టీవీ9 మాజీ సిఈఓ రవి ప్రకాష్ పై కొత్తగా వచ్చిన యాజమాన్యం, టార్గెట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే వివిధ కేసుల పై, కొత్త యాజమాన్యం, రవి ప్రకాష్ ను అరెస్ట్ చెయ్యగా, తాజాగా మరో కేసు పెట్టారు. అయితే పోలీసులు ఉన్నట్టు ఉండి ఎంట్రీ ఇచ్చి, రవి ప్రకాష్ ను అదుపులోకి తీసుకోవటంతో, కొంత సేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పది మంది పోలీసులు, ఒకేసారి రవిప్రకాష్ ఇంటికి వెళ్లి, ఏ కారణం చేపకుండా, అతన్ని అరెస్ట్ చేసి, తీసుకువెళ్ళారు. అయితే ఆయనకు ఎందుకు తీసుకువెళ్తున్నారో సమాచారం ఇవ్వకపోవటంతో, కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే తరువాత కేసు వివరాలు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం, రవి ప్రకాష్ ని, బంజారాహిల్స్‌ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అయితే తాజగా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో టీవీ9 కొత్త యాజమాన్యం కేసు పెట్టింది. అదే ఈ అరెస్ట్ కు కారణం అని తెలుస్తుంది.

ravi 05102019 2

రవిప్రకాష్‌, మూర్తి, ఫెరీరియో పై శుక్రవారం, టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. బోర్డు అనుమతి లేకుండా కంపెనీ ఎకౌంటులో నుంచి, రూ.18.31 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని ఆరోపణ. తాము అన్ని రికార్డులు తిరగేస్తే, ఈ విషయం తెలిసిందని, దీని పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది, కొత్త యాజమాన్యం. ఈ విషయంలో రవి ప్రకాష్ కావాలనే ఇలా చేసి, నిధులు మళ్ళించారని, కొత్త యాజమాన్యం ఆరోపిస్తుంది. అయితే ఈ కేసు విషయం పై, 41 సీఆర్‌పీసీ ప్రకారం రవిప్రకాష్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేసారని, ఆ నోటీసును తీసుకునేందుకు రవిప్రకాష్‌ నిరాకరించారని, ఈ నేపధ్యంలోనే, బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు.

ravi 05102019 3

రవిప్రకాష్‌పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్‌క్రైమ్‌ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే కొత్త యాజమాన్యం వెనుక కేసీఆర్ సన్నిహితులు అయిన రామేశ్వర రావు, మేఘా కృష్ణా రెడ్డి ఉన్నారని, వారు దురుద్దేసపుర్వకంగా వ్యవహరిస్తూ, టీవీ9 ను కైవసం చేసుకుని, రవి ప్రకాష్ ను బయటకు పంపి, కేసుల్లో ఇరికించారని, రవి ప్రకాష్ సన్నిహితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నటుడు శివాజీకి, టీవీ9 లో ఉన్న షేర్లు పై కూడా, అతని పై కూడా కేసులు పెట్టి, వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కేసుతో, రవి ప్రకాష్ ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారు.

ప్రతి సారి ఎదో ఒక వివాదంతో, లేకపోతే సెన్సేషన్ తో వార్తల్లోకి ఎక్కే సినీ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వైసీపీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన, పీవీపీ, బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేసారు. బండ్ల గణేష్ తో పాటుగా, అతని అనుచరుల పై కూడా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో, పీవీపీ కేసు నమోదు చేసారు. బండ్ల గణేష్ అనుచరులుగా చెప్పుకున్న కొంత మంది వ్యక్తులు, తన ఇంటికి వచ్చి, తన పై దౌర్జన్యం చేసారని పీవీపీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పీవీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, బండ్ల గణేష్ తో పాటుగా, అతని అనుచరుల పై 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తన పై కేసు నమోదు అయ్యింది అని తెలుసుకున్న బండ్ల గణేష్, తన నివాసం నుంచి వెళ్ళిపోయి, అండర్ గ్రౌండ్ కు వేల్లిపోయినట్టు సంమచారం. బండ్ల గణేష్ కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

bandla 05102019 2

అయితే ఈ వివాదానికి కారణం, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాకు సంబంధించి విషయంగా తెలుస్తుంది. ఆ సినిమాకు, సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్, బండ్ల గణేష్‌కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సినిమా విడుదల సమయంలో కొంత చెల్లించి, మిగిలిన మొత్తానికి బండ్ల గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ పీవీపీ, బండ్ల గణేష్ ను కోరారు. ఈ నేపధ్యంలోనే, నిన్న అర్ధరాత్రి కొంత మంది బండ్ల గణేష్ అనుచరులుగా చెప్పుకునే వ్యక్తులు, పీవీపీ నివాసానికి వెళ్లి ఆయన పై బెదిరింపులకు పాల్పడి, ఆయన పై దౌర్జన్యం చేసినట్టు చెప్తున్నారు. దీని పైనే, పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యటం, 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

bandla 05102019 3

ఇది ఇలా ఉంటే, పరారీలో ఉన్న బండ్ల గణేష్, ట్విట్టర్ ద్వారా జగన్ కు వేడుకులు చెప్తూ, ఒక లేఖ రాసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని, జగన్ ను కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి... సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి..అంటూ ట్వీట్ చేసారు. జగనన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుందని బండ్ల గణేష్ సూచించారు. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు.

పేదల కష్టానికి ఇవ్వాల్సిన డబ్బులు, ఇతర ఖర్చులకు దారి మళ్ళించారా ? కేంద్రం డబ్బులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అవి లబ్దిదారులకు ఇవ్వటం లేదా ? కష్టం చేసుకుని బ్రతికే పేదలకు, ప్రభుత్వమే ఇబ్బంది పెడుతుందా ? అవుననే సమాధానమే వస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పధకంలో భాగంగా, పేదల కష్టానికి ఇవ్వాల్సిన డబ్బులు, ఇప్పటికీ ఇవ్వలేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కౌన్సిల్, ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో, జరిగిన విషయం మొత్తాన్ని, కేంద్రం ద్రుష్టికి తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ. కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై, లేఖ రాశారు. ఉపాధి హామీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం వేరే వాటికి మళ్ళించిందని చెప్పారు.

tdp 04102019 2

పేదలకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ డబ్బులు, ఈ నాలుగు నెలల్లో ఇవ్వలేదని, ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు, కేంద్రం చొరవ తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు లో 2019 మొదటి వరకూ ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో ఉండేదని, నేడు అథమస్థానానికి పడిపోయిందని చంద్రబాబు అన్నారు. మొన్నటికి దాకా చేసిన పనులకు గాను, కేంద్రం పెండింగ్ బిల్లులు రూ.1845 కోట్లు విడుదల చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి, అవి పేదలకు ఇవ్వకుండా, ఆ డబ్బులు విడుదల చేయలేదని చంద్రబాబు పెర్కున్నారు. ఉపాధి హామీ నిధులు వేరే వాటికి ఉపయోగించకూడదు అనే నిబంధనలు ఉన్నా,ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వాటికి వేరే వాటికి దారి మళ్లించడం సరికాదని చంద్రబాబు అన్నారు.

tdp 04102019 3

కేంద్రం నిర్దేశించిన కార్యక్రమానికి నిధులు విడుదల చేసినప్పుడు...ఆ నిధుల స్వీకరణ తేదీ నుంచి మూడు రోజుల్లోగా రాష్ట్ర వాటాని ఉపాధి హామీ నిధికి జమ చేయాలి, అలా చేయని పక్షంలో తదుపరి నిధుల విడుదలను కేంద్రం నిలిపేస్తుందని స్పష్టమైన నిబంధనలున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడంలేదని తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర వాటా చెల్లింపు ఆలస్య కాలానికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది అదనపు భారం అవుతుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉపాధి హామీ పథకం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని చంద్రబాబు లేఖలో పెర్కున్నారు. వీటి పై అనేక కుటుంబాలు ఆధారపడినందున తక్షణమే బిల్లుల విడుదలకు చొరవ చూపాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరాచకాలు, రోజురోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికే జర్నలిస్ట్ లను కొట్టటం, జామీన్ రైతు పత్రికా అధినేత ఇంటికి వెళ్లి వీరంగం చెయ్యటం చూసాం. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే, జగన్ కూడా నన్ను ఏమి పీకలేడు అనే సమాధానం ఆయన వద్ద నుంచి వస్తుందని వాపోయారు. ఈయన చేసిన పనులు, చేస్తున్న అరాచకాలు చూస్తుంటే, నిజంగానే జగన్ కూడా ఏమి చెయ్యాలేడా అనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక రాద్ధాంతం చెయ్యకుండా మాత్రం, కోటంరెడ్డి ఉండటం లేదు. తాజాగా మహిళా ఎంపీడీవో ఇంటికి వెళ్లి వీరంగం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 11 గంటలకు జరిగిన ఘటన పై, ఎంపీడీవో సరళ మీడియాకు చెప్పిన వివరాలు ప్రకారం, కోటంరెడ్డి మద్యం తాగి వచ్చి, శుక్రవారం రాత్రి కల్లూరిపల్లి ఎంఐజీ కాలనీలోని తన ఇంటిపై దాడికి దిగారని చెప్పారు.

kotamreddy 05102019 2

ఆమె చెప్పిన వివరాలు ప్రకారం, తాను ఎంపీడీవోగా పని చేస్తున్న వెంకటాచలం మండలంలో వైసీపీ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి బంధువు అయిన కృష్ణారెడ్డికి సంబంధించిన భూమిలో లేఅవుట్‌ వేశారని, దానికి వివిధ అనుమతులు ఇవ్వాలని శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 1వ తేదీన తన ఫోన్లో నుంచి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డితో తనతో మాట్లాడించారని తెలిపారు. 2వ తేదీ సాయంత్రానికి అనుమతులు పని పూర్తి కావాలని కోటంరెడ్డి తనకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అయితే అక్టోబర్ 2న సెలవు కావటం, అందులోనూ, ఆ రోజు సచివాలయాల ప్రారంభాలు ఉన్నందున అనుమతులు ఇవ్వటంలో జాప్యం అయ్యింది. అయితే అక్టోబర్ 2న కోటంరెడ్డి ఫోన్ చేసి, తాను చెప్పినా పని ఎందుకు లేట్ అయ్యింది అని, బూతులతో ఆ మహిళా ఎంపీడీవో పై బూతులతో విరుచుకు పడ్డారు. అక్టోబర్ 2న వివధ పనుల వల్ల కుదరలేదు అని ఆమె ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

kotamreddy 05102019 3

దీంతో ఆయన సాయంత్రం కల్లూరిపల్లిలోని తన నివాసానికి ఆయన వచ్చారని, ఆ సమయంలో నేను ఇంట్లో లేనని, తన తల్లి ఉంటే ఆమెను దూషించి, నానా భీబత్సం చేసి, ఇంట్లోకి వచ్చే విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి, తాగునీటి పైపులైను ధ్వంసం చేసి, కేబుల్ వైర్లను కట్ చేసి, వెళ్ళారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే తన ఇంటి పై చేసిన దౌర్జన్యం విషయం పై, పోలీస్ స్టేషన్ కు అర్ధరాత్రి స్వయంగా వెళ్లానని, కంప్లైంట్ తీసుకోవటానికి, ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారని, అధికారులు లేకపోవటంతో, అక్కడే చెట్టు కింద కూర్చున్నాని చెప్పారు. అయితే అధికారులు ఏదో ఆక్సిడెంట్ కేసులో ఉన్నారని, కానిస్టేబుల్ చెప్పగా, వారు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పిన ఆమెకు, చివరకు నిరాశే ఎదురైంది. అర్దరాత్రి ఒక మహిళా అధికారి, గంట సేపు ఎదురు చూసినా, ఒక్క అధికారి కూడా రాలేదు. విషయం తెలుసుకున్న, మండలంలోని గ్రామ కార్యదర్శులంతా ఆమెకు సంఘీభావంగా అక్కడికి చేరుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read