ఒక నెల రోజుల క్రితం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హిందీ భాషను, అన్ని రాష్ట్రాల వారు నేర్చుకోవాలి, ఇది మన జాతీయ భాష అని చెప్పటంతో, ఎంత గోల గోల జరిగిందో చూసాం. తమిళనాడులో అయితే పార్టీలకు అతీతంగా, అమిత్ షా వ్యాఖ్యలకు ఎదురు తిరగటంతో, అమిత్ షా కూడా, నేను అలా అనలేదు, నేర్చుకుంటే మంచిది అని చెప్పానని చెప్పారు. మన మాతృభాష అంటే, ప్రతి రాష్ట్ర ప్రజలకు మక్కువ ఉంటుంది. అలాగే మన తెలుగు భాష కూడా. గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, ప్రభుత్వ స్కూల్స్ లో, ఇంగ్లీష్ మీడియం కూడా పెడుతున్నామని, ఎవరికి కావలసిన మీడియం వారు తీసుకోవచ్చని, అంటేనే, మన రాష్ట్రంలో తెలుగు భాష కోసం అంటూ, కొంత మంది చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లాంటి వాళ్ళు, చంద్రబాబు తెలుగు ద్రోహి అంటూ, వ్యాఖ్యలు కూడా చేసారు. అలాగే అప్పటి ప్రతిపక్షం కూడా, ఇలాగే గోల గోల చేసింది.
నిజానికి అప్పుడు చంద్రబాబు ఒప్షన్స్ ఇచ్చారు. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఎవరీ కావాల్సింది వాళ్ళు సెలక్ట్ చేసుకోవచ్చని. దానికి కూడా మనోళ్ళు గోల చేసారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అసలు తెలుగు మీడియం అనేది ప్రభుత్వ స్కూల్స్ లో లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి 1-8 క్లాస్ వరకు, ఇంగ్లీష్ మీడియం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఆ పై ఏడు నుంచి, 9,10 క్లాసుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. తెలుగు కాని, ఉర్దూ కాని, ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంటాయని, ఆ ఉత్తర్వుల్లో పెరుకున్నారు. అంటే ఇక మన రాష్ట్రంలో తెలుగు మీడియం అనేది ఉండదు.
అయితే ఈ ఉత్తర్వులు పై, పలువురు మండి పడుతున్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో 8వ తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని చెబితే రాష్ట్రంలో రద్దు చేయడం విచారకరమని పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన ఆప్షన్ వారికి ఇవ్వాలని, కోరుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు చదివి, ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తే ఏమి అర్ధం కావని అంటున్నారు. అలాగే ఇప్పుడున్న టీచర్స్ కి కూడా, ఇంగ్లీష్ మీడియంలో చెప్పే సమర్ధత ఉండదని, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, వారు కూడా అందుకోలేరని అంటున్నారు. ఇలా చేస్తే, పిల్లలు ఒత్తిడితో, బడి మానేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఉంచాలని, ఎవరికి కావాల్సింది వారు ఎంపిక చేసుకునే స్వేఛ్చ ఇవ్వాలని అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు తెలుగుతో పాటు, ఇంగ్లీష్ కూడా ఉంటుంది అంటేనే గోల చేసిన వారు, ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ ఎత్తేస్తుంటే, ఏమి అంటారో, అసలు ఏమి మాట్లాడరో చూద్దాం.