ఏపీ సీఐడీని టిడిపిని వేధించే శాఖగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఏడీజీ సునీల్ కుమార్ ని సర్కారు సడెన్ సీఐడీని తప్పించడం కలకలం రేపుతోంది. అయితే ఇటీవలే డిజిపి ర్యాంకు ప్రమోషన్ ఇచ్చిన సర్కారు సునీల్ సేవలను మరింతగా వాడుకునేందుకు మరో కీలక పోస్టు కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏ నిర్ణయం తీసుకున్నా డీజీపీ పాత్ర కీలకం కాబట్టి, అదే దళితుడైన సునీల్ కుమార్ ని డిజిపిగా పెడితే...టిడిపి ఇరుకున పడుతుందనే వ్యూహంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతోంది. డిజిపి పోస్టులో సునీల్ కుమార్ ని పెట్టి పోలీసుల్ని తాను చెప్పినట్టు వాడుకోవచ్చని, విపక్షం ఆరోపిస్తే దళిత ఐపీఎస్ ని డిజిపిని చేస్తే టిడిపికి ఇష్టంలేదని కౌంటర్ వేయొచ్చని ప్లాన్ వేసి ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. మరో పక్క సిఐడిలో సునీల్ కుమార్ నిరంకుశ తీరుకి వ్యతిరేకంగా మొత్తం సీఐడీలో ఉన్నవాళ్లంతా ఏకమయ్యారని, అలాగే సిఐఐ వ్యవహరిస్తున్న తీరుతో, ఇప్పటికే కేంద్రానికి అనేక కంప్లైంట్ లు వెళ్ళటం, అలాగే కేంద్రం కూడా సీరియస్ అవ్వటంతో, సునీల్ ని తప్పించారా అనే ప్రచారం జరుగుతుంది.
news
విజయమ్మ మాటలతో షాక్ తిన్న వైసీపీ...
నారా లోకేష్ యువగళం పాదయాత్రని అడ్డుకోవద్దని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వేడుకుంటోంది. ఇదేంటి కొడుకు పాదయాత్ర అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుంటే తల్లి లోకేష్ పాదయాత్ర అనుమతి కోసం ఇంతలా వేడుకుంటోందనే డౌట్ మీకు రావొచ్చు. విజయమ్మ పాదయాత్ర గురించి మాట్లాడిన అంశాలను టిడిపి సోషల్మీడియా వెలుగులోకి తెచ్చి వైసీపీని నిలదీస్తోంది. నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడానికి నానా యాతన పడుతోన్న వైసీపీ సర్కారుకి విజయమ్మ వీడియో షాక్‌లా తగిలింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సరిపడక తల్లితో సహా చెల్లి షర్మిల తెలంగాణలో సెటిలైంది. అక్కడే వైఎస్సార్టీపీ పెట్టుకుంది. ఆమె పాదయాత్రని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కారులో ఉండి నిరసన తెలిపితే, కారుతో లాక్కుపోయారు. తన కుమార్తెని పోలీసులు అలా అరెస్ట్ చేయడంపై విజయ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలని అడ్డుకున్నట్టు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాన్నీ తాను చూడలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలుగా గుర్తింపు పొందుతాయన్నారు. ఈ వీడియోని టైమ్లీగా బయటకు తెచ్చిన టిడిపి శ్రేణులు వైసీపీ పెద్దలను ఇరకాటంలో పెట్టారు.
పుంగనూరుపై అమిత్ షా ఫోకస్ ? ఆ నేతకు వై-క్యాటగిరీ భద్రతతో పెద్దిరెడ్డి ఆట కట్టు
నూరు గొడ్లని తిన్న రాబందు గాలివానకి చచ్చిందని సామెత. రాష్ట్రంలో తన అరాచకాలు, అవినీతిని ప్రశ్నించే విపక్షాలపై దా-డు-లకు బరితెగించిన పెద్దిరెడ్డికి అమిత్ షా భయం పట్టుకుంది. పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరులో పెద్దిరెడ్డిని ప్రశ్నిస్తే ఓంప్రతాప్ ని చంపినట్టే చంపేస్తారని అందరికీ భయం పట్టుకుంది. అరాచకాలకు ఎదురొడ్డిన టిడిపి నేతకి రెండు కాళ్లు తొలగించింది పెద్దిరెడ్డి గ్యాంగ్. జడ్జి రామకృష్ణ, జర్నలిస్టులు ఆ దా-డు-ల్నించి తప్పించుకోలేకపోయారు. పెద్దిరెడ్డి పేరెత్తడమే నేరంగా దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ నియోజకవర్గంలో రైతుసదస్సు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేశారు. తన ఇంటిపై వ్యక్తుల మూకుమ్మడి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో సమయం చూసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిశారు. తనపై 300 మంది పెద్దిరెడ్డి మనుషులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. హోం మంత్రి ఆదేశాల మేరకు రామచంద్ర యాదవ్ కు భారీ భద్రత కేటాయించారు. వై ప్లస్ భద్రతతో ఇప్పుడు రామచంద్రయాదవ్ పుంగనూరులో పెద్దిరెడ్డికి చెమటలు పట్టిస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రయాదవ్ జోలికి వెళ్తే ఇటు సెక్యూరిటీ, అటు అమిత్ షా భయంతో పెద్దిరెడ్డి గ్యాంగ్ వణుకుతోంది.
లోకేష్ పాదయాత్ర పై డీజీపీ గారి ప్రశ్నలు వింటే, చిన్న పిల్లలు కూడా నవ్వుతారు...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి ఇవ్వకుండా ఇన్నాళ్లూ తాత్సారం చేసిన ఏపీ పోలీసులు, నాటకీయంగా డిజిపి పేరుతో ఒక లెటర్ పంపారు. అనుమతి కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖపై స్పందించినట్టు డీజీపీ ఇచ్చిన ఆ ప్రతిలేఖలో చాలా వివరాలు కోరడంతో టిడిపి వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి జిల్లాలో పాదయాత్ర జరిగే తేదీ, స్థలం, సమయం వివరాలు తమకు ముందుగానే ఇవ్వాలని కోరారు. జిల్లాలో రూట్ మ్యాప్ లు, ఎందరు పాల్గొంటారనే వివరాలు కూడా సమర్పించాలని డీజీపీ విడుదల చేసిన ప్రకటన లేఖలో కోరారు. పాదయాత్రలో వినియోగించే వాహనాలు, వాటి నంబర్లు, రాత్రి బసచేసే ప్రాంతం , జిల్లాలో సంప్రదించాల్సిన వ్యక్తుల ఫోన్ నంబర్లుతో కూడిన వివరాలు తెల్లారేసరికి ఇవ్వాలని డిజిపి పంపిన లేఖపై టిడిపి భగ్గుమంది. చాలా మంది పాదయాత్రలు చేసినప్పుడు లేని ఈ నిబంధనలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర జరగకుండా అడ్డుకునేందుకు పోలీసుశాఖ విశ్వప్రయత్నం చేస్తోందని, ఎట్టి పరిస్థితులు ఎదురైనా పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు. దీనిపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ``ఆయన డిజిపి కాదు..కసి..రెడ్డే`` అంటూ ట్వీట్ చేశారు. టిడిపి అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా డిజిపి అడిగిన వివరాలే డిజిపిని కూడా అడుగుతూ ట్వీటేశారు. మొత్తానికి యువగళం పాదయాత్రకి అనుమతి ఇవ్వకూడదనే ఇటువంటి అడ్డగోలు సమాచారం అడుగుతున్నారనేది స్పష్టం అవుతోంది.