కేంద్ర మాజీ మంత్రి, సినీ హేరో మెగాస్టార్ చిరంజీవి, జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఆయన ఇందుకు కోసం, ఇప్పటికే, జగన్ మోహన్ రెడ్డిని అపాయింట్‌మెంట్ కోరారు. దీంతో చిరంజీవికి సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. రేపు ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా చిరంజీవిని కోరింది, సిఎంవో. దీంతో రేపు 11 గంటలకు, జగన్‌తో చిరంజీవి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటుగా, ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా జగన్ తో భేటీ అవుతారు. అయితే ఈ కలియక కేవలం సినిమాలకేనా, లేక రాజకీయ విషయాలు కూడా చర్చిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇటీవల చిరంజీవి నటించిన, 152వ సినిమా సైరా నరసింహారెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే. చారిత్రాత్మిక సినిమా అని ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి, ఆయన కొడుకు, సినిమాకు ప్రొడ్యూసర్ కూడా అయినా రాం చరణ్ కోరనున్నారు.

chiru 10102019 2

‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. అయితే ఇటీవల జగన్ పార్టీ నేత, ఎస్వీబీసి చైర్మెన్ అయిన పృధ్వీ, సినిమా ఇండస్ట్రీకి, జగన్ కనపడటం లేదని, సినిమా పెద్దలకు అహంకారం అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

chiru 10102019 3

అయితే చిరంజీవి విషయంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి, గత నెల రోజులుగా సానుకూలంగా ఉన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని , నలుగురు నలుగురు పెళ్ళాలు అంటూ జగన్ విమర్శలు చేసిన దగ్గర నుంచి, కొంత గ్యాప్ పెరిగింది. అయినా సరే, సైరా సినిమా ఆడియో రిలీజ్ నుంచి, ప్రమోషన్ దాకా, అన్నీ జగన్ మీడియా అయిన, సాక్షి తన భుజాన ఎత్తుకుంది. ఇది వ్యాపారంలో భాగం అని చెప్పే వారు కూడా ఉన్నారు. అయితే, భారీ బడ్జెట్ సినిమా అయిన సాహో కి స్పెషల్ షో లకు పర్మిషన్ ఇవ్వని జగన్ ప్రభుత్వం, సైరాకి మాత్రం, అదనపు షోలకు అనుమతి ఇవ్వటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు చిరంజీవి, జగన్ తో భేటీ కానున్నారు. మరి, ఈ మొత్తం పరిణామం పై, జనసేన ఎలా స్పందిస్తుందో మరి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రెండు రోజుల పర్యటన కోసం విశాఖపట్నం వెళ్లారు. ఈ రోజు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, మొదటిగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం విశాఖ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు కార్యకర్తలను, నాయకులు ఉద్దేశించి, ప్రసంగం మొదలు పెట్టరు. చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టిన 15 నిమషాలకు, ఒకేసారి కరెంటు పోయింది. సరిగ్గా చంద్రబాబు కరెంట్ కష్టాలు పై మాట్లాడుతూ ఉన్న సమయంలోనే, కరెంటు పోయింది. సడన్ గా జరిగిన ఈ సంఘటనతో, అక్కడ అంతా చీకట్లు అలుముకున్నాయి. తరువాత కొద్ది సేపటికి, కరెంటు వచ్చింది. అయితే ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికే కరెంటు కష్టాలు ఎదురు అవ్వటంతో, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

current 10102019 2

కరెంటు పోయిన వెంటనే, ఇదే జగన్ మార్క్ పాలన అంటూ కార్యకర్తలు నినాదాలు చేసారు. కరెంటు వచ్చిన తరువాత, చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా, మరోసారి కరెంటు పోయి, చివరకు లో కరెంటు వచ్చింది. దీంతో అక్కడ ఫ్యాన్ లు కూడా పని చేయని పరిస్థితి వచ్చింది. ఈ ఘటన పై చంద్రబాబు మాట్లాడుతూ, చూసారా తమ్ముళ్ళు, ఇది రాష్ట్రంలో పరిస్థతి, గత 15 రోజులుగా రాష్ట్రంలో కరెంటు కష్టాలు అధికం అయ్యాయి. వర్షాలు పడుతున్నాయి, చల్లగా వాతావరణం ఉంది, అయినా కరెంటు కోతలు ఉన్నాయి అంటే, వీళ్ళు ఎంత అసమర్దులో అర్ధమవుతుందని అన్నారు. బొగ్గు లేదని సిగ్గు లేకుండా చెప్తున్నారని, బొగ్గు అయిపోయే దాకా, ఏమి చేస్తున్నారని, చంద్రబాబు ప్రశ్నించారు.

current 10102019 3

అలాగే తన మీద కోపంతో, తనని జైలుకు పంపించాలని, విద్యుత్ పీపీఏల పై సమీక్ష అని చెప్పి, సోలార్, విండ్ ఎనర్జీ తీసుకోవటం లేదని, అటు బొగ్గు లేదని, చివరకు ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఒక పక్క కేంద్రంతో పాటు, కోర్ట్ లు కూడా విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగటం లేదు అని చెప్తున్నా, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, చివరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు అన్నారు, చంద్రబాబు మాట్లాడిన, దాదపుగా 30 నిమిషాల పాటు, కరెంటు రావటం, పోవటం, లో కరెంటు రావటం, ఇవన్నీ చూసిన చంద్రబాబు, ఇది రాష్ట్రంలో కరెంటు పరిస్థితి అని అన్నారు. మొత్తానికి, రాష్ట్రంలో ఉన్న కరెంటు పరిస్థితి గురించి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి కూడా రుచి చూపించింది, ప్రభుత్వం.

రాజు తలుచుకుంటే, సామాన్య ప్రజలైనా, ఎవరైనా తల వంచాల్సిందేనా ? రేపు అనంతురం జిల్లాలో, జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పధకం ప్రారంభం చెయ్యటానికి, జగన్ అనంతపురం వెళ్తున్నారు. అయితే ఆయన సభ ఏర్పాటుల్లో భాగంగా, ఏర్పాట్లు కోసం, అధికారులు అత్యుత్సాహం చూపించారు. జగన్ వచ్చే బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు కోసం, అక్కడ ఉన్న ఇల్లు తొలగించే ప్రయత్నం చేసారు. ఆ వేదిక వద్ద 50 ఏళ్ళుగా ఉంటున్న ఇళ్ళని, జేసీబీతో తొలగించారు. కేవలం ఆయన ఒక్క గంట మీటింగ్ కోసం, 50 ఏళ్ళుగా ఉంటున్న మా ఇళ్ళు తొలగిస్తారా అనే ఎదురు తిరిగిన స్థానికుల పై, అధికారులు దౌర్జన్యం చేశారు. ఈ తతంగం అంతా, దాదపుగా రెండు గంటల పాటు సాగింది. స్థానికులు ఎంత అడ్డు పడినా, అధికారంతో, వారిని పక్కకు తోసేసి, జేసీబీలతో ఇళ్ళు తొలగించారు.

meeting 09102019 2

అక్కడకు వచ్చిన మీడియా కవరేజ్ ని కూడా అడ్డుకున్నారు. మీడియా పై కూడా అధికారులు దౌర్జన్యం చేసారు. మునిసిపల్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది దగ్గరుండి, పేదల ఇళ్ళు తొలగించారు. అక్కడ ఉన్న పేదల గుడిసెలు, పీర్ల చావిడి కూడా తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పేదలు కావటంతో, బాధపడటం మినహా, అధికారులను నిలువరించలేక పోయారు. జగన్ ఒక్క గంట పాటు చేసే పర్యటన, అక్కడ 50 ఏళ్ళుగా ఉంటున్న నిరుపేదల పాలిట శాపంగా మారింది. చివరకు, అక్కడ ఉన్న పీర్ల చావిడిని తొలగించవద్దని ముస్లిం మత పెద్దలు అధికారుల వద్దకు వెళ్లి వేడుకున్నారు. అయినా అధికారులు కనికరించలేదు. దీంతో జేసిబీలతో అది కూడా కూల్చేసారు. మాకు ఆదేశాలు ఉన్నాయి అంటూ పడగోట్టేసారు.

meeting 09102019 3

అధికారుల చర్యల పై తెలుగుదేశం పార్టీ నేతలు మండి పడుతున్నారు. కంటి వెలుగు ప్రారంభోత్సవానికి వస్తున్న, ప్రభుత్వానికే ముందు కంటి పరీక్షలు చెయ్యాలని, వారికి పేదల కష్టాలు కంటికి కనిపించటం లేదని విమర్శిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ పధకం చంద్రబాబు హయంలో ఉంది. తెలంగాణా కంటే ముందే, ఈ పధకం "ముఖ్యమంత్రి ఐ కేంద్రాల" పేరుతొ ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తరువాత తెలంగాణా కంటి వెలుగు పేరుతొ పెట్టింది. చంద్రబాబు పెట్టిన ఈ పధకంలో, దాదపుగా 10 లక్షల మందికి పైగా కళ్ళ జోళ్ళు కూడా పంపిణీ జరిగింది. ఇప్పటికే ఉన్న ఈ పధకానికి, ఇంత హడావిడి ఎందుకని ? పేరు మార్చి, అదే కంటిన్యూ చెయ్యచ్చు కదా, అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో తెలుగుదేశం శ్రేణులకు నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాలు తరువాత, మొదటి సారూ విశాఖపట్నం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి , ఘన స్వాగతం పలకటానికి, వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి చంద్రబాబుని భారీ ర్యాలీ మధ్య తీసుకువెళ్లటానికి సన్నాహాలు చేసిన వేళ, పోలీసులు వారికి షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి, పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులతో కలిసి, చంద్రబాబు తన కాన్వాయ్ తో బయలుదేరగానే, పోలీసులు వచ్చి చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, మీ కాన్వాయ్ ఒక్కదానికే అనుమతి ఉంది అంటూ, పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ ని ముందుకు కదల నివ్వలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ ఉండటంతో, ముందు జాగ్రత్తగా, అక్కడి నుంచి ఎన్ఏడీ జంక్షన్‌కు చంద్రబాబు కాన్వాయ్‌ను తరలించారు.

cbn 10102019 2

ఈ సమయంలో, ఎవరూ ఉద్రేకానికి లోను కావద్దని, వారు చెప్పినట్టే చేద్దాం అని, చంద్రబాబు చెప్పటంతో, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెయ్యలేదు. ఎన్ఏడీ జంక్షన్‌కు చేరిన చంద్రబాబు కాన్వాయ్‌ను, అక్కడ కార్యకర్తలు, నేతలను చెదరగొట్టి, అక్కడ నుంచి చంద్రబాబు కాన్వాయ్ ని పంపించారు. అంతకు ముందు కూడా, చంద్రబాబుకి స్వాగతం పలకటానికి వచ్చిన కార్యకర్తలను కూడా, ఎయిర్ పోర్ట్ కి రానివ్వకుండా, ఎన్ఏడీ జంక్షన్‌ వద్దే వారిని ఆపేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి, వెలగపూడి నిరసన తెలిపారు. మరికొందరు కార్యకర్తలను విమానాశ్రయంలోనూ పోలీసులు నిలిపివేశారు. అయితే, విజయసాయి రెడ్డి లాంటి చిన్న నేత వచ్చినా, హంగామా చేస్తూ వెళ్తారని, అప్పుడు లేని ఇబ్బంది, చంద్రబాబుకి స్వాగతం చెప్పటానికి వస్తే వచ్చిందా అంటూ తెలుగుదేశం నేతలు, పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

cbn 10102019 3

పోలీసులు మాత్రం, మా పని మేము చేసాం అని, అంటున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఇవాళ విశాఖ చేరుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నేతలతో సమీక్షా సమావేశం జరపనున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సహా రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులంతా హాజరవుతున్నారు. పార్టీ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గం నుంచి 60 మందిని పిలిచారు. నాయకులతో కలిపి ప్రతీ సమీక్షకు వందమందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ఈ రెండు రోజులు, కార్యాలయం ఆవరణలోనే చంద్రబాబు, ఆయన వ్యక్తిగత సహాయకులు, భద్రత సిబ్బంది బస చేస్తారు. ఆరుబయట పెద్ద తెరలు ఏర్పాటు చేసి షామియానాలు వేశారు.

Advertisements

Latest Articles

Most Read