జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని, రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన హక్కుని ప్రతిపక్షంపై, ప్రజలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తున్నారని, వేధింపులే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 14ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడికి భద్రత తగ్గించడం కూడా జగన్ కక్షసాధింపుల్లో భాగమేనని రామయ్య తెలిపారు. అలిపిరి ఘటనలో 26 క్లైమోర్ మైన్స్ పెట్టి చంద్రబాబుపై దాడికి పాల్పడ్డారని, ఆనాటి నుంచి కేంద్ర్ర ప్రభుత్వం ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతను కూడా కొనసాగిస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక, చంద్రబాబు భద్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని, అతి కీలకమైన అంశాన్ని కూడా తన రాజకీయ అవసరాలకు వాడుకోవాలని జగన్ చూస్తున్నాడని వర్ల ఆక్షేపించారు. 146మంది సిబ్బందితో కొనసాగుతున్న చంద్రబాబు భద్రతను 67 మందికి తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే, సీఎం ఆలోచనల వెనుక కుట్రకోణం దాగి ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు.

చంద్రబాబుకి భద్రత తగ్గించడం ద్వారా ఆయన్ని ఏమీ చేయాలని చూస్తున్నారో జగన్ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. సీఎం వ్యవహారశైలి ఎంతమాత్రం సరియైనది కాదని, చంద్రబాబు భద్రత విషయంలో జగన్ తన రాజకీయ క్రీనీడను చొప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ కు ఉన్న జడ్ కేటగిరి భద్రతను కూడా తగ్గించి, వై స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ రాజకీయ విధానమేంటో, చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రతను తగ్గించడం ద్వారా ఏ విధమైన ఆలోచనలు చేస్తోందో చెప్పాలని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు, ఎర్రచందనం స్మగ్లర్లు, కొన్ని అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబునాయుడికి ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో, ఇటువంటి నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదని వర్ల స్పష్టంచేశారు. భద్రత తగ్గింపు చర్యల ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన మనసులో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్పాలని, ఇంటిలిజెన్స్ వ్యవస్థకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. విశాఖలో ఎన్నికలకు ముందు ఒక ఎమ్మెల్యేను నక్సలైట్లు కాల్చిచంపిన ఘటనను ప్రజలెవరూ మరిచిపోలేదన్నారు. ప్రస్తుతం తీసుకున్న చర్యల ద్వారా జగన్ ఆలోచనా విధానం ఏస్థాయిలో ఉందో జనం కూడా ఆలోచించాలని వర్ల తెలిపారు.

వ్యవస్థలపై, సిద్ధాంతాలపై నమ్మకం లేకుండా, కోర్టులంటే భయంలేకుండా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి, రాచరికపోకడలతో, నియంతృత్వ విధానాలు అవలంభిస్తున్నాడని రామయ్య దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిపాలనలో రాజ్యాంగ బద్ధంగానే పాలించాలనే విషయాన్ని జగన్ గుర్తించాలని, ప్రతి చర్య, ప్రతివిధానం కూడా న్యాయబద్ధంగానే జరగాలని స్పష్టంచేశారు. చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రత తగ్గించడమనేది జగన్ తీసుకున్న నిర్ణయమేనని, ఆయనతో పాటు, ఆయనపార్టీకి కూడా ఇందులో ప్రమేయముందని వర్ల తేల్చిచెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకవైపు టీడీపీనేతలను బెదిరిస్తూ, మీసాలు తిప్పుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష సభ్యుల భద్రతను తగ్గిస్తూండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ల భద్రతను వెంటనే పునరుద్ధరించాలని, అలా చేయకుంటే జరిగే సంఘటనలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని వర్ల స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేత భద్రతతోనే ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతోందని, అతికీలకమైన వ్యక్తి భద్రత అంశంలో ఇటువంటి చర్యలు సరికాదని వర్ల తెలిపారు. సెక్యూరిటీ అంశంపై తామేమీ ఆందోళన చెందడంలేదని, ప్రభుత్వ చర్యలు చూస్తుంటే తమకు పలు అనుమానాలు కలుగుతున్నాయని, జగన్ చర్యల వెనుక ఏదో దురుద్దేశం ఉందనిపిస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వర్ల అభిప్రాయపడ్డారు.

మండలి రద్దు, మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ కు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్ర శాసనమండలి రద్దును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్లను కోరిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో వాస్తవ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించడం ద్వారా ప్రభుత్వ నిర్ణయానికి చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాంవేసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇంకా పలువు కేంద్ర మంత్రులను కలిసి వివరించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటనపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సారథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్బబు, బుద్దా వెంకన్న, సత్యనారాయణరాజు, రామ్మోహన్, దీపక్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి వైదొలగిన నేపథ్యంలో బీజేపీకి టీడీపీ రాజకీయ ప్రత్యర్ధిగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని, కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్లపై సందేహాలు వ్యకమవుతున్నాయి. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ తమకు ప్రధాన శత్రువులని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నా ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ భాగ స్వామి అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జగన్ల మధ్య జరిగిన ఆంతరంగిక చర్చల పర్యవ సానం ఏమిటనేది ప్రతిపక్ష పార్టీలకు అంతుచిక్క టంలేదు.

కాగా మూడు రాజధానులను వ్యతిరే కిస్తూ అమరావతిలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో పాటు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మండలి రద్దుపై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణ యించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నం దున మండలి సెలక్ట్ కమిటీకి అప్పగిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారని, దీంతో మండలినే రద్దుచేస్తూ శాసనసభలో అధికార పార్టీ ఏకపక్షంగా తీర్మానం చేసిందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లా లని టీడీపీ భావిస్తోంది. చైర్మన్ బిల్లుల్ని సెలక్ట్ కమి టీకి పంపిన నేపథ్యంలో మండలి రద్దు చేయటం రాజ్యాంగ విరుద్ధమనే వాదనను కేంద్ర పెద్దలకు వినిపించాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. మండలి రద్దు, మూడు రాజధానుల నిర్ణయంతో పాటు ప్రతి పక్షాలపై ప్రభుత్వ వేధింపులు, ప్రజా వ్యతిరేక చర్య లపై కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు.

వైసీపీ నేతలకు దమ్ము, దైర్యం ఉంటే చంద్రబాబు, జగన్‌ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సవాల్‌ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ...ప్రతిసారి సాక్షి పేపర్‌ గురించి మాడాలంటే సిగ్గుపడుతున్నాం. ఐటి దాడుల్లో రూ. 2 వేల కోట్లు చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్ద దొరికాయంటూ సాక్షి పేపర్‌, టీవీ, వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారు. కానీ వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారానికి ఐి శాఖ ఇచ్చిన పంచనామా వారికి చెంపపెట్టులా ఉంది. దీంతో వైసీపీ నేతలు, తేలు క్టుిన దొంగల్లా ఉన్నారు. సాక్షి మీడియాకు, వైసీపీ నేతలకు సవాల్‌ విసిరుతున్నా.. ఆ డబ్బు చంద్రబాబు గారి ఎకౌంటు లోకి ఎలా వచ్చిందో చెప్పాలి. జగన్‌లా చంద్రబాబు క్విడ్‌ ప్రోకో ద్వారా, జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బు సంపాదించలేదు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తుల్ని ప్రతి సంవత్సరం ప్రకిస్తున్నారు. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా..తీసుకోమని వైసీపీ నేతలకు సవాల్‌ విసురుతున్నారు. చంద్రబాబు ఆస్తులపై, జగన్‌ అవినీతి ఆస్తులపై బహిరంగ చర్చకు టీడీపీ తరపున నేను వస్తా...వైసీపీ నేతలెవరికైనా చర్చకు వచ్చే దమ్ముందా?

ఏంటైలో అయినా..ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్దం. జగన్‌ తన తస్తులు ప్రకించడానికి ఎందుకు వణుకుతున్నారు. ఐటి దాడులపై సాక్షి మీడియా చేసిన అసత్య ప్రచారాన్ని మిగిలిన చానళ్లు, పత్రికలు ఛీ కొట్టాయి. వైసీపీకి రూ. 150 కోట్లు ముడుపులు ఇచ్చినందుకే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారు. కాదని చెప్పే దైర్యం వైసీపీ నేతలకుందా? జగన్‌ ఎప్పుడు నిజాలు చెప్పరు. కోర్టులో కూడా ప్రతిశుక్రవారం నిజాలు చెప్పరు. పెద్ద నోట్ల ద్వారా అవినీతి జరుగుతోందని రూ. 2 వేల నోట్లు, 500 నోట్లు రద్దు చేయాలని కోరిన వ్యక్తి చంద్రబాబు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎన్ని కంపెనీలను బెదిరిస్తే వచ్చిందో చెప్పగలరా? పీకల్లోతు అవినీతిపై కూరుకుపోయిన వైసీపీ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. 2004 కు ముందు జగన్‌ ఆస్తులెంత ఇప్పుడెంత? అప్పుడు జగన్‌ క్టిన ఇన్కమ్ టాక్స్ ఎంత, ఇప్పుడున కడుతున్న ఇన్కమ్ టాక్స్ ఎంత? మంత్రి బుగ్గన అయినా ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలి.

జగన్‌ ఇంత డబ్బు ఎలా సంపాదించారు. ఏదైనా కంపెనీలో పనిచేశారా? కేవలం క్విడ్‌ప్రోకో , అవినీతి ద్వారా అక్రమంగా సంపాదించారు. జగన్‌ అక్రమాస్తులపై చర్చకు సాక్షి చానల్‌కే వస్తా..సీనియర్‌ జర్నలిస్టును న్యాయనిర్ణేతగా పెట్టండి. చంద్రబాబు ఆస్తుల గురించి నేను చెప్తా...జగన్‌ ఆస్తుల గురించి నేనడిని ప్రశ్నలకు బుగ్గన సమాధానం చెప్పాలి. నవంబర్‌ 11.2019లో జరగిన ఐటి దాడి గురించి ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారు. ఇన్నాళ్లు గాడిదలు కాసారా? వైసీపీ నేతలు తమ కళ్లలో దూలం పెట్టుకుని ఎదుటి వారి కంటిలో నలుసును వెతుకున్నారు. ప్రతి సవంత్సరం చంద్రబాబు తన తస్తులు ప్రకిస్తుంటే జగన్‌ ఎందుకు ప్రకిచంట లేదో ప్రజలే జగన్‌ని అడగాలి. సాక్షి పత్రికలో రాస్తున్న అబద్దాల గురించి చైర్మన్‌ భారతిరెడ్డికి నేను బహిరంగం లేఖ రాశా. సాక్షికి విలువలు లేవు. సాక్షి నీచస్ధితికి దిగజారింది. ఇకనైనా సాక్షిలో మార్పు వచ్చిందేమో అని లేఖరాశా. జగన్‌ సొంత మనుషుల ఇన్‌ప్రా కంపెనీలకు ఎన్ని కోట్లు జమయ్యాయో చెప్పగలరా? జగన్‌కి చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇకనైనా వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల రెండుసార్లు చేసిన ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారన్నారు. గత ఐదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తూనే వస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన చట్టం హామీ లను అమలు చేయలేదని, కనీసం కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు ఊసే లేదన్నారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి మాట్లాడడం లేదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ పక్కన పెట్టేశారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పదే పదే కేంద్రం చెబుతున్నా ఏపీకి చెందిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరు తెరవడం లేదని రామకృష్ణ అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ అవకాశవాదంతో ఢిల్లీలో జరిగిన విషయాలను బయటపెట్టడం లేదన్నారు.

ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు మధ్య జరిగిన చర్చల సారాం శాన్ని తక్షణం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 17న వామపక్షాల ఆధ్వ ర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాల యాల వద్ద ధర్నాలు చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నాల్లో అన్నివర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అయితే రామకృష్ణ ఇంతటితో ఈ విషయాన్ని వదిలి పెట్టలేదు. సమాచార హక్కు చట్టం, ఏపి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి దరఖాస్తు పంపారు. జగన్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని, జగన్ ఏమి విజ్ఞాపనలు ఇచ్చారు, కేంద్రం ఇచ్చిన హామీల వివరాలు తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.

మరో పక్క కాంగ్రెస్ పార్టీ కూడా, జగన్ ను ఈ విషయంలో విమర్సిస్తుంది. బీజేపీకి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైకాపాయేనని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఏస్ఆర్ సీకి ఓటేసి వచ్చి వైకాపా నాయకులు ఇక్కడ నీతులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఎస్ఆర్టీసీ వ్యతిరేకమని మోడీకి, అమిత్ షాకు జగన్ చెప్పవచ్చు కదా అని ప్రశ్నించారు. బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన కాపలాదారు వైసీపీనే అని రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రతి ఒక్కరికి ఒక వాడకంగా మారిందని అన్నారు. మండలి రద్దు రాష్ట్ర ప్రయోజనమా అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెప్పినా వారి కాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏమిటని శైలజానాథ్ ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read