ఎవరి ప్రాధాన్యత ఏమిటి అని చెప్పే చక్కటి ఉదాహరణ ఇది. గతంలో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఎలాగైనా పోలవరం పూర్తి చేసి, రాష్ట్రంలో ప్రతి మూలకు నీళ్ళు తీసుకువెళ్ళి, పోలవరం పూర్తీ చెయ్యాలని, ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ వల్ల కాదని, కేంద్రంతో పోరాడి, నవయుగ కంపెనీని తీసుకువచ్చారు చంద్రబాబు. నవయుగ రావటంతోనే, పోలవరం పనులు పరుగులు పెట్టాయి. కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు ని కూడా తిరగరాసి, పోలవరం ప్రాజెక్ట్ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది అనే నమ్మకం కలిగించారు. అసలు అవ్వదు ఎనుకున్న పోలవరం, 73 శాతం పూర్తయింది అంటే, చంద్రబాబు ఆనాడు, నవయుగని తీసుకు రావటమే కారణం. కేంద్రం కూడా నవయుగ స్పీడ్ ని మెచ్చుకుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది.
గత నాలుగు నెలలుగా, పోలవరం ప్రాజెక్ట్ లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు. పైగా చంద్రబాబు తీసుకొచ్చిన నవయుగ కంపెనీ మాకు వద్దు, వాళ్ళు అవినీతి చేసారు, మేము రివర్స్ టెండరింగ్ వేసి, నిజాయితీకి మారు పేరైన, మేఘా కంపెనీని తీసుకోవచ్చాం అని జగన్ ప్రభుత్వం చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఒప్పుకోలేదు. ఇది ఇలా సాగుతూ ఉండగానే, జగన్ ప్రభుత్వం తీసుకోచ్చిన, నిజాయతీకి మారు పేరైన మేఘా కంపెనీ పై, గత వారం రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇన్ని రోజుల పాటు, ఒక కంపెనీలో, ఒక ఇంట్లో ఐటి దాడులు జరుగుతున్నాయి అంటే, ఎన్ని లొసుగులు ఉండకపోతే జరుగుతాయి ?
ఒక పక్క మేఘా పై ఐటి దాడులు జరుగుతుంటే, మరో పక్క ఇదే పోలవరం ప్రాజెక్ట్ సూపర్ స్పీడ్ లో చేసినందుకు, నిన్న నవయుగ కంపెనీకి ప్రతిష్టాత్మిక అవార్డు వచ్చింది. Construction World Global Awards-2019 ఇచ్చిన అవార్డుల్లో, బెస్ట్ కనస్ట్రక్షన్ కంపెనిగా, పోలవరం ప్రాజెక్ట్ కి గాను, నవయుగ కంపెనీ ఎంపిక అయ్యింది. ఈ అవార్డులు నిన్న ఢిల్లీలో ఇచ్చారు. నవయుగ ఎండీ శ్రీధర్, ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా, నవయుగ యాజమాన్యం, తన కార్మికులు అందరికీ ఈ అవార్డును అంకితం చేసింది. అయితే, ఎవరు ఎలా ఉన్నా, మన పోలవరం విషయంలో మాత్రం, ఇలా అవార్డులు వచ్చిన కంపెనీని కాదాని, వారం రోజులుగా ఐటి దాడులు చేస్తున్న కంపెనీకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో, ప్రజలే అర్ధం చేసుకోవాలి.