తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఏదో ఒక వివాదంలోకి లాగాలనే వైసీపీ వ్యూహాలు ఎదురు తన్నేస్తున్నాయి. టిడిపి అధినేత బావమరిది కమ్ వియ్యంకుడైన నందమూరి నటసింహం బాలయ్యని లక్ష్యంగా చేసుకుని వైసీపీ పన్నిన రెండు వ్యూహాలు వరసపెట్టి ఎదురు తన్నేశాయి. ఐప్యాక్ టీము రచించిన ఈ కుల విద్వేషపు ప్రచారం, ఫ్యాన్ వార్ కి బాలయ్య అయితేనే కరెక్టుగా సూటవుతారని ఎంచుకున్నారు. మనిషి భోళా, , ముక్కుసూటితనం, బాలయ్య పేరుకి తగ్గట్టే లౌక్యం తెలియని కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం, చికాకు పెట్టేవాళ్లను చాచి కొట్టడం తమకు విషప్రచారాలకు పనికొస్తాయని ఐ ప్యాక్ ఆయనపైనే ఎక్కువ దృష్టి సారించింది. బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్, సినిమాలకి ఎన్ని అడ్డంకులు కల్పించినా బంపర్ హిట్ కావడంతో బాలయ్య మంచి ఫాములో ఉన్నారు. బాలయ్యని కెలకడం ద్వారా టిడిపిని డిస్ట్రబ్ చేయాలన్నదే ఐప్యాక్ శకుని వ్యూహం. బాలయ్య వీరసింహారెడ్డి, చిరు వీరయ్యల మధ్య సంక్రాంతికి ఫ్యాన్ వార్ సృష్టించాలని, కులవిద్వేషాలు రెచ్చగొట్టాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. చివరికి వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో యథాలాపంగా ప్రాస కోసం పాకులాడి నోటినుంచి వచ్చిన అక్కినేని-తొక్కినేని డైలాగునే వైసీపీ పేటీఎం బ్యాచు మరో ఆయుధం చేసుకుంది. ఇది కూడా వైసీపీ ఫ్యాన్స్ అయిన అక్కినేని ఫ్యామిలీని పావుగా వాడింది. ఇక్కడా కులం కుతంత్రం ప్రయోగించేందుకు ఎస్వీరంగారావుని కించపరిచారంటూ కాపునాడు అనే వైసీపీ బ్రాంచిని దింపారు. అయితే ఎస్వీరంగారావుని బాలయ్య కించపరచలేదని, ఏ కులసంఘాలు గొంతుచించుకోనక్కర్లేదని ఎస్వీ రంగారావు వారసులు తేల్చి చెప్పేశారు. దీంతో ఎంత పకడ్బందీగా కుల విద్వేషం రెచ్చగొట్టాలనుకున్న ఐప్యాక్ మరో వ్యూహమూ దెబ్బయిపోయింది.
news
వైసీపీ ఎమ్మెల్యే కాపు రౌడీలు అంటే మనోభావాలు దెబ్బతినలేదా ?
బాలయ్య ఎస్వీ రంగారావుని ఏమనకుండానే కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ పేటీఎం బ్యాచులు బాగా హడావిడి చేశాయి. బాలయ్య అక్కినేని తొక్కినేని అన్నారు కాబట్టి దానికంటే ముందు ఎస్వీ రంగారావు పేరూ ఉందని..అందుకు కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ కోసం పనిచేసే బాడుగ కాపు సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఎస్వీ రంగారావు వారసులు అసలు బాలయ్య ఏమన్నారని హడావిడి చేస్తున్నారు కులసంఘాల పేరుతో అని గడ్డి పెట్టేసరికి నోరుమూసేశారు. బాలయ్య ఏమీ అనకుండానే కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చిన పేటీఎం బ్యాచీ వైసీపీకి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి కాపు రౌడీలంటూ అమ్మనాబూతులు తిట్టినప్పుడు ఎందుకు మనోభావాలు దెబ్బతినలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కాపుల్ని రౌడీలంటూ తిట్టడమే కాకుండా ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని కొట్టేందుకు కూడా ఎగబడ్డారు వెలంపల్లి. కాపు రౌడీల్లారా మీ అంతుచూస్తానని వైసీపీ ఎమ్మెల్యే బెదిరించినా వైసీపీకి కాపు కాసే ఏ కాపు మనోభావాలు ఎందుకు దెబ్బతినలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
చంద్రబాబు ఉద్విగ్నంగా ఉండటం వెనుక ఇంత స్టొరీ ఉందా ? పార్టీ నేతలు ఏమంటున్నారు..
ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం అలవాటైన ప్రత్యర్ధులు. ప్రతిపక్షం ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే సర్కారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైనే దా-డి చేయించిన అధికార పార్టీ. టిడిపి కేంద్ర కార్యాలయంపైకి గూండాల్ని పంపి ధ్వంసం చేయించి, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ రెడ్డి లాంటి రాక్షస పాలన చూడలేదని చంద్రబాబు పదేపదే ఆందోళన వ్యక్తం చేయడం మనం చూశాం. నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఆయనపై విషప్రచారం చేసేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టింది పేటీయం బ్యాచ్. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పిన వారు ఎక్కడున్నారో తెలుగు ప్రజలంతా చూశారు. మాస్క్ ఇవ్వలేని ప్రభుత్వం అని ఆరోపించాడని దళిత డాక్టర్ సుధాకర్ని, ప్రమాదకర మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని సోషల్మీడియాలో రాత్రి వీడియో పెట్టిన ఓంప్రతాప్ తెల్లారేసరికిఏమి అయ్యాడు, అవినీతిపై అసెంబ్లీలో నిలదీసిన అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు అయ్యాడు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శకి వెళ్లిన, బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన నారా లోకేష్ ఏ నిబంధన ఉల్లంఘించకుండా పర్యటించినా ఇప్పటివరకూ 15 కేసులు నమోదు చేయించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తనపైనే పదేపదే దా-డు-ల-కు దిగుతున్న గ్యాంగు, ఎప్పటి నుంచో టార్గెట్ చేసుకున్న తన కొడుకుపై కూడా దా-డు-ల-కు తెగబడుతుందని చంద్రబాబు భయం. లోకేష్ పాదయాత్రకి వెళ్తున్నప్పుడు హత్తుకున్న చంద్రబాబు గారి హావభావాల్లో చాలా గంభీరంగా, ఉద్విగ్నంగా ఉన్నాయి. సైకోలతో తలపడేందుకు తన కొడుకు లోకేష్ వెళ్తున్నాడని ఆ తండ్రి హృదయం ఎంతగా తల్లడిల్లిందో ఆ ఫోటోలు, వీడియోలే మౌనసాక్ష్యాలు.
ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు సీటిచ్చినా పోటీ చేయమంటున్నారు.. లిస్టు పెద్దదే...
వైసీపీ అధికారంలో ఉంది. అధినేత వై నాట్ 175 అంటున్నారు. అయితే నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. సిట్టింగులు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం సీటిచ్చినా పోటీ చేయలేం అంటున్నారు. కారణం ఏంటని బయటపెట్టకపోయినా, వైసీపీ దారుణ పరాజయం ఖాయమని తేలిపోయిందని, పోటీచేస్తే సంపాదించుకున్నదాంతోపాటు అప్పులు చేసి పెట్టినదీ పోతుందనే భావనలో వైసీపీ సీనియర్లున్నారట. ఈ విషయం బయటకు చెబితే అధినేత జగన్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటో ఆనం రాంనారాయణరెడ్డి ప్రత్యక్షంగా చూశారు. అందుకని జగన్ విచిత్ర మనస్తత్వం ఎరిగిన నేతలుగా సిట్టింగులు, మాజీ మంత్రులు తమ వారసుల కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతున్నారు. వారసులు పోరు పడలేక వారికే సీట్లు ఇవ్వాలని అడగడం ద్వారా ..ఇటు వారసుల ఆశ నెరవేర్చవచ్చని, ఓటమికి కారకులయ్యామనే అపవాడు దూరం చేసుకోవచ్చని, సంపాదించుకున్నది మిగులుతుందనే దూరాలోచనతో కొందరు వైసీపీ నేతలు ఉన్నారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, పేర్ని నాని, చెరుకువాడ రంగనాథరాజు వంటి వారు సీటుని వారసుల కోసం త్యాగం చేస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఓటమి భయమే వీరిని వెన్నాడుతోందని వారి అనుయాయులు చెబుతున్న వాస్తవం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వంటివారు ప్రతిపక్షం కంటే స్వపక్షం నుంచి ఎదురవుతున్న దాడులని తట్టుకోలేక ఏకంగా పోటీకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మొత్తానికి వైసీపీలో చాలా మంది మంత్రులుగా పనిచేసినవాళ్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి తప్పని ఎన్నికల్లో పోటీచేసి ఏం ప్రయోజనం అని ఆలోచించి ఏదో ఒక సాకుతో పోటీకి దూరం అయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట.