సంక్రాంతికి విడుదలైన బాలయ్య, చిరు సినిమాల వేదికగా విష ప్రచారం చేసి వారి ఫ్యాన్స్, సామాజి కవర్గాల మధ్య విభేదాలకు భారీ ప్లాన్ చేసిన బులుగు బ్యాచ్ కుట్ర భగ్నం అయ్యింది.  బులుగు బ్యాచ్ ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా భారీ ప్రణాళికతో వస్తుంది. బులుగు బ్యాచ్ ఈ కుతంత్రంతో వ‌స్తుంది..అని కొంద‌రు హెచ్చ‌రించినా వినే స్థితిలో ఏపీ ప్ర‌జ‌లు ఉండ‌రు. కోడిక‌త్తి, బాబాయ్ మ‌ర్డ‌ర్ఆ బులుగు బ్యాచ్ ప‌న్నిన వ్యూహాలు అని ఒక‌రు ముందుగానే మొత్తుకుని చెప్పినా..అప్ప‌టి ప్ర‌భుత్వంలో ఉన్న టిడిపి లైట్ తీసుకుంది. ఆ బులుగు బ్యాచ్ స్కెచ్ ల ఫ‌లితంతో దారుణ ప‌రాజ‌యం చ‌విచూసింది టిడిపి. అధికారంలోకి వ‌చ్చాక కూడా విష‌ వ్యూహాల‌ను అమ‌లు చేస్తూనే ఉంది. వీటిని తిప్పికొట్ట‌డంలో టిడిపి కూడా రాటుదేలింది. చిరు, బాల‌య్య సినిమాల విడుద‌లయ్యాయి. కాపు-క‌మ్మ పేరుతోనూ, ఫ్యాన్స్ పేరుతోనూ ఒక‌రిపైకి మ‌రొక‌రిని ఉసికొల్పేలా ఫేక్, మార్ఫ్‌డ్ కంటెంట్ రెడీ చేసి వ‌దిలారు. ఈ విడ‌త టిడిపి ముందుగానే అలెర్ట్ అయ్యింది. బులుగు బ్యాచ్ చేయ‌బోయే విష‌ప్ర‌చారం న‌మ్మొద్దంటూ టిడిపి అన్ని మాధ్య‌మాల ద్వారా అప్పీల్ చేసింది. వారు ఏం కుట్ర ప‌న్నార‌నేది వివ‌రించింది. దీంతో సోష‌ల్మీడియా వేదిక‌గా వేల‌కొద్దీ ఫేక్ అక్కౌంట్ల ద్వారా పుష్ చేసిన కంటెంట్ ఎటువంటి ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. రెండు సినిమాలు విడుద‌లై, విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి. చిరు బాల‌య్యని ఉద్దేశించి  చేసిన వ్యాఖ్య‌లంటూ ఓ మార్ఫింగ్ వీడియో వైసీపీ వ‌దిలింది. త‌న కుటుంబంలో చెర్రీ, బ‌న్నీ గురించి చిరు చెప్పిన విష‌యాల‌ను అస‌లు వీడియోని టిడిపి సోష‌ల్మీడియా బ‌య‌ట‌పెట్టింది. మొత్తానికి క‌మ్మ‌-కాపు విద్వేషాలు పెంచాల‌ని బులుగు బ్యాచ్ త‌యారుచేసిన ప్ర‌మాద‌క‌ర‌మైన కంటెంట్ ఇద్ద‌రి సినిమాల‌కు మంచి ప్ర‌చారం తెచ్చి పెట్టింది. టిడిపి కూడా బులుగు బ్యాచ్ వ్యూహాన్ని ముంద‌స్తుగా తెలుసుకుని చిత్తు చేయ‌డంలో విజ‌యం సాధించింది.

సీబీఐ-ఈడీ పెట్టిన కేసుల్లో ఏ1 జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయితే ఏ2 విజ‌య‌సాయిరెడ్డి. ఇద్దరూ ఒకే జైలులో చాలా కాలం ఉన్నారు. మామా అల్లుళ్ల బంధం కంటే ఆర్థిక‌ సంబంధం వీరి మ‌ధ్య విడ‌దీయ‌లేనిది. వైఎస్ జ‌గ‌న్ సీఎం అయ్యాక పార్టీలో నెంబ‌ర్ 2గా విజ‌యసాయిరెడ్డి హ‌వా బాగానే సాగింది. రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్రంతో స్నేహం వ‌ల్ల వ‌చ్చిన ప‌దికి పైగా ప‌ద‌వులు సాయిరెడ్డి సొంత‌మ‌య్యాయి. ఉత్త‌రాంధ్ర‌కి అన‌ధికార ముఖ్య‌మంత్రిగా సాయిరెడ్డి కొన‌సాగారు. భూముల కుంభ‌కోణాలు, క‌బ్జాలని ఆరోపణలు వచ్చినా  చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేశారు. ఉత్త‌రాంధ్ర వైసీపీ నేత‌లంతా మాకు ఈయ‌న వ‌ద్దు బాబోయ్ అని వేడుకున్నా జ‌గ‌న్ రెడ్డి క‌నిక‌రించ‌లేదు. ఏమైందో ఏమో హ‌ఠాత్తుగా విజ‌య‌సాయిరెడ్డిని దూరం పెడుతూ వ‌స్తున్నార‌ని వైసీపీలో నేత‌ల‌కు అర్థం అయిపోయింది. ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు ఊడ‌పీకేశారు. సోష‌ల్మీడియా బాధ్య‌త‌ల నుంచి సాయిరెడ్డిని త‌ప్పించ‌కుండా, స‌జ్జ‌ల కుమారుడు భార్గ‌వ్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టిన‌ట్ట‌య్యింది. ఒక్కో కీల‌క బాధ్య‌త‌ల నుంచి జ‌గ‌న్ రెడ్డి త‌ప్పిస్తుండ‌డంతో సాయిరెడ్డి ప‌ని అయిపోయిందని వైసీపీ బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు పాట‌కి గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు అందుకున్నందుకు సినిమా టీముని అభినందిస్తూ ఏపీ సీఎం జగన్‌ రెడ్డి చేసిన ట్వీట్ పై ఫేమ‌స్ సింగ‌ర్‌ అద్నాన్‌ సమీ ఘూటు రిప్ల‌యి ఇచ్చారు. ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత అవార్డు తెలుగు చిత్రానికి దక్కడం తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీటుని అద్నాన్ సమీ త‌ప్పు ప‌ట్టారు. మనమందరం భారతీయులమని ఒక ప్రాంతాన్ని మిగిలిన దేశం నుంచి విడదీయవద్దని జ‌గ‌న్ విద్వేషం విడ‌నాడాల‌ని న‌ర్మ‌గ‌ర్భంగా హెచ్చ‌రిస్తూ ట్వీటు చేశారు. జగన్ వేర్పాటువాద వైఖరిని అనుసరిస్తున్నారన్నార‌ని స‌మీ మండిప‌డ్డారు. అక్క‌డ ఎగిరింది తెలుగు జెండా,  భారత జెండా అని ప్రశ్నించారు. మిగిలిన దేశం నుంచి వేరు చేసుకోవద్దని జ‌గ‌న్ కి సూచించారు. ఇంట‌ర్నేష‌న‌ల్ గా అయితే మ‌నంద‌రికీ   ఒకే దేశం అంటూ సమీ టీజ్ చేశారు. దీనిపై మంత్రి విడ‌ద‌ల ర‌జినీ అతిగా ఆలోచించకుండా మీరూ భారతదేశానికి ఇలాంటి గొప్ప అవార్డును తీసుకురండి అంటూ స‌మీకి కౌంటర్ ఇచ్చారు. తమ మూలాలను గౌరవించుకోవడం వేర్పాటువాదం ఎలా అవుతుంద‌ని ర‌జినీ ట్వీట్ చేశారు. మ‌రో మంత్రి గుడివాడ అమర్నాథ్  మా భాష, సంస్కృతి ఎప్పటికీ మాకు గర్వకారణమేన‌ని దేశభక్తిపై మీరు తీర్పులివ్వాల్సిన అవసరం లేదని కౌంట‌రిచ్చారు. గాయకుడు సమీ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మొత్తానికి భాష తెలియ‌ని సింగ‌ర్, రాష్ట్రంతో సంబంధ‌లేని సింగ‌ర్ అద్నాన్ స‌మీ సీఎంపై చేసిన ట్వీట్ ఎటాక్ తో వైసీపీ స‌త‌మ‌త‌మైంది. వైసీపీ క్యాంప్ నుంచి వ‌చ్చిన ట్వీట్ల‌కు రిప్ల‌యి ఇచ్చిన స‌మీ, దేశ‌భ‌క్తి గురించి నాకు పాఠాలు చెప్పొద్ద‌ని, ఒక ముఖ్య‌మంత్రిగా ప్ర‌ద‌ర్శించాల‌ని రాజ‌నీతిజ్ఞ‌త తెలుసుకోవాలంటూ మ‌ళ్లీ ట్వీటారు. మొత్తానికి అద్నాన్ స‌మీకి రిప్ల‌యిలు ఇవ్వ‌డానికి ఐప్యాక్ టీములో నార్త్ ఇండియ‌న్ మంత్రుల పేరుతో నానా తంటాలు ప‌డుతున్నారు.

చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని చూసి ఏం చేయ‌లేక బ‌రితెగించి మ‌రీ తెచ్చిన జీవోని రెండు వారాలు కూడా పూర్తి కాక ముందే కోర్టు కొట్టేసింది. 1861 పోలీస్‌ యాక్ట్‌  సెక్షన్‌ 30 ప్రకారం రోడ్లపై ర్యాలీలు, రోడ్‌ షోలు చేపట్టరాదంటూ ప్ర‌భుత్వం నిషేధం విధిస్తూ జీవో 1 తెచ్చింది. ఈ చీకటి జీవోని తక్షణమే రద్దు చేయాలని విప‌క్షాలు ఉద్య‌మించాయి. జీవో 1 సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. రామకృష్ణ తరపున లాయర్‌ అశ్వినీకుమార్, ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్ శ్రీరామ్ వాదించారు. అనంత‌రం   23 వ తేదీ వరకూ జీవో అమ‌లుపై హైకోర్టు సస్పెన్షన్ విధించింది. టిడిపి, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టు పార్టీలు కూడా ఇటీవ‌ల కాలంలో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై రోడ్డుపైకి వ‌స్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగిన నేప‌థ్యంలో విప‌క్షాల స‌భ‌లు, ర్యాలీల‌కు అశేష‌జ‌నం హాజ‌ర‌వుతున్నారు. ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని బెదిరించినా వీరు త‌గ్గ‌డంలేదు. దీంతో ఏకంగా విప‌క్షాలు స‌భ‌లు, ర్యాలీలు పెట్ట‌కుండా  1861 నాటి బ్రిటిష్ చ‌ట్టం అమ‌లుకి బ‌రితెగించింది జ‌గ‌న్ స‌ర్కారు.

Advertisements

Latest Articles

Most Read