రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం, రాజుకుంటుంది. ఇప్పటికే జగన్ మాటలతో, అమరావతి రైతులు రోడ్డున పడితే, ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు, రైతులకు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఒక పక్క రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుంటే, వారితో చర్చించాల్సింది పోయి, వారిని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పెద్దిరెడ్డి. మేము మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని అన్నారు. ఏ కేంద్రం పర్మిషన్ మాకు అవసరం లేదని అన్నారు. అలాగే అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తాం అంటూ పిడుగు లాంటి వార్త చెప్పారు. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని, గతంలోనే జగన్ చెప్పారని, దానికి అనుగుణంగా, వెనక్కు ఇచ్చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అమరావతిలో ఆందోళన చేసేది అంతా, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే అని అన్నారు. టిడిపి వారే రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు.

peddireddy 20122019 2

విశాఖపట్నంలో ఇప్పటికే భూముల రేట్లు పెరిగాయని, అక్కడ మాకు భూములు ఉన్నాయని చెప్పటం సరైంది కాదని అన్నారు. చంద్రబాబే సచివాలయం తాత్కాలికం అన్నారని, అన్నారు. మేము మూడు కాకపొతే, 33 రాజధానులు పెట్టుకుంటామని అన్నారు. మూడు రాజధానుల గురించి కేంద్రానికి ఏం సంబంధం, వారి అనుమతి మాకు ఏమి అవసరం లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ అటు పల్లె కాదు, పట్టణం కాదు అంటూ, విజయవాడని కూడా కించపరుస్తూ మాట్లాడారు. మొత్తానికి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటంలో, ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక పక్క రైతులు ఆందోళన చేస్తుంటే, వారితో మాట్లాడాల్సింది పోయి, వారు టిడిపి కార్యకర్తలు అని చెప్పటం గమనార్హం.

peddireddy 20122019 3

అయితే ఈ రోజు పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై, రాజధాని రైతులు భగ్గుమన్నారు. ఇప్పటికే జగన్ ప్రకటనతో చచ్చిపోయి ఉన్నామని, ఇప్పుడు మంత్రులు గుచ్చి గుచ్చి చంపుతున్నారని అన్నారు. సమస్యని పరిష్కరించాల్సింది పోయి, భూములు వెనక్కు ఇచ్చేస్తామని చెప్పటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మేము రైతులం అని, అన్ని కులాల వారు ఉన్నారని, మమ్మల్ని టిడిపి కార్యక్రర్తలు ముద్ర వేసి, సమస్యను రాజకీయం చెయ్యవద్దు అంటూ, వేడుకుంటున్నారు. అమరావతిలో ఈ రోజు ఏ పార్టీ జెండా లేదని, ఇక్కడ ఉన్నది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న, నల్ల జెండాలు మాత్రమే అని రైతులు వాపోతున్నారు. దయ చేసి, మమ్మల్ని రోజు రోజుకి గుచ్చి గుచ్చి చంపవద్దు అంటూ, వేడుకున్నారు.

వైసీపీ పార్టీలో, అందరూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్నే ఏకీభావిస్తారని, ఎవరూ ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు అంటూ, ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అధికారంలో ఉండటం, బలంగా 151 మంది ఉండటంతో, జగన్ నిర్ణయాలకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చెయ్యరు. రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు, ఎదురు తిరిగినా, ఇలాంటివి కనిపించకుండా జాగ్రత్త పడతారు. అయితే, ఇప్పుడు మూడు రాజధానులు విషయంతో, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రజలను బిజీగా ఉంచుదాం అనుకుంటే, ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా ఆ చిచ్చులో చిక్కుకున్నారు. ముఖ్యంగా ప్రజలు తిరగబడటంతో, పార్టీ కంటే, జగన్ కంటే, ప్రజల అభిప్రాయలను గౌరవించాల్సిన పరిస్థితి. అసెంబ్లీ వేదికగా, జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ ప్రకటన పై అమరావతి ప్రాంత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్త్యం అయ్యింది.

gopireddy 19122019 1

అలాగే ఈ ప్రాంతంలో ఉండే లాయర్లు కూడా ఎదురు తిరిగారు. ఇది అమరావతి రైతుల నుంచి, కోస్తా, గోదావరి జిల్లాలకు కూడా పాకుతుంది. ఇక్కడ ప్రజలు కూడా, మేము రాజధాని ఉంది అని, మాకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ రాకపోయినా, ఊరుకున్నాము, కియా లాంటివి అనంతపురంలో వస్తే సంతోషించాము, ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అనే భావనకు వచ్చారు. అయితే ప్రజల అభిప్రాయాలకు లొంగక తప్పని పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేలది. దీంతో, జగన్ మూడు రాజధానుల ప్రకటనను తప్పుబట్టారు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అసలు మూడు రాజధానులు అనేది సమంజసం కాదని, అమరావతిలోనే రాజధాని ఉంచాలని, ఇది తన సొంత అభిప్రాయమని అన్నారు.

gopireddy 19122019 1

అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట ఉండాలని, అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్ విశాఖలో ఎలా ఉంచుతారు అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని, ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పుకొచ్చారు. త్వరలోనే జగన్ మొహన్ రెడ్డిని కలిసి, తన అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేస్తానని వెల్లడించారు. ఇదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామని, మరోసారి ప్రజలు నష్టపోవడం భావ్యం కాదని అవేదన వ్యక్తం చేసారు. ఇంకా నిపుణుల కమిటీ నివేదిక రాలేదని, అది వచ్చేదాకా, ప్రజలు అపోహలు పడవొద్దని సూచించారు. మొత్తానికి అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు రావటం, ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎంత మంది మీడియా, ప్రెస్ వాళ్ళు నిరసనలు చేసినా, పార్టీలు నిరసన తెలిపినా, అసెంబ్లీలో చర్చ జరిగినా, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులు, ఇబ్బందిగా మారాయి. మీడియా పై ఆంక్షలు పెడుతూ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, ప్రభుత్వాన్ని కించ పరిచే నిరాధార వార్తలు రాస్తే, కేసులు పెట్టండి అంటూ, అన్ని శాఖలకు అధికారం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 ని రిలీజ్ చేసింది. అయితే ప్రభుత్వం చేత ఈ జీవో ఉపసంహరించుకునేలా చెయ్యాలి అంటూ, వేసిన పిటీషన్ పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా వాదనలు జరిపి, మీడియాపై ఆంక్షలు విధించేలా ఉన్న ఆ జీవో ఉప సంహరించుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన ఈ ఆదేశాల పై వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియాకి ధన్యవాదాలు చెప్పాయి.

pci 19122019 2

ఈ విషయం పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ అధ్యక్షతన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో, ఈ అంశం పై విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ జర్నలిస్టు సంఘ నేతలు, ఈ విచారణలో పాల్గొని, తమ వాదనలు వినిపించారు. ఈ జీవో, తమ విధులకు ఇబ్బంది కరంగా మారిందని, వాదనలు విపించారు. ఇప్పటికే తప్పుడు వార్తల పై వివిధ చట్టాలు ఉన్నాయని, ఇప్పుడు ఇలాంటి జీవో ఇచ్చి, తమకు ఇష్టం లేని వాళ్ళ పై, ప్రభుత్వం కక్ష సాధించే కుట్ర ఉందని, ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. వార్తా నిజమా కదా, అని, లేకపోతే, ప్రభుత్వం తప్పు చేసిందా లేదా అని ఎవరు నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందని అన్నారు.

pci 19122019 3

గతంలో జయలలిత ప్రభుత్వంలో, ఇలాగే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తు చేసారు. అయితే ఈ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున, సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్‌ కిరణ్‌ వచ్చి, ప్రభుత్వం తరుపున వాదనలను వినిపించారు. ఈ జీవో తేవటం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఈ జీవోని దుర్వినియోగం చేయబోమని చెప్పారు. కేవలం కావాలని, తమ పై బురద జల్లే వార్తల నియంత్రణ కోసమే ఈ జీవో తెచ్చామని, ఏ ఒక్కరినీ టార్గెట్ చేసి కాదని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చామని చెప్పారు. అయితే ఇరువురి వాదనలు ఉన్న కౌన్సిల్, ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ను ఉప సంహరించుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ ఆదేశించారు. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ చేసిన వ్యాఖ్యల పై రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఒక రాజధాని కట్టటానికే దిక్కు లేదు, ఇంకా మూడు రాజధానాలు ఎలా కాడతారు అంటూ, పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టి, పబ్బం గడుపుకోవటమే అని అంటున్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా ఈ విషయం పై స్పందిస్తున్నాయి. బీజేపీ పార్టీ స్పందిస్తూ, తాము అభివృద్ధి వికేంద్రీకరణ సమర్దిస్తామని, పరిపాలనా వికేంద్రీకరణ సమర్ధించమని, కర్నూల్ లో హైకోర్ట్ ఉండటం మాత్రం ఒప్పుకుంటామని, అమరావతిలో హైకోర్ట్ బెంచ్ పెట్టాలని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ కు పాలించటం రాదు అంటూ కన్నా వ్యాఖ్యలు చేసారు. అయితే, బీజేపీ రాజ్యసభ సభ్యడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మరింత ఘాటుగా, జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పిల్ల ఆట ఆడుతున్నారు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

jagan 19122019 2

అమరావతిని తరలించటం అంత సులువైన పని కాదని, ఇప్పటికే నోటిఫై చేసిన హైకోర్ట్ ని మార్చటం కూడా అంత తేలికైన పని కాదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే, కేంద్రం చూస్తూ కుర్చోదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే రాజధాని కోసం 2500 కోట్లు ఇచ్చామని, ఇప్పుడు మార్చేస్తాం అంటే ఎలా కుదురుతుంది, ఇదేమీ చిన్నపిల్లలాట కాదని సుజనా వ్యాఖ్యలు చేసారు. జగన్ అసెంబ్లీలో ఈ విషయం పై మాట్లాడుతూ, ఉండొచ్చు ఏమో అంటూ, ఊహాజనితంగా చెప్పారని, అధికారికంగా ఈ ప్రకటన చేస్తే, అప్పుడు కేంద్రం స్పందిస్తుందని అన్నారు. అమరావతిని ఈ స్టేజ్ లో తప్పించటం జగన్ కాదు కాదా, ఆయన తాత తరం కూడా కాదని సుజనా అన్నారు.

jagan 19122019 3

అసలు జగన చేసిన ప్రకటన, మూడు రాజధానుల వ్యవమారం హాస్యాస్పదంగా ఉందని, అయుదు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నట్లు, ఇష్టం వచ్చినట్టు రాజధానులు పెట్టుకోవటం కుదరదని అన్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన చోట, కేవలం అసెంబ్లీ మాత్రమే పెడతాం అంటే, దానిని రాజధాని అనరని అన్నారు. ఈ మొత్తం విషయం ఇప్పటికే కేంద్రం ద్రుష్టిలో ఉందని, అధికారికంగా ప్రకటన చేస్తే, అప్పుడు కేంద్రం ఏమి చెయ్యాలో, అది చేస్తుందని అన్నారు. ఎక్కడైనా, ఎవరైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటారని, కాని ఇలనాటి నిర్ణయాలు ఎవరూ సమర్ధించరని అన్నారు. అలాగే, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు కేంద్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు రాజధాని మార్చేస్తాం అంటే, కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read