అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కి ఐపీఎల్ టీమ్ అవసరమా? మంత్రి పేషీలో అటెండర్లకి జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిన పాలకులు ఐపీఎల్ టీము ఆలోచన వెనుక ఏదో అతి పెద్ద కుంభకోణమే దాగి ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. జగన్ రెడ్డిని ఒకరు కలిశారంటే, ఏదో భారీ ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్రానికి నష్టం చేసే వేలకోట్ల పందేరానికో రంగం సిద్ధం అవుతోందని నాలుగేళ్ల పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వరసగా క్రికెటర్లు జగన్ రెడ్డితో భేటీ అవుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు మన ముఖ్యమంత్రిని కలవడం పెద్ద విశేషం ఏమీ కాదు. అందరూ ఆమోదించే భేటీలే. ఈ భేటీల వెనుక ఏదో లూటీకి స్కెచ్ వేస్తున్నారనే అనుమానమే ఇప్పుడు ఏపీ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన అంబటి రాయుడు ఇటీవల తాము గెలిచిన కప్పు పట్టుకుని వచ్చి సీఎం జగన్ రెడ్డికి చూపించాడు. సీఎస్కే గెలిచిన ఐపీఎల్ కప్‌ని తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. ఈ సీఎస్కే టీము యజమాని ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడు. ఇప్పుడు చుక్కలు కలపండి. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన చెన్నై సూపర్ కింగ్స్ టీము కప్పుని జగన్ వద్దకి ఎందుకు తెచ్చిందో? నిబంధనలకి విరుద్ధంగా టిటిడిలో ఐపీఎల్ కప్‌కి పూజలు ఎలా చేశారో? ఇప్పుడు మరో క్విడ్ ప్రోకో భేటీ లింక్స్ కలుపుతూ వెళితే ఇదీ అక్కడే తేలుతాయి. కోన శ్రీకర్ భరత్. మన రాష్ట్రం నుంచి టెస్ట్ కీపర్ గా ఎంపికయ్యారు. టెస్టుల్లో అంత ప్రతిభ కనపరచకపోయినా, మన తెలుగువాడనే అభిమానంతో మనం గౌరవించుకుంటున్నాం. 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మన కోన శ్రీకర్ భరత్ చేసిన మొత్తం పరుగులు 129. యావరేజ్ 18. అంటే ఒక టైలెండర్ కంటే తక్కువ పరుగులు-యావరేజ్. పోనీ ఐపీఎల్లో ఏమైనా ఇరగదీశాడా అంటే ఇప్పటివరకూ 10 ఐపీఎల్ మ్యాచులు ఆడిన కోన శ్రీకర్ భరత్ 200 పరుగులు కూడా చేయలేదు. తెలుగు క్రికెటర్‌కి జాతీయ జట్టులో స్థానం దొరకడం మనమంతా గర్వించేదే. కానీ కనీస పరుగులు చేయకుండా స్థానం ఎలా దొరుకుతోంది..అంటే ఇదిగో ఈ లింకులు చూడండి. జగన్ రెడ్డి కోటరీ స్వామీజీ విశాఖ స్వరూపానంద. జగన్ రెడ్డిని కాపాడే అదృశ్యశక్తి అమిత్ షా కొడుకు జై షా. కోన శ్రీకర్ భరత్ విశాఖలో స్వరూపానంద ఆశీస్సులు అందుకుంటే, జగన్ రెడ్డి ఆశీస్సులతో జై షా టీములో స్థానం ఇస్తారు. టీములో చోటు ఇప్పించే స్వామీజీ-జై షా ఆట ఆడించలేరు కదా! అదే మన భరత్ కి శాపం. తనకి టెస్టులో చోటు ఇప్పించిన సీఎం జగన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్‌కి వచ్చాడు. చెప్పాడు. కానీ సడెన్‌గా ఐపీఎల్ టీము ప్రపోజలే ఆశ్చర్యం. మళ్లీ ఏపీ ఐపీఎల్ టీముకి సీఎస్కే మార్గనిర్దేశకత్వం అంటే...ఏదో అతి పెద్ద క్విడ్ ప్రోకో స్కెచ్ రెడీ అవుతోందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
news
బాబు వల్ల బతికున్నాం...జగన్ అయితే చంపేసేవాడు
చంద్రబాబు వల్లే బతికి ఉన్నామని, బాబు ప్లేసులో జగన్ ఉంటే తమని చంపించేవారని కొండా మురళి, సురేఖలు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగన్ ఎంత క్రూరంగా ఉంటాడో వారు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తన ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి కొండా మురళిని ఎన్‌కౌంటర్ చేయాలని కాళ్లా వేళ్లా పడి బతిమలాడినా సీబీఎన్ ఒప్పుకోలేదని, సీఎంగా జగన్ అప్పుడు అయి ఉంటే తనను ఎన్‌కౌంటర్ చేయించి ఉండేవారని కొండా మురళి వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. జగన్ రెడ్డిది వక్రబుద్ది అని దుయ్యబట్టారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఎమ్మెల్సీ ఇస్తామని తమకు చెప్పి, ఆరు కోట్లు తీసుకుని వేరొక వ్యక్తికి జగన్ అమ్మేశారని ఆరోపించారు. జగన్ నిరసన కార్యక్రమాలకి జనం రాకపోతే, ఏడ్చుకున్నారని, దీంతో బస్సులు పెట్టి 25వేల మందిని తరలించామని దంపతులు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఆదేశిస్తే పార్టీ తరపున తాము ఏపీలో ప్రచారం చేస్తామని, జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో అక్కడి ప్రజలకు వివరిస్తామని కొండా దంపతులు వెల్లడించారు. వైఎస్‌ఆర్ కోసం పదవులకు రాజీనామా చేసినందుకు తాము ఎన్నడూ బాధపడబోమని.. కానీ ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డితో నడిచినందుకు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నామన్నారు. జగన్ కోసం తెలంగాణ ద్రోహులమయ్యామని, మానుకోట రాళ్లదాడిని ఎదుర్కొన్నామని ఆవేదన వెళ్లగక్కారు. ప్రస్తుత రాజకీయాల్లో అస్సలు నమ్మకూడని నాయకుడు జగన్ అని కొండా దంపతులు వివరించారు.
టిడిపి ఓట్లపై వేట్లు.. వైసీపీ దొంగ ఓట్లు రూట్లు పట్టించిన నేతలు
సింగిల్ సింహంని ఓటమి భయం వెంటాడుతోంది. వై నాట్175 ఏమో కానీ 17 కూడా వస్తాయో రావో కూడా డౌట్ కొట్టేస్తోంది. చేతిలో అధికారం మాత్రమే ఉంది. వలంటీర్ల వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేసేలా బరితెగిస్తున్నారనే రోజుకొక విస్తుగొలిపే ఓట్ల స్కాం బయటపడుతోంది. టిడిపి గెలిచే చోట వారి సానుభూతిపరుల ఓట్ల తీసివేత, వైసీపీ ఓడిపోయే చోట దొంగ ఓట్లు చేర్పించడం ఇదే రాష్ట్రమంతా సాగిస్తోంది వైసీపీ.
విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో వార్డులు, బూతులవారీగా టిడిపి సానుభూతిపరుల ఓట్ల గల్లంతుపై టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగు చూసింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించకుండా ఓట్లు తొలగించారని, దాదాపు 40 వేల ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.గుంటూరు పట్టాభిపురం 36 డివిజన్ లోని ఒకే డోర్ నెం. తో123ఓట్లు, అదే ఇంటి నెంబర్ తో33వ డివిజన్ పండరిపురం లో300ల ఓట్లు చేర్పించిన అధికారుల గుట్టుని టిడిపి నేతలు రట్టు చేశారు. గతంలో నివాసాలుగా ఉండి, నేడు స్కూల్ గా మార్చిన 36వ డివిజన్ లోని భవనంలో137ఓట్లను చేర్చించిన కార్పొరేషన్ అధికారుల అక్రమాలను ఆధారాలతో సహా టిడిపి నేతలు బయటపెట్టారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలా వైసీపీ వందల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించిన వైనంపై చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకి ఫిర్యాదు చేశారు.
జగన్ చుట్టూ చంద్రబాబు త్రిశూల వ్యూహం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సింగిల్ సింహాన్ని అంటూ మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారే కానీ..చంద్రబాబు పన్నిన త్రిశూల వ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాను. ఆఫ్రికా మోడల్ మూడు రాజధానులకి ఆద్యుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మూడు ప్రాంతాల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ అమలు చేసి చంద్రబాబు తన మాస్టర్ మైండ్ మరోసారి ప్రదర్శించారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టారు నారా లోకేష్. సీమలో అడుగు పెట్టారు చంద్రబాబు. మరోవైపు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఊపు తెచ్చేలా కార్యక్రమాలు రూపొందించారు. వీటిని నిర్వహించే బాధ్యత టిడిపి ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడుకి అప్పగించారు. ఎక్కడ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో జగన్ ఆలోచించే లోపే టార్గెట్ పూర్తి చేసి వచ్చేలా మెరుపు పర్యటనలు ప్లాన్ చేశారు బాబు. ఎటాకింగ్ మోడ్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఓ వైపు జగన్ రెడ్డి అవినీతిని, అస్తవ్యస్థ పాలనని ఎండగడుతూనే...మళ్లీ వైసీపీకి అవకాశం ఇస్తే జనానికి బతికే చాన్స్ లేదని చైతన్యం చేస్తూనే...టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకి చేసే మేలు-రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు వివరిస్తున్నారు.