులు పర్మిషన్ ఇవ్వటంతో, చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు పర్యటనలో కేవలం 50 మంది టిడిపి నేతలే ఉండాలి అంటూ, చెప్పిన పోలీసులు, అనూహ్యంగా, వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ఎయిర్ పోర్ట్ లోపలకి వస్తున్నా, వారిని ఆపాకుండా కూర్చున్నారు. అంతే కాదు, వారు టమాటాలు, కోడి గుడ్లు, రాళ్ళు తెస్తున్నా, పోలీసులు వారిని నిలువరించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ లోపలకు తనిఖీ చేసి పంపుతారని, అలాంటిది రాళ్ళూ, కోడిగుడ్లు లోపలకు ఎలా వచ్చాయి అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, చంద్రబాబు కాన్వాయ్ కదల నివ్వకుండా, దాదపుగా నాలుగు గంటల పాటు, ఆయన్ను రోడ్డు మీద ఉండేలా చేసారు. వైసీపీ కార్యకర్తలు వీరంగం సృస్తిస్తున్నా పోలీసులు ఏమి చెయ్యలేదు.

court 2802020 2

చివరకు అయుదు గంటల తరువాత, చంద్రబాబుని అరెస్ట్ చేసారు. 151 నోటీస్ ఇచ్చి, చంద్రబాబుని అరెస్ట్ చేసారు. అయితే గొడవ చేసి, వీరంగం సృష్టించిన వైసీపీ మూకలను వదిలేసి, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం, ఆయన్ను తిప్పి హైదరాబాద్ పంపటం పై, విమర్శలు ఎదురు అయ్యాయి. పర్మిషన్ తీసుకుని వచ్చిన చంద్రబాబు, పర్యటన జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులుది అయితే, అడ్డుకుంటానికి వచ్చిన వారిని ఏమి చెయ్యకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం మరో విడ్డూరం. ఈ మొత్తం సంఘటన పై , ఈ రోజు తెలుగుదేశం పార్టీ హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై, ఈ రోజు హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో, హైకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది.

court 2802020 3

అధికారంలో ఉన్న వారికి ఒక రూల్‌, ప్రతిపక్షంలో ఉన్న వారికి మరో రూల్‌ ఉంటుందా? చట్టం ముందు అందరూ సమానమే కదా ? అని హైకోర్టు ప్రశ్నించింది. షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా? అక్కడ ఆందోళన చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు ? వారి పై ఏ చర్యలు తీసుకున్నారు ? ఎయిర్ పోర్ట్ కు రాకుండా వారిని ఎందుకు నిలువరించలేదు ? అంటూ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీని పై తమకు పూర్తీ స్థాయిలో కౌంటర్‌ కావాలి అంటూ, డీజీపీ, విశాఖ సీపీని హైకోర్టు ఆదేశిస్తూ, కేసుని వచ్చే నెల 2కు వాయిదా వేసి, ఆ రోజు దీని పై తదుపరి విచారణ చేస్తామని చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read