అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి, అనేక ప్రచారాలతో, అమరావతి పై నెగటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు. ఒక పక్క అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతిని రాష్ట్రంలో అందరికీ కనెక్ట్ అయ్యేలా, అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చారు. అలాగే 10 రూపాయలకు ఇటుకు పెట్టి, అందరినీ భాగస్వామ్యం చేసారు. అమరావతి అందరిదీ అనే భావం తీసుకువచ్చారు. అయితే అప్పటి ప్రతిపక్షం వైసీపీ మాత్రం, అమరావతిని, మిగతా జిల్లాల ప్రజలకు దూరం చేసే కార్యక్రమాలు చేసింది. ఇందులో భాగంగా అనేక ప్రచారాలు చేసారు. ముందుగా రైతులను భూములు ఇవ్వకుండా, ప్రయత్నాలు చేసినా, రైతులు మాత్రం వీళ్ళ మాట వినలేదు. దీంతో 33 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో అమరావతిలో పనులు మొదలయ్యాయి. రోడ్లు వేసారు, బిల్డింగ్ లు కడుతున్నారు, రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇలా అమరావతి ముందుకు సాగుతూ ఉన్న సమయంలో, ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారి పోవటం జరిగిపోయాయి.

amaravati 16012020 2

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, అమరావతిని ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా, అనేక ప్రచారాలు మొదలు పెట్టింది. అమరావతి ఒకే కులానికి సంబంధించింది అని ప్రచారం చేసారు. అయితే అది ఎస్సీ రిజర్వాడు నియోజకవర్గం. ఇక మరో ప్రచారం, అమరావతి కొంత మంది పెద్ద రైతులది అని. అయితే, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులలో, 20490 మంది, ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్నవారు. దీంతో ఈ ప్రచారం కూడా తుస్సు మంది. తరువాత, అమరావతి కోసం, 33 వేల ఎకరాలు ఎందుకు ? అనే ప్రచారం. అయితే జగనే 30 వేల ఎకరాలు కావాలి అని చెప్పే వీడియో రావటంతో, ఇది కూడా తుస్సు మంది. ఇక తరువాత అమరావతి గ్రాఫిక్స్. అయితే ఇది కూడా అక్కడ బిల్డింగ్ లు చూపించి తిప్పి కొట్టారు.

amaravati 16012020 3

మరో ప్రచారం, అమరావతికి లక్ష కోట్లు అని. కాని ఇది సెల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్ అని లెక్కలతో చెప్పటంతో, ఇది కూడా పోయింది. అమరావతికి వరదలు అన్నారు, దీనికి ఎన్జీటీ తీర్పు రావటంతో, ఇదీ తుస్సు మంది. చివరగా, అమరావతి నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని , ఐఐటీ మద్రాస్ దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇచ్చిందని, ప్రచారం మొదలు పెట్టరు. అయితే ఐఐటీ మద్రాస్ అలాంటి నివేదిక ఏమి ఇచ్చిన దాఖలాలు లేకపోవటంతో, కొంత మందికి అనుమానం వచ్చి, ఐఐటీ మద్రాస్ కు మెయిల్ పంపించారు. దీనికి స్పందించిన ఐఐటీ మద్రాస్‌, అలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఐఐటీ మద్రాస్‌ రిప్లయ్‌ ఇచ్చింది. దీంతో అమరావతి పై, చేసిన మరో విష ప్రచారం కూడా తప్పు అని తేలిపోయింది. ఐఐటీ మద్రాస్ అంటూ చెప్తున్న రిపోర్ట్ , అబద్ధమని తేలిపోయింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో, ఎవరికి వారే పోటీ చేసారు. ప్రధాన పార్టీలు ఏవి కలిసి పోటీ చెయ్యలేదు. 2014లో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి, సక్సెస్ అయ్యాయి. 2019 వచ్చే సరికి, అన్ని పార్టీలదీ ఒకే ఎజండా, అదే చంద్రబాబుని గద్దె దింపటం. అందుకే, లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని, ఎవరికి వారు విడిగా పోటీ చేసి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వైసీపీ, బీజీపీకి మధ్య, ఒప్పందం ఉంది అనేది, బహిరంగ రహస్యమే. ఎన్నికల వేళ, టిడిపి నేతల పైనే ఐటి దాడులు జరగటం, వైసీపీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, అలాగే వైసీపీ చెప్పిన అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించటం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా, బీజేపీ, వైసీపీకి సహాయం చేసింది. ఇక పక్క రాష్ట్రం కేసీఆర్ కూడా, ఒక చెయ్య వేసారు. నిజానకి ఇదే పెద్ద చెయ్య అని, ఆర్ధికంగా సపోర్ట్ చేసిన చెయ్య అని, రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వస్తున్న వార్త. ఇక జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ లతో కలిసి పోటీ చేసినా, వారి ప్రభావం అంత అంత మాత్రమే అయినా, 7 శాతం వరకు ఓట్లు చీల్చారు.

vsreddy 16012020 2

ఇలా ఎన్నికల ముందు వరకు, ప్రతి రాజకీయ పార్టీ, టిడిపిని ఓడించి, వైసీపీ గద్దెనేక్కించటానికి వ్యూహాలు పన్నాయి. వాళ్ళు అనుకుంది సాధించారు. అయితే, అప్పటి నుంచి రాష్ట్రం, వెనక్కు వెళ్ళటం ప్రారంభం అయ్యింది. దీంతో అప్పటి వరకు స్నేహంగా ఉన్న బీజేపీ, రివర్స్ అవ్వటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఏపిలో బలం పుంజుకోవటానికి, వ్యూహాలు పన్నుతుంది. ఇందులో భాగంగానే, జనసేనతో కలిసి ఇక ముందుకు సాగటానికి బీజేపీ డిసైడ్ అయ్యింది. ఈ రోజు బీజేపీ, జనసేన కలిసి, ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. అయితే, ఇప్పుడు జనసేన, బీజేపీ, కలిసి ముందుకు వెళ్తూ ఉండటంతో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వాతావరనం ఉంటుందో, అనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

vsreddy 16012020 3

వీరి ఇరువరి కలయిక, ఎవరికి లాభం ? ఎవరికి నష్టం అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా మొన్నటి దాక, జగన్, విజయసాయి రెడ్డికి, ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం దగ్గర వెయిట్ ఉండేది. అది రాను రాను తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు జనసేన దగ్గర అయితే, ఇక జగన్, విజయసాయి రెడ్డిని, బీజేపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టే అవకాసం ఉంటుంది. ముఖ్యంగా, విజయసాయి రెడ్డి, ఢిల్లీ స్థాయిలో జరిపే లాబీలకు, ఇక ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీ పై దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా దూకుడుగా తమ పై విమర్శలు చేస్తే, వాటిని తిప్పి కొట్టాలా ? సైలెంట్ గా ఉండాలా అనే కన్ఫ్యూషన్ లో వైసీపీ ఉంది. మారిన రాజకీయ పరిస్థితితుల్లో, బీజేపీ పై, జగన్, విజయసాయి రెడ్డి, వైఖరి ఎలా ఉంటుందో చూడాలి ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలి అంటే, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. సరిగ్గా 29 రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీలో ఈ ప్రకటన చేసారు. అప్పటి నుంచి, 29 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం, వారిని కనీసం పట్టించుకోవటం లేదు. ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోవటం లేదు. ప్రజలు ఆందోళన చేస్తున్నారు, పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఎవరు ఎన్ని చేసినా, ప్రభుత్వానికి చీమ కుట్టిన కూడా లేదు. అయితే, ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో మాత్రం, జగన్ కు ఒక అతి పెద్ద బ్రేక్ పడే అవకాసం ఉంది. ఇప్పుడు అదే జగన్ అండ్ కో ని టెన్షన్ పెడుతున్న అంశం. మూడు రాజధానుల విషయంతో, పాటుగా దానికి సంబంధించిన రెండు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతుంది. అయితే, తెలివిగా, ఎక్కడా న్యాయపరంగా దొరక్కుండా, ఈ బిల్ తెసుకువచ్చే ఆలోచన చేస్తున్నారు.

jagan 15012020 2

ఎక్కడా రాజధాని తరలిస్తాం అని చెప్పకుండా, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి పేరుతొ, ఈ బిల్ ఉంటుంది. దీని కోసం, ఇప్పటికే ఈ నెల 20న అసెంబ్లీ సమావేశం, తరువాత శాసన మండలి సమావేశం పెట్టరు. ఇక్కడే జగన్ మోహన్ రెడ్డికి టెన్షన్ మొదలైంది. సెక్రటేరియట్ ని విశాఖపట్నంకి తరలించటం, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ నివేదికల పై, అసెంబ్లీలో చర్చించి, తరువాత, ఏపీసీఆర్‌డీఏ చట్టం రద్దు, అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టి, వాటిని ఆమోదింప చేసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్లాన్. అయితే, అసెంబ్లీలో ఈ బిల్లులు ఆమోదించుకోవటానికి, జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయనకు అక్కడ ఫుల్ మెజారిటీ ఉంది.

jagan 15012020 3

అయితే శాసనమండలిలో మాత్రం, అలా కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీకి 26 మంది ఉంటే, వైసీపీకి కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇక విపక్షాలు అయిన, బీజేపీ కి మూడు, పీడీఎఫ్ కు 5, ఇండిపెండేట్ లు నలుగురు ఉన్నారు. దీంతో ఇక్కడ విపక్షాలది పై చేయి అవుతుంది. ఈ బిల్లు ఇక్కడ పాస్ అయ్యే అవకాశమే లేదు. అందుకే జాయింట్ సమావేశాలు పెట్టి, బిల్లు ఆమోదించాలని అనుకున్నారు. అయితే, జాయింట్ సిట్టింగ్ కి కొన్ని షరతులున్నాయి.మనీ బిల్లులు, రాజ్యాంగ సవరణ లాటి వాటికి జాయింట్ సెషన్ పెట్టకూడదు. అందుకే ఇప్పుడు శాసనమండలి టెన్షన్ పట్టుకుంది. ఇది కూడా అధిగమించి, ఆర్డినెన్సులను జారీ చేసే అంశం పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, జరుగుతున్న ఆందోళన ద్రుష్టిలో పెట్టుకుని, గవర్నర్ ఈ ఆర్డినెన్సు కు ఆమోదం తెలపకపోతే ఏమి చెయ్యాలి అనే అంశం పై కూడా జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఇవన్నీ ఎలా అధిగమిస్తారో చూడాలి.

ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండరు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా, ఆయనకు పేరు ఉంది. అయితే విచిత్రమో, ఏమో కాని, ఆయన ఈ కాపు ఉద్యమం కేవలం చంద్రబాబు అధికారంలో ఉండగా మాత్రమే చేస్తారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ఇలాగే ఉద్యమాలు చేసారు. తలకు రివాల్వర్ పెట్టుకుని, చచ్చిపోతానని బెదిరించారు కూడా. తరువాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగా, అప్పుడు అసలు కాపు ఉద్యమం అనే మాటే ఎత్తలేదు. అసలు కాపుల గురించి పట్టించుకోలేదు కూడా. ఆయన వ్యాపారాలు, ఆయన చేసుకుంటూ కలాం గడిపేసారు. తరువాత, మళ్ళీ 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే, మళ్ళీ కాపు ఉద్యమం తెర మీదకు తీసుకు వచ్చారు. చంద్రబాబు కాపు రిజర్వేషన్ ఇస్తాను అన్నారని, ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఉద్యమం మొదలు పెట్టారు. చివరకు అది రత్నాచల్ ఎక్ష్ప్రెస్ తగలబెట్టె దాకా వెళ్ళింది. తరువాత కూడా అనేక సార్లు, చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

mudragada 15012020 2

ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే, కాపు రిజర్వేషన్ పై ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే, కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ, కేంద్రానికి తీర్మానం పంపించారు. అయితే కేంద్రం మాత్రం , ఇది ఒకే చెయ్యకుండా నాన్చుతూ వచ్చింది. తరువాత కేంద్రమే ఈబీసీ రిజర్వేషన్ 10 శాతం ఇవ్వటంతో, మన రాష్ట్రంలో జనాభా ప్రకారం 5 శాతం రిజర్వేషన్ కాపులకు ఇచ్చారు చంద్రబాబు. ఇక కాపు కార్పొరేషన్ పెట్టి, ఏడాదికి వెయ్య కోట్లు ఖర్చు పెట్టారు కూడా. అయినా అప్పట్లో ముద్రగడ శాంతించే వారు కాదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సైలెంట్ అయిపోయారు. జగన మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ ఎత్తేస్తే, కేవలం ఒక్క ఉత్తరం రాసి కూర్చుకున్నారు.

mudragada 15012020 3

చంద్రబాబు హయంలో కాపు రిజర్వేషన్ ద్వారా, 43 వేల మందికి ఇచ్చిన రుణాలు, జగన్ రద్దు చేస్తే ముద్రగడ మాట్లాడటలేదు. కాపు కార్పొరేషన్ నిధులు ఇప్పటి వరకు, జగన్ మోహన్ రెడ్డి రూపాయి ఖర్చు పెట్టక పోయినా ముద్రగడ మాట్లాడటలేదు. కాపు కార్పొరేషన్ నిధులు, దారి మళ్ళిస్తుంటేముద్రగడ మాట్లాడటలేదు. పవన్ కళ్యాణి ని లంxxx అని, జగన్ తన రెడ్డి ఎమ్మెల్యే చేత తిట్టిస్తే ముద్రగడ మాట్లాడటలేదు. అయితే రెండు రోజుల క్రిందట చంద్రబాబుని నిందిస్తూ ముద్రగడ లేఖ రాసారు. అక్కడ కూడా కులాన్ని రెచ్చగొట్టారు. అమరావతి ఉద్యమంలో, మహిళలు పై ఎందుకు దాడి చేస్తున్నారు అని చంద్రబాబు అడిగితే, దానికి చంద్రబాబుని నిందిస్తూ లేఖ రాసారు. అంటే ఇక్కడ ముద్రగ ప్రయారిటీ, జగన్ కి చెడ్డ పేరు రాకుండా కాపాడటమేనా, కాపుల సమస్యల పై కాదా, అనే సందేహాలు కలుగుతున్నాయి. ముద్రగడ మరి ఈ అపవాదు నుంచి బయట పడతారో లేదో.

Advertisements

Latest Articles

Most Read