ఒక్కొక్కరిదీ ఒక్కో అభిమానం. కొంత మందికి కులాభిమానం, కొంత మందికి మతాభిమానం, కొంత మందికి ప్రాంతీయ అభిమానం. కొంత మందికి బాగా పని చేస్తారని అభిమానం. ఇలా రకరకాలుగా, ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు అభిమానిస్తారు. కాని ఇక్కడ చెప్పుకునేది అంతకు మించి. ఎప్పుడో చంద్రబాబు చేసిన మంచికి, గుర్తు పెట్టుకుని, ఇప్పుడు కృతజ్ఞత చెప్పటానికి వచ్చింది ఈ అవ్వ. చంద్రబాబుని కలవాలి అంటే, ఆ సెక్యూరిటీ అంతా దాటుకుని వెళ్తే కాని కుదరదు. అదీ ఆమె ఎక్కడో మారు మూల చిత్తూరు జిల్లా. అదీ కాక ఆమెకు రెండు కళ్ళు లేవు. కాని చంద్రబాబు అధికారంలో ఉండగా, తనను ఒక పెద్ద కొడుకులా ఆదుకున్నారని, ఇప్పుడు ఆయన చిత్తూరు వచ్చారని, కలవటానికి వచ్చింది అంటే, ఆమె అభిమానం ఎలాంటిదో చెప్పుకోవచ్చు. ఆమె పేరు పాల్గుడి నాగమ్మ. చంద్రబాబు మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశాలకు వచ్చారని తెలుసుకుంది.

cbn 09112019 2

ఎలా అయినా, ఆయన్ను కలిసి, కృతజ్ఞత చెప్పాలని అనుకుంది. ఆమె గ్రామం అయిన నడింపల్లె నుంచి, తన మనువడితో చెప్పి, అక్కడకు తీసుకువెళ్ల మంది. ఆమెకు రెండు కళ్ళు లేకపోవటంతో, అక్కడ ఇబ్బంది పడతాం అని చెప్పినా, వినకుండా, మనువడిని తీసుకుని, చంద్రబాబు సమీక్ష చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆమెను చూసిన స్థానిక నాయకులు, ఆమె గురించి తెలుసుకుని, ఆమెను చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. చంద్రబాబు ఆమెను ఆప్యాయంగా హద్డుకుని, ఆమె గురించి అన్ని వివరాలు ఆరా తీసారు. ఇంత కష్టపడి ఎందుకు వచ్చావ్ అని అడగగా, "రెండు కళ్లూ లేకపోయినా నీకోసం వచ్చానన్నా. నీమాటలు విందామని నా మనవడిని తీసుకొచ్చాను" అంటూ ఆమె చెప్పిన మాటలతో, ఒక్కసారిగా ఆ ప్రదేశం చప్పట్లతో మారుమోగింది.

cbn 09112019 3

నువ్వు ఉండగా, పెన్షన్ ను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసావ్, మళ్ళీ వెయ్యి ను రెండు వేలు చేసావ్, ఆ డబ్బులు పెరిగిన దగ్గర నుంచి, నేను మందులకు , నా అవసరాలకు ఎవరి దగ్గర ఆదర పడటం లేదు. అప్పటి నుంచి జీవితం సుఖంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఓడిపోయి, కష్టాల్లో ఉన్నావ్, అందుకే ఇక్కడకు వచ్చి, కృతజ్ఞతగా నీ మాటలు విందాం అని వచ్చా, ఇక్కడకు వచ్చాక, నిన్ను కలిసే అవకాశం దక్కింది, నువ్వు నిండు నూరేళ్లు బతకాలి, మా లాంటి వారి తరుపున నిలబడాలి, ఆదుకొవాలి అంటూ నాగమ్మ చెప్పిన మాటలతో, ఒక్కసారిగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రెండు కళ్ళు లేకపోయినా, కేవలం చంద్రబాబు పట్ల కృతజ్ఞతతో, ఆమె ఇక్కడకు వచ్చింది. అందుకే అంటారు, మనం కాదు, మన పనులు మాట్లాడాలి అని. ఈ విషయంలో చంద్రబాబు ఎన్నికల్లో ఓడినా, ఇలాంటి లక్షలాది వృద్ధుల మనసు గెలిచినట్టే కదా...

ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో, ఆకస్మిక బదిలీలు, ఐఏఎస్ అధికారులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకంగా చీఫ్ సెక్రటరీనే బదిలీ చెయ్యటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సియం ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చిన, ఒక్క రోజులునే ఆయన్ను బదిలీ చేసి, అధికారులకు ఒక మెసేజ్ ఇచ్చారు జగన్. అప్పటి నుంచి అధికారులు హడలి పోతున్నారు. ముఖ్యంగా మాజీ చీఫ్ సెక్రటరీకి అనుకూలంగా ఉన్న కొంత మంది అధికారులు, తమకు కూడా బదిలీ ఉత్తర్వులు వస్తాయని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపధ్యంలోనే, మరో కీలక ఐఏఎస్ అధికారిని బదిలీ చేస్తూ, నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేవలం 24 గంటల్లోనే, ఆయన రెండు సార్లు బదిలీ అవ్వటం, ఐఎస్ఎస్ వర్గాల్లో చర్చనీయంసం అయ్యింది. ఎల్వీ సుబ్రమణ్యం, ప్రవీణ్ ప్రకాష్ మధ్య జరిగిన ఇష్యూలో, ఎల్వీ వైపు ఉన్న అడిషనల్ సెక్రటరీ గురుమూర్తి పై నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది, అందరినీ ఆశ్చర్యపరిచింది.

lvs 09112019 2

గురుమూర్తిని బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీనికి సంబందించిన ఆదేశాలు కూడా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. ప్రస్తుతం గురుమూర్తి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అదనపు సెక్రటరీగా పని చేస్తున్నారు. గురుమూర్తి స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్‌‌ అధికారి క్రైస్ట్ కిశోర్‌ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రవీణ్ ప్రకాష్‌కు, ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ ఇవ్వటం వెనుక గురుమూర్తి ప్రమేయం కూడా ఉన్నట్టు, సచివాలయంలో ప్రచారం జరుగుతుంది. అదీ కాక, తాను ప్రవీణ్ ప్రకాష్ దగ్గర పని చేయలేక పోతున్నాను అంటూ, గత నెల 30న, గురుమూర్తి, చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాసారు. తాను ఆయన కింద పని చేయలేను అని, తనని వేరే శాఖకు బదిలీ చెయ్యాలని అప్పట్లో కోరారు.

lvs 09112019 3

అయితే గురుమూర్తిని, 24 గంటల్లో, రెండు సార్లు బదిలీ చెయ్యటం కూడా చర్చనీయంసం అయ్యింది. గురువారం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు నుంచి, బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. అయితే 24 గంటలు కూడా గడవక ముందే, గురుమూర్తి డిప్యుటేషన్‌ రద్దు చేసి దిల్లీకి పంపించి వేస్తూ, ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం మరో ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గురుమూర్తి, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖలో డైరెక్టర్‌ హోదాలో పని చేసే వారు. అయితే చంద్రబాబు హయంలో, 2017 జూన్‌ 1న డిప్యుటేషన్‌ పై రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. వచ్చిన కొత్తలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకి ఓఎస్‌డీగా పనిచేసేరు. తరువాత అక్కడ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో, అదనపు కార్యదర్శిగా పని చేసావారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ దగ్గర పని చెయ్యలేక ఇబ్బందులు పడుతూ, చివరకు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉత్తర్వులు వచ్చాయి.

చంద్రబాబు అధికారంలో ఉండగా, నవ్యాంధ్రకు మొదటి చీఫ్ సెక్రటరీగా చేసి, రిటైర్డ్ అయిన తరువాత కూడా, చంద్రబాబు చేత బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి ఇప్పించుకుని, తరువాత ఆ పదవిలో ఉంటూనే, చంద్రబాబుని తిడుతూ, వైఎస్ఆర్ పార్టీ వేసిన పోస్టర్స్ ను, తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా స్ప్రెడ్ చేస్తూ, చంద్రబాబు పక్కనే ఉంటూ, ఆయన్నే టార్గెట్ చేసారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణా రావు. తరువాత విషయం బయటకు పొక్కటంతో, చంద్రబాబు ఆయన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఐవైఆర్ కృష్ణా రావు, జగన్ ను అనుకూలంగా స్టేట్మెంట్ లు ఇస్తూ, అనునిత్యం చంద్రబాబుని ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తూ, ఒక సామాజికవర్గంలో, చంద్రబాబు పై వ్యతిరేకత తేవటంలో, సక్సెస్ అయ్యారు. అమరావతి మీద వ్యతిరేక ప్రచారం చెయ్యటం దగ్గర నుంచి, తిరుమల వివాదాలు దాకా, అన్నిట్లో చంద్రబాబుని విసిగిస్తూ వచ్చారు.

iyr 09112019 2

అయితే ఇప్పుడు చంద్రబాబు దిగిపోయి, ఆయనకు ఇష్టమైన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి ఎక్కారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా, తనకు సహకరించిన వారి అందరికీ పదవులు ఇచ్చారు కాని, ఇప్పటి వరకు ఐవైఆర్ కు మాత్రం ఏమి ఇవ్వలేదు. మరి అది మనసులో పెట్టుకోనో, లేక బీజేపీకి దగ్గర అయ్యో కాని, ఐవైఆర్ నెమ్మిదిగా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చెయ్యటం ప్రారంభించారు. ఇందులో భాగంగానే, ఎల్వీ సుభ్రమణ్యంను ఆకస్మికంగా బదిలీ చెయ్యటం పై, ఆయన తీవ్రంగా స్పందించారు. దేవాలయాల్లో పని చేస్తున్న అన్యమతస్తుల పై, ఎల్వీ ఉక్కు పాదం మోపినందుకే, ఈ బదిలీ అనే విధంగా, జగన్ పై డైరెక్ట్ అటాక్ కు దిగారు. అయితే, ఆయన ఈ విషయన్ని, కేవలం ఒక విమర్శతో ఆపలేదు.

iyr 09112019 3

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సహా, రాష్ట్రంలోని కొంత మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలకు కనీస కాలపరిమితితో కూడిన భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఐవైఆర్‌ కృష్ణారావు హైకోర్టులో పిటీషన్ వేసారు. చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నవారిని రెండేళ్లు కొనసాగించాలని, క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర హోం కార్యదర్శి, డీజీపీల లాగానే, చీఫ్ సెక్రటరీకి కూడా రెండేళ్లు పదవిలో ఉండేలా ఆదేశాలివ్వాలని, ఆయన కోర్ట్ ని కోరారు. ఈ పిటీషన్ పై ప్రతివాదులుగా ఇంచార్జ్ సిఎస్, జీఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, డీఓపీటీ కార్యదర్శులును చేర్చారు. అయితే ఈ పిటీషన్ వచ్చే వారం హైకోర్ట్ లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కనీస కాల పరిమితి పై గతంలో కూడా వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.

దశాబ్దాలుగా నలుగుతూన్న అయోధ్యలోని రామ జన్మభూమితో పాటుగా, బాబ్రీ మసీదు కేసు వివాదం పై, సుప్రీంకోర్టు తన తుది తీర్పును వేలువడించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తీర్పుని ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ వెలువడించారు. "ఇది ఒక మతానికి సంబంధంచిన అంశంగా చూడడం లేదు. ఇది ఒక భూవివాదంగా చూడనున్నాము. భూవివాదాన్ని చట్టపరంగా చూస్తున్నాము." అంటూ తీర్పు మొదలు పెట్టరు. ఈ చారిత్రాత్మిక తీర్పు ప్రకారం, వివాదాస్పద స్థలంగా ఉన్న, 2.77 ఎకరాలను హిందువులకి ఇచ్చి, ముస్లింలకు వేరే స్థలం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ స్థలంలో రాముడి గుడి నిర్మాణానికి మార్గం సుగుమం అయ్యింది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, మూడు నెలల్లో విధి విధానాలు చెప్పాలని, కేంద్రాన్ని ఆదేశించింది. 2.77 ఎకరాల వివాదస్పద స్థలంలో, గతంలో హిందువులు పూజలు చేసేవారు అనే ఆనవాళ్ళు ఉన్నాయని, అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ ముస్లింలు ప్రార్ధన చేసే వారని, ఇక్కడ మసీద్ కూల్చివేయటాన్ని కూడా కోర్ట్ తప్పుబట్టింది.  

court 09112019 2

అంతకు ముందు తీర్పు చదవుతూ, ఐదుగురు న్యాయమూర్తులు ఎకాగ్రీవ తీర్పు ఇచ్చారని, రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య తీర్పును ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీ పై ఎక్కడా స్పష్టత లేదని కోర్ట్ తెలిపింది. అయితే విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేస్తినట్టు తెలుస్తుందని కోర్ట్ పేర్కొంది. బాబ్రీ మస్జీద్ ని ఖాళి స్థలం లో నిర్మించలేదని, అక్కడ ఇంతకముందు వేరే బిల్డింగ్ ఉండేదని ఆసి రిపోర్ట్ ద్వారా తెలుస్తోందని అన్నారు. అక్కడ బౌద్ధమత ఆరామం ఉండేదో, లేక హిందూ దేవాలయం ఉండేదో తెలియడం లేదు. అలాగే మసీద్‌ కింద ఆలయ అవశేషాలు ఉన్నట్లు అర్కియోలజీ డిపార్టుమెంటు గుర్తించిందని కోర్ట్ తెలిపింది. ఈ క్రమంలోనే, షియా వక్ఫ్ బోర్డు, అఖాడా చేసిన వాదనలను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. అలాగే యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటీషన్ ను కూడా సుప్రీం కోర్ట్ కొట్టేసింది.

court 09112019 3

అలాగే బాబ్రీ మసీద్ నిర్మాణం పై సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ, బాబ్రీ మసీద్ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సుహస్తు, నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే, సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతిసారి మాటమారుస్తూ వస్తుందని కోర్ట్ తెలిపింది. మొగల్ చక్రవర్తి అయిన బాబర్ దగ్గర పని చేసిన, సైనికాధికారులు మసీదును నిర్మించారనే ఆధారాలు ఉన్నాయని అన్నారు. మరో పక్క దేశంలో ఎక్కడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండ, కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అసాంఘిక శక్తులు ఎలాంటి కుట్రలకు పాల్పడకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి రాష్ట్రాన్ని స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు, పరిస్థితిని పర్యవేక్షణ చేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read