అసెంబ్లీలో బుల్లెట్టు భాష‌తో బాగా ఫేమ‌స్ అయ్యారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్. మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎప్పుడొచ్చామ‌న్నది కాద‌న్న‌య్య‌..బుల్లెట్టు దిగిందా లేదా అంటూ పోకిరి డైలాగులు కొట్టి చివ‌రికి మంత్రి ప‌ద‌వి పీకేయ‌డంతో కనుమరుగు అయ్యాడు. రాష్ట్ర కేబినెట్లో ఉంటూ హ‌ల్చ‌ల్ చేసిన అనిల్ నోటిపారుద‌ల మంత్రిగా, ఇరిటేష‌న్ మంత్రిగా కూడా పేరుప‌డ్డారు. చివ‌రికి మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయ్యారు. ఇక్క‌డా మ‌న‌శాంతిగా ఉండ‌టానికి వీల్లేకుండా వైసీపీలో పెద్ద‌లు చేశారు. ఆర్థికంగా బ‌ల‌వంతుడైన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఆల్రెడీ రాజ్య‌స‌భ‌కి పంపారు జ‌గ‌న్. ఇప్పుడు ఆయన త‌న భార్య‌కి అనిల్ సీటు అడుగుతున్నారు అనే ప్రచారం ఉంది. ఇదీ ఓకే అయ్యింద‌ని టాక్ వినిపిస్తోంది. అనిల్ కుమార్ యాద‌వ్‌తో బాగా స‌న్నిహితంగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి దూరం అయ్యారు. అనిల్ ఆనుపానుల‌న్నీ తెలిసిన బాబాయ్ రూప్ కుమార్ యాద‌వ్ కూడా అబ్బాయ్ తో విభేదాలు మొద‌ల‌య్యాయి. మంత్రిగా ఉన్న‌ప్పుడే జిల్లాలోని రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో అనిల్ కి స‌ఖ్య‌త లేదు. మంత్రి ప‌ద‌వి పోయాక అనిల్ పేరు వింటేనే ఆ వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

anil 24012023 2

ఈ నేప‌థ్యంలో వేమిరెడ్డి నెల్లూరు సిటీ సీటుపై క‌ర్చీఫ్ వేసేశారు. ఇది తెలిసిన నుంచి అనిల్ త‌న‌లో తానే ర‌గిలిపోతున్నాడు. తాజాగా మీడియా ముందుకొచ్చి త‌న అక్క‌సునంతా వెళ్ల‌గ‌క్కేశాడు. అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తు న్నాడు.. రాసుకోండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. గ‌తంలో పోల‌వ‌రం డిసెంబ‌ర్ 2020 అని డేట్ ఫిక్స్ చేశాడు. 2023 డిసెంబ‌ర్ రాబోతోంది కానీ పోల‌వ‌రం పూర్తి కాలేదు. ఆ పోల‌వ‌రం చాలెంజ్ మాదిరిగానే ఈ సీటు చాలెంజ్ కూడా అని నెల్లూరు టాక్‌. అంతే కాదు, తాను జగన్ కు తప్ప ఎవరికీ తల వంచను అని, నేను పెద్దోడిని నా ముందు తల వంచాలి అంటే కుదరదని, నెల్లూరులో వైసీపీ పెద్దలకు చెప్పకనే చెప్పారు. అనిల్ కు ఈసారి ఎన్నికల్లో టికెట్ లేదని సిటీ నియోజ కవర్గంలో జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌డంతో పోటీచేసేది తానే రాసి పెట్టుకోండంటూ అనిల్ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించాడు. అయితే అనిల్ కి వైసీపీ మార్క్‌ బుల్లెట్టు దిగి చాలా రోజుల‌వుతోందని, మ‌నిషి కొంచెం ఫిట్‌గా ఉండ‌డం వ‌ల్ల తెలియ‌డంలేద‌ని పంచ్ డైలాగులు వైసీపీ క్యాంప్ నుంచే పేలుతున్నాయి. మరి జగన్ ని ఇంతలా నమ్ముకున్న అనిల్ ను, జగన్ ఏమి చేస్తారు, మళ్ళీ నెల్లూరు సీటు ఇస్తారా, ఎక్కడైనా సర్దుబాటు చేస్తారా అనేది చూడాలి మరి.

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన నుంచీ ప్ర‌చార‌పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ప‌చ్చ‌నిచెట్లు కొట్టేసి, వాటికి మోడుకి వైసీపీ రంగులు వేయ‌డం, ప‌థ‌కాల పేర్లు మార్చేయ‌డం ద‌గ్గ‌ర నుంచీ ప్ర‌తీ విష‌యంలోనూ సీఎం జ‌గ‌న్‌ ప‌బ్లిసిటీ పిచ్చ చూపించుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కేస్ట్ స‌ర్టిఫికెట్ల మీద‌, పాసుబుక్కుల మీద, కొల‌త‌ల రాళ్ల మీద కూడా జ‌గ‌న్ రెడ్డి ఫోటోలు వేసుకోవ‌డం చూసి సామాన్య జ‌నం మా హ‌క్కుల‌పై జ‌గ‌న్ ఫోటోలేంటి అని బాహాటంగానే ప్ర‌శ్నిస్తున్నారు. అయినా వెన‌క్కి త‌గ్గ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు విద్యార్థులు పాఠ్య‌పుస్త‌కాలు, స్ట‌డీమెటీరియ‌ల్, నోటు బుక్కుల‌పైనా త‌మ ఫోటోలు, పార్టీ రంగులు వేసుకోవ‌డం అన్నివ‌ర్గాల నుంచీ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ. 1.20 కోట్లు వెచ్చించి 49వేల తెలుగు-ఆంగ్ల మాధ్యమ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ముద్రించ‌డానికి జడ్పీ నిధులు వెచ్చించారు.  ‘జగనన్న విద్యా భారతి’ పేరుతో ముద్రించిన ఈ స్టడీ మెటీరియల్ పుస్తకాల‌పై సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, జెడ్పి చైర్మన్, సీఈఓల ఫోటోలు వేశారు. మెటీరియ‌ల్ ఇంగ్లీషు మీడియం..క‌వ‌ర్ పై వైసీపీ ప్ర‌క‌ట‌న‌లు తెలుగులో ఉన్నాయి. విద్యార్థుల‌కు ఇచ్చే స్ట‌డీ మెటీరియ‌ల్ పై వైసీపీ నేత‌ల ఫోటోలు, రంగులు వేయ‌డంపై విద్యావేత్త‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అన్నంత ప‌నీ చేశాడు. అకార‌ణంగా త‌ప్పుడు కేసుల‌తో త‌న‌ను, త‌న కుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేస్తున్న వారిని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే టిడిపి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక మీ సంగ‌తి తేలుస్తానని ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌లేదు. నేరుగా ప్రైవేటు కేసుల‌తో అధికారుల‌ను కోర్టుకి లాగారు అయ్య‌న్న పాత్రుడు. తన ఇంటి ప్రహరీ గోడను రాత్రి సమయంలో కూల్చివేసిన అధికారులపై నర్సీపట్నం అదనపు జూనియర్‌ సివిల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్త్రేట్‌ కోర్టులో సోమవారం ప్రైవేటు కేసు వేశారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. నీటి పారుదల శాఖ స్థ‌లంలో గోడ నిర్మించార‌ని ఆరోపిస్తూ ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేత‌కు ఆదేశాలు ఇచ్చిన‌ ఆర్డీవో గోవిందరావు, ఏఎస్పీ మణికంఠ, తహసీల్దారు జయ, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, మరో 14 మంది అధికారులపై అయ్య‌న్న‌పాత్రుడు  ప్రైవేటు కేసు వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆదేశాలతోనే అధికార యంత్రాంగం ప్ర‌హ‌రీ ప‌డ‌గొట్టార‌ని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అక్ర‌మ కేసులు, దాడుల‌కు పాల్ప‌డుతున్న అధికారులు, పోలీసుల‌పై ప్రైవేటు కేసులు వేస్తామ‌ని ఎప్ప‌టి నుంచో బెదిరిస్తూ ఉంది. టిడిపి అన్న‌ట్టే అయ్య‌న్న‌పాత్రుడు ముందుకొచ్చి ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయ‌డంతో ప్ర‌భుత్వ ఆదేశాల‌తో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కి ఏం స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుందో అని భ‌య‌ప‌డుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉంద‌ని కేంద్ర‌మంత్రి దేవ్ సిన్ష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింద‌న్నారు. గుడ్ గవర్నెన్స్ లో జగన్ విఫలమయ్యార‌ని తెలిపారు.  కేంద్రం ఇచ్చే నిధులు, 14, 15 వ ప్రణాళికా సంఘం నిధులను ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుంటోంద‌ని ఆరోపించారు. కేంద్ర నిధులు ఇతర మార్గాల్లో ఖర్చు చేయ‌డం నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నేన‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాల‌న్నారు.  రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీ తెచ్చిన వాలంటీర్లు సేవ చేయడం లేద‌ని, ఇతర పార్టీలను అణచివేసేందుకు వాలంటీర్లను వాడుకుంటున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వ నిధుల‌ను వాలంటీర్లకు పంచుతున్నార‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం అమ‌లుచేస్తోన్న ఆయుష్మాన్ కార్డు పేదలకు ఇవ్వడంలేద‌ని  కేంద్రమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read