వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు దగ్గర కావస్తోంది. అధికారంలోకి వచ్చిన నుంచీ ఇప్పటివరకూ తెచ్చిన జీవోలలో చాలా వరకూ కోర్టులు కొట్టేశాయి. అసెంబ్లీలో పెట్టిన బిల్లులు కోర్టుల్లో చుక్కెదురు కావడంతో ప్రభుత్వమే కొన్ని వెనక్కి తీసుకుంది. తాజాగా ఫ్లెక్సీల నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోని ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తెస్తున్న జీవోలను కోర్టులు కొట్టేస్తున్నాయని మాపై ఏడ్చే బదులు ..ఆ జీవో తీసుకొచ్చే ముందు ఎఫెక్టయ్యే వర్గాలతో చర్చించితే బాగుండేది అని చురకలంటించింది. లక్షల మంది ఫ్లెక్సీల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా సడెన్‌గా ఓ సభలో ప్రకటించేశారు. నిషేధం విధించిన జగన్ రెడ్డి తనకు మాత్రం స్వాగతం పలికేందుకు ప్రతీచోటా ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నారు. ఫ్లెక్సీ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోని హైకోర్టు కొట్టేసింది. ఇప్పటివరకకూ ఇలాంటివి 100కి పైగానే జీవోలు కోర్టులు కొట్టేశాయి. మూడు రాజధానులబిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, శాసనమండలి రద్దు బిల్లు, రియల్ ఎస్టేట్ లేఅవుట్ లలో 5% ప్రభుత్వానికి భూమి ఇవ్వాలనే బిల్లులపైనా కోర్టులతో మొట్టికాయలు తినాల్సి వస్తుందని తామే వెనక్కి తీసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. అయితే వైసీపీ సర్కారు ఇస్తున్న జీవోలు, తెస్తున్న బిల్లులు నిబంధనలకు లోబడి ఉండేలా రూపొందించాల్సిన అధికారులు కావాలనే లోపభూయిష్టంగా చట్టాలను అతిక్రమించేలా రూపొందిస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. మొండిగా, రూల్స్ కి వ్యతిరేకమైన పనులు చేయాలని సర్కారు పెద్దలు పట్టుబడుతుండడంతో నిబంధనలు ఉల్లంఘించి మరీ చట్టవ్యతిరేక జీవోలు అధికారులు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
news
అక్కినేని వ్యాఖ్యల పై రియాక్ట్ అయిన బాలయ్య... బులుగు బ్యాచ్ కి గునపం దింపాడు...
ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో వేదికపై సాధారంగా మాట్లాడుతుండగా వచ్చిన `రంగారావు, అక్కినేని తొక్కినేని గురించి మాట్లాడుకున్నాం` అనే పదాన్ని పట్టుకుని విద్వేషాలు ఎగదోయాలని వైసీపీ భారీ స్కెచ్ వేసింది. దీనికి అక్కినేని క్యాంప్ కొంత సహకరించింది. ఎస్వీరంగారావు వారసులు చాలా హుందాగా స్పందించి పేటీఎం పెయిడ్ ఆర్టిస్టులకు పళ్లు రాలగొట్టినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అసలు ఈ వ్యాఖ్యలు చేసిన బాలయ్య ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్‍ఆర్ తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లు అని వారిని ఎప్పుడూ గౌరవించుకుంటూనే ఉంటానన్నారు. అక్కినేనిని కించపరిచేలా నేను మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రాస కోసం, యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్పా, కావాలని అనలేదని స్పష్టం చేశారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయ్ అని పిలుస్తానని, ఆయన పిల్లల కంటే ఎక్కువగా నాపై ప్రేమ చూపేవారని బాలయ్య వివరించారు. పొగడ్తలకు పొంగిపోవద్దని అనే విషయాన్ని అక్కినేని బాబాయ్ నుంచి నేర్చుకున్నానని ప్రకటించారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పిన బాలకృష్ణ పేటీఎం బృందాలు సృష్టించిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
డీజీపీ అలా... ఎస్పీ ఇలా... లోకేష్ పాదయాత్ర షరతుల పై, టిడిపి అసహనం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్రకు నాన్చి..నాన్చి అయిష్టంగా అనుమతులు ఇచ్చిన పోలీసులు మొత్తంగా 14 షరతులు పెట్టారు. ఇవన్నీ కూడా పాదయాత్రని అడ్డుకునే ఆంక్షలేనని టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. ఖాకీలు పెట్టిన ఈ షరతులు అన్నీ పాటించడం అసాధ్యం. అంటే పాదయాత్ర జరగకూడదనే ఆలోచనతోనే ఇటువంటి ఆంక్షలు పెట్టారని డిజిపి స్టేట్మెంట్తోనూ తేటతెల్లం అయ్యింది. డిజిపి పేరుతో విడుదలైన ప్రకటన మేరకు మొత్తం పాదయాత్రలో పాల్గొనే జనాలు సంఖ్య, వారి వివరాలు, వాహనాలు ఒకటేమిటి సర్వం అడిగారు. అప్పుడే యువగళం ముందుకు సాగకుండా ఉండే ఎత్తుగడ అని అర్థమైంది. చిత్తూరు ఎస్పీ 14 షరతులతో ఇచ్చిన అనుమతి చూసినా నారా లోకేష్ పాదయాత్రకి అనుమతి ఇవ్వడం ఇష్టంలేదని చెప్పకనే చెబుతున్నట్టున్నాయి షరతులు. ఏ రోడ్డుపైనా సభ పెట్టకూడదు, మూడు రోజులకోసారి అనుమతి తీసుకోవాలి. సాయంత్రం 5 గంటలకే క్లోజ్ చేయాలని..ఇవి 14 షరతులలో కొన్ని మాత్రమే. అన్నీ పాటించాల్సి వస్తే, పాదయాత్ర జరగనే జరగదు. టిడిపి కూడా ఏపీలో ఏ పాదయాత్రకీ లేని అనుమతులు, షరతులు నారా లోకేష్‌కి మాత్రమే ఎందుకంటూ ప్రశ్నిస్తోంది. పాదయాత్ర బరాబర్ చేసి తీరుతామని ప్రకటించింది.
దొంగ నోట్లు గుద్దుతుంది, వైసీపీ నేతలే.. కర్ణాటక పోలీసులు ఆపరేషన్ లో దొరికారు
ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు మొత్తం దొంగనోట్లు ఇచ్చిన వాలంటీర్ గుర్తున్నాడా? ఈ దొంగనోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే డౌట్ కూడా లేటెస్ట్ గా కర్ణాటక పోలీసుల అరెస్టుతో తేలిపోయింది. వైసీపీ పెద్దలకి బాగా కావాల్సిన వైసీపీ మహిళానేత రసపుత్ర రజని వద్ద లక్షల్లో దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు పోలీసులు. క్రిమినల్ హిస్టరీ షీట్ ఉన్న రజనీకి వెన్నుదన్నుగా వైసీపీ కీలక నేతలు నిలుస్తున్నారు. గతంలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో రజనీ ప్రధాన సూత్రధారి. బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు రజనీతోపాటు మరి కొందరిని అరెస్ట్ చేసి రూ. 44 లక్షల విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ కీలకనేతగా పెద్దల ఆశీస్సులతో చెలామణి అవుతోన్న రజనీని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా నియమించారు. మోసాలే వృత్తిగా రజనీ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆమె వెనుక బడానేతలు ఉండడంతో నోట్లు ముద్రించి ఏపీలో సర్కులేట్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రజనీ అరెస్టుపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయస్థానాలలో పోరాడుతామని, తప్పుచేయకపోతే అండగా ఉంటామని ప్రకటించారు.