నిన్న రాజధానిలో పర్యటించిన ప్రతిపక్ష నేత జగన్, అమరావతిలో ఒక్క ఇటుక అయినా పెర్చారా, అని గోబెల్స్ ప్రచారం మొదలెట్టారు... రాజధాని శంకుస్థాపనకు నన్ను పిలవద్దు, నేను రాను అన్నోడు, ఇప్పుడు అదే రాజధాని గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు... రికార్డు టైంలో దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా కట్టిన, సచివాలయం కనిపించలేదు ఈయనకు... సంవత్సర కాలం నుంచి, జరుగుతున్న విషయాలు తెలియవు ఏమో పాపం...

ప్రపంచం లోనే ఇంత వేగం గా ఒక కొలిక్కి వస్తున్న నూతన రాజధాని నిర్మాణం అమరావతి ఒక్కటే ..అది కూడా ప్రభుత్వం దగ్గర తగినంత భూమి , నిధులు లేకపోయినా కూడా...కేవలం ఒకే ఒక్క వ్యక్తి మీద నమ్మకంతో, 33 వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసారు రైతులు...

1. రాజధాని ప్రాంతం గా అమరావతి ఎంపిక ( 2014 డిసెంబర్)- CRDA గా ఏర్పాటు
2. ల్యాండ్ పూలింగ్ స్కీం - 33 వేల ఎకరాల భూసమీకరణ - కుట్రలను, కుల రాజకీయాలను కూడా ఎదుర్కొని
3. సోషల్ దేవేలోపేమెంట్ కార్యక్రమాలు - ల్యాండ్ పూలింగ్ పధకం లో భాగం గా భూయజమానులకు రునమాఫి, కౌలు, నష్ట పరిహారం, పెన్షన్ లాంటివి ( 2 వేల కోట్ల బడ్జెట్ -10 ఏళ్ళు )
4. అన్ని రకాల పర్యావరణ అనుమతులు ( కోర్ట్ కేసులను, ద్రోహులను తట్టుకుని)
5. రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ - సింగపూర్ ( ఉచితం గా)
6. చీఫ్ ఆర్కిటెక్ట్ ఎంపిక - కోర్ కాపిటల్ కోసం ( 2 సార్లు )
7. అమరావతి స్టార్ట్ అప్ ఏరియా( 7 చ కిమీ) కోసం స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్స్ (2 సార్లు ) - కొంత మంది అమరావతి వ్యతిరేకుల కోర్ట్ కేసుల వలన, ఇప్పటికే టెండర్ పిలుపు, వచ్చే ఏప్రిల్ లో పనులు ప్రారంభం
8. తాత్కాలిక సచివాలయం నిర్మాణం ( 6 లక్షల చ అడుగులు)
9. రాజధాని లోని కొండవీటి వాగు ముంపు ఎత్తి పోతల కు టెండర్స్
10. సీడ్ ఆక్సెస్ రోడ్ - 7 దారుల్లో
11. తాత్కాలిక శాసనసభ భవనాలు - ఈ నెలాఖరుకు సిద్దం
12. రాజధాని కోసం ఆర్ధిక వనరుల వెతుకులాట
13. అమరావతి లో హోటల్స్ కోసం టెండర్స్
14. అమరావతిలో స్కూల్స్, కాలేజీ ల కోసం టెండర్స్
15. రాజధాని నీటి అవసరాలకోసం పులిచింతల పూర్తీ, నిలవ సామర్ధ్యం 30 టి ఎం సి లకు ఇప్పటికే పెంపు
16. రాజధాని తాగునీటి అవసరాలకు పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తీ
17. రాజధానికి తరలి వచ్చిన ఉద్యోగులకు అన్ని వసతులు ఏర్పాటు
18. రాజధాని విమానాశ్రయం - గన్నవరం ..ఆధునీకరణ
19. ఇప్పటికే వందల సంఖ్యలో వ్యాపార సంస్థల ఎంక్వైరీ లు, మీటింగ్ లు
20. రాజధానికి వన్నె తెచ్చేలా కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు
21. రాజధాని నుండి అనంతపురం కు ఎక్ష్ప్రెస్స్ హై వే పనులు ప్రారంభం
22. రాజధాని ప్రాంతం చుట్టూ ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ఔటర్ రింగ్ రోడ్
ఇవే కాకుండా, రాజధాని ప్రాంతాల్లో విజయవాడ - గుంటూరు లో పూర్తిగా నవీకరణ, అభివృద్ధి
ఇన్ని పనులు 2 ఏళ్లలో పూర్తికావడం ఆషా మాషీ గా ఉందా
చంద్రబాబు టాస్క్ మాస్టర్ కాబట్టి ఒక పద్దతి ప్రకారం అన్నీ పూర్తీ చేసుకుంటూ వస్తున్నాడు
సౌజన్యం : ఆంధ్ర గ్రోత్ సెంటర్ (ఫేస్బుక్ పేజి)

ఈ క్రింద డిటైల్డ్ రిపోర్ట్ చూడండి, రాజధాని కోసం, ఏ రోజు ఏ పని చేసారో, తెలుస్తుంది.
http://www.crda.ap.gov.in/APCRDADOCS/DataModuleFIles/Reports/01~1758Amaravati%20Project%20Report%20-%20Ed1%20March%202016.pdf

jagan 20012017 2

jagan 20012017 3

jagan 20012017 4

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దుర్గ గుడి దగ్గర ఫ్లై-ఓవర్ నిర్మాణంతో అటు వైపు ట్రాఫిక్ కష్టాలు కొంచెం తగ్గే అవకాసం ఉంది. బందర్ రోడ్డు విస్తరణ తరువాత, అటు వైపు కూడా ఉపసమనం వచ్చే అవకాసం ఉంది. ఎటు పోయి, ఇప్పుడు సమస్య అంతా రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు. ఈ మార్గం గన్నవరం ఎయిర్ పోర్ట్ వైపు ఉండటం, సిటీ ఎక్కువగా ఇటు వైపు పెరగటం, విద్యా సంస్థలు, ఆఫీసులు ఎక్కువగా రావటంతో, ఈ రోడ్డులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. సాయంత్రం వేళ నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ రావటానికి, దాదపుగా 30-45 నిమషాల సమయం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారాలు ఆలోచిస్తుంది ప్రభుత్వం.

రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు అదనంగా రోడ్డును ఇరు వైపులా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు పేర్కొ న్నారు. ఈ విస్తరణకు సబంధించి త్వరలోనే సర్వే చేయాలన్నారు.

బెంజి సర్కిల్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు పెద్ద ఫ్లై-ఓవర్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పడిప్పుడే ఇది అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి, రామవరప్పాడు నుంచి రోడు విస్తరణ జరుగుతుందని తెలిపారు. రామవరప్పాడు నుంచి నిడమానూరు మార్గంలో మెట్రో మార్గం కూడా రానున్నందున ఫ్లై-ఓవర్ సాధ్యం కాని పరిస్థితి ఉందని కలెక్టర్ బాబు పేర్కొ న్నారు.

Page 2546 of 2546

Advertisements

Latest Articles

Most Read