ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నుంచీ సాక్షితోపాటు దానికి మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌ల్లో జ‌గ‌న్ బొమ్మ‌ల‌తో యాడ్స్ లేని రోజు లేదు. అయితే  వైసీపీ అధికారికంగా త‌న సొమ్ముని రూపాయి కూడా ప్ర‌చారానికి వాడుకోలేద‌ని ఎన్నిక‌ల సంఘానికి లెక్క‌లు అప్ప‌జెప్పింది. అంటే రోజూ జ‌గ‌న్ ఫోటోతో, వైసీపీ రంగులతో క‌నిపించే కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌ల‌న్నీ జ‌నం సొమ్ముతోనే అని తేట‌తెల్ల‌మైంది. ప్రకటనలు, ప్రచారాల కోసం మ‌న దేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల ఖర్చులను ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. 2021-22 ఏడాదికి పార్టీల వార్షిక ఆడిట్ నివేదిక ఆధారంగా పార్టీ పరంగా ఒక్క రూపాయి కూడా యాడ్స్‌ ఖర్చు చేయని పార్టీ వైసీపీ అని తేలింది. ప్రభుత్వం నుంచి అన‌గా ప్ర‌జ‌ల సొమ్ముతో మూడున్న‌రేళ్ల‌కు పైగా పాల‌న‌లో వందల కోట్లు వెచ్చించింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. అత్యధికంగా ప్రకటనలు, ప్రచారానికి రూ.313.17 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ అగ్ర‌స్థానంలో ఉంది. యాడ్స్ కోసం టీడీపీ రూ.1.66 కోట్లు, బీఆర్‍ఎస్ రూ.7.12 కోట్లు, సమాజ్‍వాదీ రూ.7.56 కోట్లు, టీఎంసీ రూ.28.95 కోట్లు, బీఎస్పీ రూ.13.83 కోట్లు ఖర్చు, ఆప్ రూ.30.29 కోట్లు, అన్నాడీఎంకే రూ.28.43 కోట్లు ఖర్చు, డీఎంకే రూ.35.40 కోట్లు, బీజేడీ రూ.16 కోట్లు, జేడీయూ రూ.36.82 లక్షలు ప్రకటనల కోసం  ఖర్చు చేశాయ‌ని ఈసీ వెల్లడించింది.  యాడ్స్ కోసం ఖ‌ర్చుల వివ‌రాలు ఈసీకి  అందించని పార్టీల జాబితాలో కాంగ్రెస్, సీపీఎం ఉన్నాయి.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌ కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచార‌ణ‌కి పిలిచింది. అయితే ఒక క‌న్ను మ‌రొక క‌న్నుని ఎందుకు పొడుస్తుంది అని ప్ర‌జ‌ల్నే అమాయ‌కంగా ప్ర‌శ్నించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎందుకో భయపడుతున్నారని, ఆయన  వ‌ర‌స ప‌ర్య‌ట‌న‌ల ర‌ద్దులు స్ప‌ష్టం చేస్తున్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో చ‌నిపోయార‌ని జ‌గ‌న్ క్యాంప్ ప్ర‌చారం చేసింది. అనంత‌రం నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ త‌న బాబాయ్ ని చంపేశార‌ని అబ్బాయ్ రాగం అందుకున్నారు. ఇదంతా అధికారం అందే వ‌ర‌కే. అంత‌వ‌ర‌కూ సీబీఐ ద‌ర్యాప్తు కావాల‌న్న జ‌గ‌న్ రెడ్డి, సీబీఐ ద‌ర్యాప్తు వ‌ద్దంటూ ప‌ట్టుబ‌ట్ట‌నారంభించారు. నిందితుల‌ని సీబీఐ అరెస్టు చేస్తుంటే అమాయ‌కులంటూ స‌ర్టిఫికెట్లు ఇస్తున్నారు. బాబాయ్ ని చంపింది ఎవ‌రో సీబీఐ చార్జిషీట్లో ప‌క‌డ్బందీగా పేర్కొంటే, బాబాయ్ కూతురు, అల్లుడిపై అనుమానాలు అంటూ క‌థ‌నాలు త‌న పేప‌ర్ సాక్షిలో రాయించారు. క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొచ్చ‌నే ఊహాగానాలు వ‌చ్చిన ప్ర‌తీసారీ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు. సీబీఐ విచార‌ణ‌కి అవినాశ్ హాజ‌రు అవుతుంటే, ఇటు జ‌గ‌న్ త‌న విశాఖ‌, పొన్నూరు ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎందుకు ర‌ద్దు చేసుకున్నారు. ఈ అనుమానాల‌న్నీ బాబాయ్ హ‌-త్య‌కేసులో అబ్బాయ్  వైపే చూపుతున్నాయి.

బాబాయ్ వైఎస్ వివేక కేసులో, దాదాపుగా 4 ఏళ్ళకు అబ్బాయ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ విచారణకు వెళ్తున్నారు. ఈ రోజు సిబిఐ విచారణకు హైదరాబాద్ వెళ్తున్నారు అవినాష్ రెడ్డి. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తున్నారు. ఈ విచారణ తరువాత అవినాష్ రెడ్డిని విడిచి పెడతారా , లేక అరెస్ట్ చేస్తారా అని రాష్ట్రం మొత్తం టెన్షన్ గా ఎదురు చూస్తున్న వేళ, అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐకి లేఖ రాసారు. ఈ రోజు విచారణకు వస్తున్నా అని, అయితే తన పైన ఒక వర్గం మీడియా, నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, పనిగట్టుకుని, తనకు ఈ కేసులో సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని లేఖలో రాసారు. ఈ కేసు తప్పుదోవపట్టించేలా వారే వార్తలు రాసారని అన్నారు. అందుకే విచారణ చాలా పారదర్శకంగా సాగాలని, తనని న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని, విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, సిబిఐని అవినాష్ రెడ్డి కోరారు. తనకు ఏ పాపం తెలియదని, కేవలం మీడియానే ఈ కేసులో ఇరికించే విధంగా కధనాలు రాసింది అని అవినాష్ రెడ్డి అన్నారు. మరి సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి మరి.

కుప్పంలో పాద‌యాత్ర‌లో పాల్గొని మాసివ్ హార్ట్ స్ట్రోక్ తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన నంద‌మూరి తార‌క‌ర‌త్న  చ‌నిపోతాడ‌ని విష‌ప్ర‌చారం చేసుకునేందుకు చాలా కంటెంట్ రెడీ చేసుకుంది వైసీపీ పేటీఎం బ్యాచ్‌. కందుకూరు, గుంటూరు తొక్కిస‌లాట‌ల ఖాతాల్లోకి తారకరత్న మ‌ర‌ణాన్ని చేర్చేసి చంద్రబాబు మీదకు తోసేయాలని నిన్నటి నుంచి కాచుకుని కూర్చుందిపేటీయం బ్యాచ్, బులుగు మీడియా. తార‌క‌ర‌త్న‌కి జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగి ఉంటే..దానిని సాకుగా చూపించి నారా లోకేష్ పాద‌యాత్ర ఆపేందుకు కూడా వైసీపీ పెద్ద‌లు వ్యూహం ప‌న్నారు. కుప్పం  ఆస్ప‌త్రి నుంచి బెంగళూరు నారాయ‌ణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్నను త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వెంట బాలకృష్ణ, తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. గోతికాడ గుంట‌న‌క్క‌ల్లా తార‌క‌ర‌త్న మ‌ర‌ణ‌వార్త కోసం నిరీక్షించిన పేటీఎం పెయిడ్ బ్యాచులు కొంద‌రు ముందే ఆ ఫేక్ కంటెంట్ ని వ‌దిలేశారు. బులుగు మీడియా వాడి ఓ చాన‌ల్‌ వాడైతే తార‌క‌ర‌త్న తొక్కిస‌లాట‌లో చ‌నిపోయాడ‌ని మెటీరియ‌ల్ సిద్ధం చేసుకున్నాడు. పేటీఎం వెబ్ సైట్లు తార‌క‌ర‌త్న‌పై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని పోస్టులు పెట్టేశారు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే వైసీపీ సోష‌ల్మీడియాకి  అన్నీ తానై చూసుకునే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి తార‌క‌ర‌త్న అల్లుడు అవుతాడు. సాయిరెడ్డి మ‌ర‌ద‌లి కూతురు అలేఖ్య‌రెడ్డినే తార‌క‌ర‌త్న భార్య‌. ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్మీడియాలో తార‌క‌ర‌త్నపై కుట్ర జ‌రిగి ఉండొచ్చ‌ని, ఏవి ప‌డితే ఆ పోస్టులు పెట్టొద్దంటూ న‌ర్మ‌గ‌ర్భంగా హెచ్చ‌రించాడు ఓ వైసీపీ సోషల్ మీడియాలో ఉండే ప్రముఖుడు. చివరకు వైసీపీ మంత్రులు కూడా తారకరత్న హార్ట్ స్ట్రోక్ ని, లోకేష్ కి ముడి పెట్టి ప్రచారం చేస్తున్నారు.మొత్తానికి ఇలా తయారయ్యింది రాజకీయం.

Advertisements

Latest Articles

Most Read