రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సినిమాకు, రాజకీయం కలిసి నడుస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి మొన్నటి పవన్ కళ్యాణ్ దాకా ఉదాహరణ. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ అయినంతగా, ఎవరూ కాలేదు. తెలుగు సినిమాలో టాప్ హీరోలుగా పేరు ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తారు మారు చేస్తూ జగన్ అధికారంలోకి రావటం, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ అయితే, తన పార్టీ గెలిచింది ఏమి లేదు కాని, తెలుగుదేశాన్ని నష్ట పరచటంలో మాత్రం సక్సస్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ విధానాల పై, ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చే అవకాసం ఉంది. ఈ నేపధ్యంలో, వచ్చే రెండు మూడు ఏళ్ళలో, మళ్ళీ తెలుగుదేశం, జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయి. వీరికి బీజేపీ తోడయ్యినా ఆశ్చర్యం లేదు.

chiru 09102019 2

ఏ సోషల్ ఇంజనీరింగ్ తో అయితే జగన్ అధికారంలోకి వచ్చారో, అది పూర్తిగా మారి పోయే అవకాసం కనిపిస్తుంది. అందుకే, ఇప్పటి నుంచి వైసిపీ తన వ్యూహాలకు పదను పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆక్టివ్ గా లేరు. ఆయన బీజేపీలొకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే, గత నెల రోజులుగా వైసీపీ అడుగులు చుస్తే, చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే వ్యూహం పన్నినట్టు కనిపిస్తుంది. తన పై రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ, చిరంజీవి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇలా చేస్తే, కాపు సామాజికవర్గం చీలితే, మళ్ళీ తనకే కలిసి వస్తుందని అనే ఆలోచలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే, చిరంజీవి కొత్త సినిమాకు, జగన్ మీడియా కాని, ఏపి ప్రభుత్వం కాని పూర్తిగా సహకరించింది. చిరంజీవి, వర్గం, అభిమానుల్లో ఇమేజ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.

chiru 09102019 3

సైరా సినిమా ఆడియో రిలీజ్ మీడియా పార్టనర్ గా సాక్షి వ్యవహరించింది. తరువాత సినిమా ప్రమోషన్ కూడా సాక్షి తన బుజాల మీదకు తీసుకుంది. ఇది చిరంజీవి అభిమానులకు కూడా షాక్ కు గురి చేసింది. అదే విధంగా సాహో సినిమాకు ఏపీలో స్పెషల షోలకు అనమతి ఇవ్వని ఏపీ ప్రభుత్వం..తాజాగా సైరా సినిమాకు మాత్రం అర్దరాత్రి నుండి తెల్లారి 10 గంటలకు వరకు ఏకంగా ఆరు షోలకు చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది. ఇక తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహానికి అనుమతులు లేవు. అయితే జగన్ ప్రభుత్వం అనుమాతలు ఇవ్వటంతో, విగ్రహావిష్కరణకు చిరంజీవి వచ్చారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్ని పనులు దగ్గరుండి చూసారు. ఇక, చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటన మొత్తం వైసీపీ నేతలు చాలా క్లోజ్ గా చిరంజీవితో ఉండటం, అదే సందర్భంలో జనసేన నాయకులు ఎవరూ లేకపోవటం రాజకీయంగా చర్చకు కారణమైంది. మొత్తానికి చిరంజీవిని దగ్గరకు తీసే ప్రయత్నం మొదలైందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

టీవీ9 మాజీ సిఈవో రవి ప్రకాష్ అరెస్ట్ వెనుక ఉన్న, ఢిల్లీ మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతంది. రవి ప్రకాష్ ను కేసులలో ఇరికించి తీవ్ర ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. టీవీ9 కొత్త యాజమాన్యం, కేసీఆర్ కు సన్నిహితంగా ఉండటమే దీనికి కారణం అని రవి ప్రకాష్ వర్గీయులు విమర్శలు చేసారు కూడా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యడు అయిన విజయసాయి రెడ్డి కూడా రంగంలోకి దిగి, రవి ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని, సిబిఐ, ఈడీ కేసులు వెయ్యాలని, సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి కేసుల్లో రవి ప్రకాష్ ను అరెస్ట్ చెయ్యకుండా కోర్ట్ ఆర్డర్ ఇవ్వటంతో, ఇక రవి ప్రకాష్ పై ఏమి ఉండదని అందరూ అనుకున్న వేళ, ఉన్నట్టు ఉండి మరో కేసులో, రవి ప్రకాష్ ను అరెస్ట్ చెయ్యటం వెనుక మరో, ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీలోని తెలుగు మీడియా సర్కిల్స్ లో, రవి ప్రకాష్ తాజా కేసు, అరెస్ట్ వెనుక, ఆయన ఒక ప్రజా ప్రతినిధితో సన్నిహితంగా ఉండటమే కారణం అని చెప్తున్నారు.

ravi 09102019 2

ఆ ప్రజా ప్రతినిధి ఎవరో కాదు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, రవి ప్రకాష్ ను తరుచూ కలుస్తున్నారని, ఏదో ప్లాన్ చేస్తున్నారనే సమాచారం రావటంతో, వీరి దూకుడుకు వెంటనే బ్రేక్ వేసారనే ప్రచారం జరుగుతుంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ, రేవంత్ రెడ్డి వెళ్లి, రవి ప్రకాష్ ను జైల్లో కలిసారు. రవి ప్రకాష్ తో కలిసి, ప్రస్తుతం ఉన్న తెలంగాణా ప్రభుత్వం పై, పోరాడటానికి, రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేసారని, రవి ప్రకాష్ కొత్తగా పెట్టబోయే ఛానల్ లో, కేసీఆర్, మేఘా, రామేశ్వరరావు పై, దూకుడుతో కధనాలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి, రవి ప్రకాష్ ఈ మధ్య తరుచూ కలుస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దిల్లీ కేంద్రంగా రేవంత్, రవి ప్రకాశ్‌లు పలుమార్లు భేటీ అయినట్లుగా సమాచారం ఉండటంతో, తెలంగాణా ప్రభుత్వ పెద్దలు అలెర్ట్ అయ్యారని చెప్తున్నారు.

ravi 09102019 3

తనను ఇబ్బందులు పాలు చేసిన కేసిఆర్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాసం కోసం, రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, కేసీఆర్ మరో బాధితుడు అయిన రవి ప్రకాష్ తో కలిసారు. రవి ప్రకాష్ ఒక సంచలన ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారనే సమాచారం మీడియా వర్గాల్లో ఉంది. అలాగే హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కూడా, రేవంత్ ప్రచారానికి, రవి ప్రకాష్ బృందం రేవంత్ ప్రసంగాలను సిద్ధం చేయడంతో పాటుగా, సోషల్ మీడియా ప్రాచారానికి కూడా తమ వంతు సహాయం అందించటానికి రెడీ అయ్యారు. అయితే ఈ దూకుడు తెలుసుకున్న పెద్దలు, వెంటనే బ్రేక్ వేసారు. ఎప్పుడో పోలీసులను అడ్డుకున్నారని ఒక కేసు, నిధులు మళ్ళించారని మరో కేసు పెట్టటంతో, పోలీసులు వారి విధి నిర్వహిస్తూ, రవి ప్రకాష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో పక్క, ఇటు ఏపి నుంచి కూడా విజయసాయి రెడ్డి, రవి ప్రకాష్ పై చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. అన్ని వైపుల నుంచి రవి ప్రకష్ ను ఊపిరి ఆడకుండా, లాక్ చేస్తూ వస్తున్నారు.

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఒక కొత్త పధ్ధతిని తీసుకోవచ్చింది. అదే రివర్స్ టెండరింగ్. అయితే ఈ రివర్స్ టెండరింగ్ తో లాభామా, నష్టమా అంటే, ఎవరి వాదన వారికి ఉంది. ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అయితే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ రివర్స్ టెండరింగ్ ను, జగన్ పాలనకు ఆపాదిస్తూ, రివర్స్ పాలన అంటూ, తుగ్లక్ పాలన అంటూ, ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులు కూడా కొన్ని అలాగే ఉండటంతో, ప్రజలు కూడా ఆ విమర్శలకు కనెక్ట్ అవుతున్నారు. తాజాగా మరో సంఘటన ఇలాగే జరిగింది. అయితే ఇది ప్రభుత్వంలో జరిగిన సంఘటన కాదు, అధికార వైసిపీ పార్టీ నాయకులు చేసిన ఘటన. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు, సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతి పరులు, విజయసాయి రెడ్డి లాంటి వారు, ఎలాంటి పోస్టింగ్ లు పెడుతున్నారో, చూపించారు.

jogi 08102019 2

బూతులు తిడుతూ, అసభ్యకర భాష వాడుతూ, పెడుతున్న పోస్టింగ్ లు చూపిస్తూ, ఇలాంటి వారిని అరెస్ట్ చెయ్యకుండా, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేసి, అరెస్ట్ చెయ్యటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. చంద్రబాబు అన్ని వివరాలు చెప్పటం, ప్రెజంటేషన్ చూపించటంతో, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాయి. దీంతో, వైసిపీ కూడా కౌంటర్ స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ దగ్గర ఉండి, తమ పార్టీ నాయకుల పై అసభ్యంగా పోస్ట్ లు పెట్టిస్తున్నారని, నిన్న జోగి రమేష్, డీజీపీని కలిసి ఫిర్యాదు చేసారు. వారి పై చర్యలు తీసుకోవాలని, పోలీసులను కోరారు. వెంటనే వారిని ఆరెస్ట్ చెయ్యాలని కోరారు.

jogi 08102019 2

హైదరాబాద్ లో ఉన్న బాలకృష్ణ ఆఫీస్ నుంచి, 2 వేల మండి పని చేస్తూ, ఇలా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అయితే, బాలకృష్ణ ఇలాంటి పనులు చేపిస్తున్నారంటే ఎవరూ నమ్మరు. అదీ కాకా, వైసీపీ రివర్స్ స్ట్రాటజీ ఇక్కడ కనిపిస్తుంది. గతంలో, షర్మిల పై, అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారి పై, హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చింది వైసిపీ. అయితే, ఇప్పుడు హైదరాబాద్ లో, బాలకృష్ణ ఆఫీస్ లో, అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారని, అమరావతిలో కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి ఈ కంప్లైంట్ ఇవ్వాల్సింది హైదరాబాద్ లో. అక్కడ అయితే పోలీసులు నిజాన్ని నిగ్గు తేలుస్తారని, ఇది కేవలం రాజకీయ పరంగా ఇచ్చిన డమ్మీ కంప్లైంట్ కాబట్టి, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి, వార్తల్లో ఒక వార్త వేసారనుకోవాలి. ఇలా ఉంటాయి, వైసీపీ చేసే రివర్స్ పనులు, అని టిడిపి అంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దిగజారి పోతున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. 2004 వరకు లేని సంస్కృతీ, రాజశేఖర్ రెడ్డి సియం అయిన తరువాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. అదే రాజకీయ ఫిరాయింపులు. పదవుల్లో ఉంటూనే, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలోకి జంప్ కొట్టటం. అప్పట్లో ప్రతిపక్షాలను బలహీన పరచటానికి, వైఎస్ఆర్ ఇది బాగా ఉపయోగించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. తరువాత 2009లో టిడిపి ని టార్గెట్ చేసారు. టిడిపి ఎంపీలుగా ఉన్న, ఆదికేశవులు, మందా జగనన్నాదంను తన పార్టీలోకి చేర్చుకోవటం, అప్పట్లో సంచలనం అయ్యింది. రాజశేఖర్ రెడ్డి వేసిన ఈ బీజం, ఇప్పుడు వికృత రూపం దాల్చింది. 2014లో కేసిఆర్ అధికారంలోకి రాగానే, టిడిపి ఎమ్మెల్యేలను లాక్కుని, వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక 2016లో చంద్రబాబు ఇదే పని చేసారు.

ayyanna 09102019 2

అప్పటి వరకు ఈ ఫిరాయింపులకు బాదితులగా ఉన్న టిడిపి కూడా, ఇది మొదలు పెట్టే సరికి, రాజకీయాలు అంటే ప్రజలకు అసహ్యం పుట్టింది. నిజానికి, జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఆఫీస్ ముందు నుంచి, నీ ప్రభుత్వాన్ని గంటలో పడగొడతా, నా దగ్గర నీ మనుషులు 21 మంది ఉన్నారు అని అంటేనే, చంద్రబాబు అటు వైపు నుంచి లాగారు. కాని, ఏది చేసినా తప్పు తప్పే, దానికి మొన్న ఎన్నికల్లో దెబ్బ కూడా పడింది. అయితే ఇప్పడు, జగన్ అధికారంలోకి రావటంతో, ఇప్పుడు టిడిపి నుంచి అటు వెళ్తున్నారు. మొన్నటి దాక జగన్ ను బూతులు తిట్టిన జూపూడి, ఇప్పుడు జగన్ చేత కండువా కప్పించుకున్నారు. అధికారం లేకుండా, నాలుగు నెలలు కూడా ఉండలేని ఇలాంటి వారికి బుద్ధి చెప్తూ, నిన్న టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుచేసిన ఘాటైన వ్యాఖ్యలు, సంచలనంగా మారాయి. అయ్యన్న వ్యాఖ్యల పై, పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుంది.

ayyanna 09102019 3

ఇది పార్టీ మారే వారి పట్ల, అయ్యన్న చేసిన వ్యాఖ్యలు... "నాకు పార్టీ పదవులు ఇచ్చింది, ప్రజలు సమాజంలో నన్ను ఇంత స్థాయికి తీసుకుని వెళ్ళారు... నేను పోయినా కూడా ఒకే జెండా కప్పుకుని పోతా తప్పా... నాలుగు జెండాలు కలిపికుట్టుకుని పైన కప్పించుకొను.... నేను దమ్ముతో ఒకే స్థానం నుంచి పోటీ చేశాను.. ఒకే పార్టీలో ఉన్నాను...ఎందుకంటే నీతి, నిజాయితీ, నమ్మకం ఉన్నాయి కాబట్టి... పార్టీ పదవులు ఇచ్చినా కూడా వదిలి వెళ్లిపోయే అవకాశ వాదులు ఏ పార్టీకైనా చెద పురుగులే... అలాంటి నీతిలేని ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మకిలి వదులుతుంది... MLA, MP, Ministers, Chairman etc ఇచ్చింది కదా పార్టీ..ఇప్పుడు తల్లి కష్టాలలో ఉందని ఒదిలిపోయే పిరికి పిందెలు మాకు అవసరం లేదు... మా వెనుక ప్రజలు ఉన్నారు..." అని అయ్యన్న పాత్రుడు అన్నారు. అయితే ఇలా నిబద్ధతత ఉన్న నాయకులను గెలిపించకుండా, ప్రజలు మాత్రం, పార్టీలు మారే వారినే గెలిపిస్తూ ఉండటం, గమనార్హం. మారాల్సింది, ప్రజలా, రాజకీయ నాయకులా అనే ప్రశ్న కూడా వస్తుంది.

Advertisements

Latest Articles

Most Read