ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రెండు రోజుల పర్యటన కోసం విశాఖపట్నం వెళ్లారు. ఈ రోజు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, మొదటిగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం విశాఖ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు కార్యకర్తలను, నాయకులు ఉద్దేశించి, ప్రసంగం మొదలు పెట్టరు. చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టిన 15 నిమషాలకు, ఒకేసారి కరెంటు పోయింది. సరిగ్గా చంద్రబాబు కరెంట్ కష్టాలు పై మాట్లాడుతూ ఉన్న సమయంలోనే, కరెంటు పోయింది. సడన్ గా జరిగిన ఈ సంఘటనతో, అక్కడ అంతా చీకట్లు అలుముకున్నాయి. తరువాత కొద్ది సేపటికి, కరెంటు వచ్చింది. అయితే ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికే కరెంటు కష్టాలు ఎదురు అవ్వటంతో, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
కరెంటు పోయిన వెంటనే, ఇదే జగన్ మార్క్ పాలన అంటూ కార్యకర్తలు నినాదాలు చేసారు. కరెంటు వచ్చిన తరువాత, చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా, మరోసారి కరెంటు పోయి, చివరకు లో కరెంటు వచ్చింది. దీంతో అక్కడ ఫ్యాన్ లు కూడా పని చేయని పరిస్థితి వచ్చింది. ఈ ఘటన పై చంద్రబాబు మాట్లాడుతూ, చూసారా తమ్ముళ్ళు, ఇది రాష్ట్రంలో పరిస్థతి, గత 15 రోజులుగా రాష్ట్రంలో కరెంటు కష్టాలు అధికం అయ్యాయి. వర్షాలు పడుతున్నాయి, చల్లగా వాతావరణం ఉంది, అయినా కరెంటు కోతలు ఉన్నాయి అంటే, వీళ్ళు ఎంత అసమర్దులో అర్ధమవుతుందని అన్నారు. బొగ్గు లేదని సిగ్గు లేకుండా చెప్తున్నారని, బొగ్గు అయిపోయే దాకా, ఏమి చేస్తున్నారని, చంద్రబాబు ప్రశ్నించారు.
అలాగే తన మీద కోపంతో, తనని జైలుకు పంపించాలని, విద్యుత్ పీపీఏల పై సమీక్ష అని చెప్పి, సోలార్, విండ్ ఎనర్జీ తీసుకోవటం లేదని, అటు బొగ్గు లేదని, చివరకు ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఒక పక్క కేంద్రంతో పాటు, కోర్ట్ లు కూడా విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగటం లేదు అని చెప్తున్నా, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, చివరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు అన్నారు, చంద్రబాబు మాట్లాడిన, దాదపుగా 30 నిమిషాల పాటు, కరెంటు రావటం, పోవటం, లో కరెంటు రావటం, ఇవన్నీ చూసిన చంద్రబాబు, ఇది రాష్ట్రంలో కరెంటు పరిస్థితి అని అన్నారు. మొత్తానికి, రాష్ట్రంలో ఉన్న కరెంటు పరిస్థితి గురించి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి కూడా రుచి చూపించింది, ప్రభుత్వం.