విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని వస్తుంది అంటూ, గత 20 రోజులుగా వైసీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రతిపాదన చేసారు. అయితే, క్యాబినెట్ మీటింగ్ లో అధికారికంగా నిర్ణయమే ఫైనల్ అనుకున్న టైంలో, ఈ నిర్ణయం ప్రకటించటానికి, మరి కొంత సమయం పడుతుందని, బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిన తరువాత, హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. అయితే ఇది అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే, అంతా ఫైనల్ అని అందరూ అనుకున్న టైంలో జగన్ వెనక్కు తగ్గారు. మరో పక్క విశాఖ ఉత్సవ్ లో పాల్గునటానికి వచ్చిన జగన్, కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండ వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తుంటే, ఏదో జరుగుతుంది అనే సందేహం అందరిలో వ్యక్తం అవుతుంది. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే జగన్ వెనక్కు తగ్గారని, త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ అంతా వివరించి, దీనికి ఢిల్లీ స్థాయిలో కూడా మద్దతు సంపాదిస్తున్నారని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు విశాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో షాకింగ్ నిర్ణయం, అందరినీ ఆశ్చర్య పరిచింది జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో విశాఖపట్నం గురించి ప్రస్తావిస్తూ, విశాఖకు పెద్దగా ఏమి చెయ్యనవసరం లేదని, విశాఖకు రోడ్లు వెడల్పు చేసి, ఒక మెట్రో ట్రైన్ వేస్తే సరిపోతుందని, మెట్రో ట్రైన్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే మెట్రో ట్రైన్ పై దాఖులు అయిన బిడ్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. బిడ్ రద్దు చెయ్యటం కంటే, మరో డీపీఆర్ తయారు చెయ్యమని కోరటం, ఆశ్చర్యం. ఎందుకంటే, ఇప్పుడు విశాఖ మెట్రో రైల్ పై మరో డీపీఆర్ ని ఒక కన్సల్టన్సీ తయారు చెయ్యాలి అంటే, చాలా సమయం తీసుకునే అవకాసం ఉంటుంది.
వీళ్ళు డీపీఆర్ తయారు చేసి, బిడ్డింగ్ కు పిలిచి, పనులు అప్పగించాలి అంటే, అసలు ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలి అంటే, మెట్రో రైల్ లాంటివి వేస్తె సరిపోతుంది అని చెప్పటం, అయితే ఇప్పుడు ఆ మెట్రో కు వచ్చిన బీడ్ ను రద్దు చెయ్యటం చూస్తుంటే, ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడే కార్యరూపం దాల్చే అవకాసం లేదనే చెప్పాలి. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎస్సెల్ ఇన్ ఫ్రా సంస్ధ, ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. అయితే, ఒకే బీడ్ దాఖలు కావటం, ధర పైన చేసిన ప్రతిపాదనలకు, ఆ కంపెనీ ముందుకు రాక పోవటంతో, ఆ ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ, తాజాగా మరో డీపీఆర్ తయారీ కోసం కొత్త కన్సెల్టెంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.