పెట్టుబడుల పై సమ్మిట్లు, పోలవరంలో కాంక్రీట్ రికార్డులు, అమరావతి నిర్మాణాలు, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్డులు, ప్రతి ఒక్కరికీ సంక్షేమం, ప్రశాంతంగా సాగుతున్న ప్రజల జీవితాలు... ఇది ఏడు నెలల క్రిందట పరిస్థితి... ఇప్పుడు పరిస్థితి మొత్తం తారు మారు అయ్యింది. ఏకంగా, ప్రభుత్వం నిర్వచించే క్యాబినెట్ సమావేశం కూడా, 144 సెక్షన్ పెట్టుకుని మరీ, క్యాబినెట్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 29 గ్రామాల ప్రజలు, దాదపుగా 2 లక్షల మంది, తమ జీవితాలు ఏమి అవుతాయో అని ఆందోళనగా ఉన్నారు. క్యాబినెట్ ఏ నిర్ణయం తీస్కుంటుందో అనే విషయం తలుచుకుని, నివురు గప్పిన నిప్పులా మారింది అమరావతి పరిస్థితి. రాజధాని రైతుల ఆందోళనలు 11వ రోజుకు చేరాయి. అన్నదాతల ఆగ్రహావేశాలతో అమరావతి అట్టుదుకుతున్న పరిస్థితి. మంత్రివర్గ సమావేశం దృష్ట్యా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. తుళ్లూరు మండలం లోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144సెక్షన్ విధించారు. ప్రతి గ్రామ కూడలిలో ముళ్ల కంచెలు సిద్ధం చేసి ఉంచారు.

amaravati 271220119 2

సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు పెట్టారు. తుపాకులు, లాఠీ చార్జ్‌ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున దిగారు. సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరించారు. మందడంలో అడుగడుగునా పోలీసుల మోహరించారు. దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరణ. పాలు, మందులు దుకాణాలకు మాత్రమే పోలీసుల అనుమతించారు. మందడం లో రైతులు రోజూ ధర్నా చేసే ప్రదేశంలో వాహనాలు అడ్డుగా పెట్టరు పోలీసులు. మొత్తానికి, అమరావతిలో పరిస్థితి, నివురు గప్పిన నిప్పులా ఉంది. క్యాబినెట్ భేటీ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

amaravati 271220119 3

ఇక ఈ ఆర్జు ఉదయం, విజయవాడలోని, లొయోలా కళాశాల నుంచి బెంజ్ సర్కిల్ వరకూ విజయవాడ వాకర్స్ భారీ ర్యాలీ నిర్వచించారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ ర్యాలీ చేపట్టారు విజయవాడ వాకర్స్. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, వృద్దులు పాల్గున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మానవహారం గా ఏర్పడి నినాదాలు చేసారు. రాజధానిగా మార్చవద్దని, భుములు ఇచ్చిన రైతులను అన్యాయం చెయ్యవద్దు అంటూ కోరారు. ఇలా ఉంటే, మంత్రి బొత్స రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బొత్సా ఇంటిని ముట్టడించారు. బొత్సా కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బొత్స రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు. సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ కి వారిని తరలిచారు

గత పది రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తుంటే, గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రాంత ఎమ్మెల్యేలు కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. వారి వైపు వెళ్లి, ఏమి జరుగుతుందో కూడా అడగలేదు. చివరకు అమరావతి ప్రాంతం ఉంటున్న తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేలు కనీసం, బయటకు కూడా రాలేదు. వీరి పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో, గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత వైసీపీ ఎమ్మేల్యేలు, ఈ రోజు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో, జగన్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ పై అంబటి రాంబాబు, పార్ధసారధి, మీడియాకు వివరించారు. మేము ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదిక పై చర్చించామని, అమరావతి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, జగన్ చెప్పారని అంబటి చెప్పారు. అమరావతి నిర్మాణాలు పూర్తీ చెయ్యాలి అంటే, చాలా డబ్బులు అవుతాయని, అంత డబ్బులు పెట్టి, రాజధాని నిర్మించలేమని చెప్పారు. మేము రాజధాని కోసం నగరాన్ని నిర్మించం అని, నగరం ఉన్న చోటే, రాజధాని పెడతాం అంటూ చెప్పారు.

ycp 26122019 2

మొత్తానికి, గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజల తరుపున కాకుండా, జగన్ నిర్ణయానికే జై కొట్టారు. వీరి నిర్ణయాల పై, టిడిపికి చెందిన, మాజీ మంత్రులు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ విడుదల చేసారు. "కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశ నిర్ణయాలు ఈ రెండు జిల్లాల ప్రజల ప్రయోజనాలే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ కు ధీటుగా రాష్ట్రం నడిబొడ్డులో అమరావతిని నిర్మించడాన్ని విచ్ఛిన్నం చేస్తున్న జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డిల తప్పుడు నిర్ణయాలను తలకెత్తుకున్నట్లుగా ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి అవసరంలేదు. రైతులు ఇచ్చిన భూముల ద్వారానే రాజధాని నిర్మించవచ్చు. రాజధానిని విశాఖకు మారిస్తే ప్రభుత్వ ఖజానా నుంచి తలకు మించిన ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది రాష్ట్రాభివృద్ధికి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుంటుంది."

ycp 26122019 3

"రాజధాని మార్పు అనేది కేవలం జగన్మోహన రెడ్డివిజయసాయి రెడ్డిల స్వప్రయోజనాలే తప్ప రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. రైతుల త్యాగాలను ఒమ్ము చేస్తోంది. ఈ వాస్తవాలు తెలిసి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మవంచన చేసుకొని బేలగా జగన్మోహన రెడ్డి నిర్ణయాలను సమర్ధించే స్థితికి దిగజారారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న33 ఎమ్మెల్యే స్థానాలలో నేడు 30 స్థానాలు వైసీపీని చేతుల్లో ఉన్నవి. ఇంత భారీ స్థాయిలో గెలిచిన వీరు రాజధాని మార్పును వ్యతిరేకించి జగన్మోహన రెడ్డి మనసు మార్చకపోతే వీరందరి రాజకీయ జీవితం శాశ్వితంగా ముగిసేవిధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నాడు తల్లిని చంపి బిడ్డను తీసినందుకు కాంగ్రెస్‌ కు భవిష్యత్‌ లేకుండా చేశారు. ఎదిగే బిడ్డ తలను ముక్కలు చేస్తున్నా వైసీపీ శాసనసభ్యులకు రాజకీయ భవిష్యత్‌ ను ప్రజలు శూన్యం చేస్తారు. వారి భవిష్యత్‌ శూన్యం కాకుండా ఉండాలంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డిల మనసు మార్చాలి." అంటూ లేఖ రాసారు.

ఒక చిన్న ఆందోళన కూడా లేకుండా, విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కోసం, అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. తమ జీవితాలతో పాటు, రాష్ట్రం కూడా బాగుపడుతుందని వారు ఆలోచించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని చెప్పటంతో, రాజధాని రైతులు రోడ్డున పడ్డారు. మా జీవితాలు బాగు పడతాయి, ఇక్కడ ఒక పెద్ద సిటీ వస్తుందని భూములు ఇచ్చాము, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చెయ్యకుండా, కేవలం అసెంబ్లీ మాత్రమే పెడితే, ఏమి వస్తుంది అంటూ, ఆ రైతులు గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే గత పది రోజుల నుంచి ప్రభుత్వం మాత్రం, వారి ఆందోళన గురించి అసలు స్పందించలేదు. స్పందించక పోగా, అధికార పార్టీ నేతలు, అమరావతి ఎడారి అని, అమరావతిలో లింగు లింగు మంటూ,8 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు అంటూ, హేళనగా మాట్లాడారు.

jagan 26122019 2

చివరకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, వారి గురించి అసలు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం వారి గురించి అసలు పట్టించుకోక పోవటంతో, అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపు క్యాబినెట్ భేటీలో, విశాఖ రాజధాని అనేది ఖాయంగా, ప్రభుత్వం ప్రకటన చేసే అవకాసం ఉన్న నేపధ్యంలో, ఇదే సమయంలో అమరావతి రైతుల గురించి కూడా జగన్ ఏదో ఒక ప్రకటన చేస్తారని, అమరావతి రైతులకు ప్యాకేజీ పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో ఆలోచన చేస్తున్నారని, అమరావతి రైతుల కోసం ఓ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కమిటీతో రాజధాని రైతులు, ఇబ్బందులు అన్నీ తీరి పోయి, వారి కష్టాలు లేకుండా చేస్తారని వైసీపీ ప్రచారం చేస్తుంది.

jagan 26122019 3

మంత్రులు బుగ్గన, కన్నబాబు, బొత్స, నారాయణస్వామి సభ్యులుగా ఈ కమిటీ ఉంటుందని సమాచారం వస్తుంది. వీరు రైతులతో చర్చించి, వారికి ఎలా న్యాయం చెయ్యాలో ఈ కమిటీ చూస్తుందని సమాచారం. అయితే ఈ వార్త పై రైతులు మాత్రం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీలు లాంటివి మాకు అవసరం లేదని, ఇక్కడ నుంచి ఏదీ తరలించటానికి వీలు లేదని, అప్పుడే ఏదైనా కమిటీ అయినా, ఇంకా ఏమైనా వారితో మేము మాట్లాడతాం అని రైతులు అంటున్నారు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీతో మా కడుపు కొట్టారని, ప్రతి రోజు మమ్మల్ని హేళన చేస్తున్న, బొత్సా లాంటి వారితో కమిటీ అంటేనే, తమ పై ఈ ప్రభుత్వానికి, ఎలాంటి ఆసక్తి ఉందొ అర్ధమవుతుందని, వాపోతున్నారు.

సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు దిగాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు పట్టుకుని పోలీసులు కవాతు చేసారు. తుపాకులు, లాఠీ చార్జ్‌ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున బలగాలు దిగాయి. సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరించారు. రాజధాని గ్రామాలు అప్రకటిత యుద్ధ వాతావరణం తలపిస్తున్నయి. గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని రైతులు వాపోతున్నారు. శాంతియుతంగా నిరసన చేసుకునే తమను రెచ్చగొట్టే విధంగా పోలీసు చర్యలు ఉన్నాయని, రైతులు అంటున్నారు. మంత్రివర్గ సమావేశానికి సహకరించేందుకు మా ధర్నా వేదికను ఉద్ధండరాయుని పాలెనికి మార్చుకోవాలని యోచించామని రైతులు అంటున్నారు. పోలీసు చర్యలతో తిరిగి మందడంలోనే కొనసాగించే ఆలోచన చేస్తున్నామని రైతులు వాపోతున్నారు.

amaravati 26122019 2

ఎన్ని కేసులు పెట్టినా, లాఠీలు ప్రయోగించినా రాజధానిగా అమరావతి కొనసాగించే అంశంపై వెనక్కి తగ్గేది లేదని రైతులు అంటున్నారు. ఇక మరో పక్క, మా ఎమ్మెల్యే కనపడటంలేదని ఫిర్యాదు ఇచ్చాం...వెతికారా లేదా అని తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు నినాదాలు చేసారు. వి-వాంట్...ఎమ్యెల్యే... వి-వాంట్ ఎమ్మెల్యే అంటూ..పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేసారు. మరో, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలిపి, తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ శ్రావణ్ కుమార్ సభని ఉద్దేశించి మాట్లాడారు. "పోలీసు కేసులకు ఎవ్వరూ భయపడొద్దు. కేసులు పెట్టే పోలీసుల్ని కోర్టులు చుట్టూ ఎలా తిప్పాలో మనకి మద్దతు తెలిపే న్యాయవాదులకు తెలుసు. తునిలో రైలు తగలపెట్టిన కేసుల్ని ఈ ప్రభుత్వం ఎత్తివేసింది. కోర్టులు జగన్ పాలనను తప్పుపడుతున్నా మార్పు లేదు" అంటు వాపోయారు.

amaravati 26122019 3

ఇది ఇలా ఉంటే, ఇప్పుడు రాజధాని తరలింపు అంశం, ఉద్యోగులకి కూడా తగిలింది. సచివాలయం విశాఖ తరలింపు అంశంపై జగన్ ను కలిసి చర్చించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు భావిస్తున్నారు. జగన్ సమయం కావాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు కోరారు. రాజధాని తరలింపు కేవలం సచివాలయ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదంటున్న ఉద్యోగులు, హైదరాబాద్ లో ఇంకా కుటుంబాలు కొనసాగిస్తూ అమరావతి కి వచ్చి వెళ్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని చెప్తున్నూర్. ఈ నెల 30 తేదీన రాజధాని అంశం పై సచివాలయ ఉద్యోగులు స్పందించనున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రత్యెక రైతులు వస్తున్నామని, అదే విశాఖ అంటే, కుదిరే పని కాదని, వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read