అందరూ అనుకున్నట్టే, లోకేష్ పాదయాత్ర మొదటి రోజు గడిచిందో లేదో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది ఏపి ప్రభుత్వం. అయితే ఇది లోకేష్ పైన కాదు,  అచ్చెన్నాయుడు పైన. నిన్న లోకేష్ పాదయత్ర సభలో,  అచ్చెన్నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆయన వైసీపీ చేస్తున్న అరచాకలకు, వారికి వంత పాడుతున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని, రూల్స్ పాటించకుండా తమని ఇబ్బంది పెడుతున్న పోలీసుల అంతు చూస్తామని అన్నారు. అలాగే నిన్న లోకేష్ కు ఇచ్చిన సెక్యూరిటీ పై కూడా  అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. 500 మంది భద్రత ఇచ్చామని చెప్తున్నారని, ఎక్కడున్నారని, వారంతా దె** తిని పడుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన పోలీసులు  అచ్చెన్నాయుడు పై కేసు నమోదు చేసారు.  అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే ప్రసంగం చేసారు అంటూ, పోలీసులు కేసులు పెట్టారు. దీంతో తెలుగుదేశం నేతలు మండి పడుతున్నారు. నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు పోలీసులని బూతులు తిడుతున్నా కేసులు ఉండవు అని, తమ ఆవేదన చెప్తుంటే, తమ పై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న ఉదయం లోకేష్ పాదయాత్రలో పాల్గుని, గుండె నొప్పితో కుప్పకూలిన తారకరత్నని, నిన్నటి నుంచి కుప్పంలో డాక్టర్ లు ట్రీట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పల్స్ లేకుండా హాస్పిటల్ కు వచ్చిన తారకరత్నకు, పల్స్ తెప్పించతంలో కుప్పం డాక్టర్ లు సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి వైద్యులు తారకరత్నకు వైద్యం అందిస్తూ, కాపాడుతూ వచ్చారు. మరింత మెరుగైన చికిత్స అవసరం అని, కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో చంద్రబాబు కర్ణటక ముఖ్యమంత్రితో మాట్లాడారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయాలని కోరారు. నందమూరి కుటుంబ సభులు, తారకరత్న భార్య అందరూ చర్చించి, తారకరత్నను బెంగుళూరు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి తరలించారు. కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్  ఉండగా, కేవలం గంటన్నర సమయంలోనే చేరుకున్నారు. అంబులెన్స్ లోని, ఐసీయూలో కూడా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. బెంగుళూరుకు చేరుకున్న వెంటనే, తారకరత్నకు డాక్టర్ ఉదయ్ అండ్ టీం చికిత్స మొదలు పెట్టారు. మరి కాసేపట్లో హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని తెలిసింది.

కుప్పం: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న అరాచకపాలనపై గళమెత్తుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళంపేరుతో మహాపాదయాత్రకు తొలి అడుగువేశారు. కుప్పంలోని వరదరాజస్వామిగుడిలో శాస్ర్తోక్తంగా పూజలు చేసిన అనంతరం వేలాది కార్యకర్తల జయజయధ్వానాల నడుమ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 11.03 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమైంది. తొలి అడుగు వేసే సమయంలో ఆలయం వెలుపల కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ జై లోకేష్, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో హోరెత్తించారు. మామ బాలకృష్ణ, నందమూరి తారకత్న, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు, వేలాదిమంది కేడర్ వెంట నడువగా యాత్ర ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 400రోజులపాటు 4వేల కిలోమీటర్ల పొడవున యువగళం యాత్ర సాగనుంది. పాదయాత్ర ప్రారంభమయ్యాక దారిపొడవునా మహిళలు హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. అడుగడుగో చంద్రన్న బిడ్డ అంటూ కుప్పంవాసులు లోకేష్ ను చూసేందుకు దారిపొడవునా ఎగబడ్డారు. గత 40ఏళ్లుగా చంద్రబాబునాయుడుపై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న కుప్పం వాసులు యువనేత చేపట్టిన మహాపాదయాత్రకు తమ ఆశీస్సులు అందజేస్తూ సంఘీభావం తెలిపారు. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆరేళ్ల బాలల నుంచి వృద్ధులవరకు రోడ్లవెంట నిలబడి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు.

మశీదు, చర్చిల్లో ప్రార్థనలు... అరకిలోమీటరు పాదయాత్ర అనంతరం లక్ష్మీపురం మక్కా మసీదు సందర్శించిన లోకేష్...మశీదులో దువాచేసి ముస్లిం మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత కుప్పం బాబూనగర్ హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్ షిప్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేయగా, పాస్టర్లు, క్రిస్టియన్ మతపెద్దలు దీవెనలందించాచరు. యువగళానికి సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలాడాయి. యువనేత వెంట భారీగా కదిలిన పసుపుదండుతోపాటు స్థానికులను అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టం తరంగా మారింది. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేష్ యువగళానికి కనీవినీ ఎరుగనిరీతిలో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.

ఈ రోజు ఉదయం కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టటానికి, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. బాలయ్య, తారకరత్న లోకేష్ తో కలిసి నడక మొదలు పెట్టారు. అయితే కొద్ది దూరం నడిచిన తరువాత తారకరత్న సోమ్మసిల్లి పడిపోయారు. అందరూ వడదబ్బ అనుకున్నారు కానీ, చివరకు అది గుండెపోటు అని తేలింది. నడుస్తూ నడుస్తూ పడిపోయిన తారకరత్నను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. బాలయ్య స్వయంగా హాస్పిటల్ కు వెళ్ళి, అక్కడ పరిస్థితితులు చక్కబెట్టారు.  యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు గుండెనొప్పిగా తేల్చి, ఒక స్టంట్ వేసారు. తారకరత్నకు ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక తారకరత్న విషయం తెలిసి, బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసారు. కళ్యాణ్ రాం కూడా బాలయ్యకు ఫోన్ చేసి, తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరం అయితే బెంగుళూరు తరలించాలని సూచించారు.

Advertisements

Latest Articles

Most Read