తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన జనప్రభంజనంతో నిన్న అర్ధరరాత్రి వరకు సాగింది. చంద్రబాబు సభ పెట్టి వెళ్ళిపోతే ఇంత ఇంపాక్ట్ కూడా ఉండేది కాదు. జగన్ మోహన్ రెడ్డి కెలికి పెద్దది చేసి, రెచ్చగొట్టి, మీటింగ్ లేదని చెప్పటంతో, చంద్రబాబు పాదయాత్ర చేసారు. ప్రతి పల్లె తిరిగారు, ప్రతి ఒక్కరినీ కలిసారు. మీటింగ్ అయితే ప్రసంగం చెప్పి వెళ్ళిపోయే వారు. ఇప్పుడు అందరినీ కలుస్తూ ఉండటం, గ్రామాలకు గ్రామాలు రోడ్డు మీద ఉండటంతో, మీటింగ్ కంటే, ఎక్కువ ఇంపాక్ట్ నిన్న చంద్రబాబుకు వచ్చింది. దీంతో జగన్ తీచ్చిన జీవో, నిజంగా లోకేష్ అన్నట్టు నాలిక గీసుకోవటానికే ఉపయోగ పడింది. నిన్న చంద్రబాబు పెద్దూరు, బెండన కుప్పం, చెంగుబల్లలో పాదయాత్ర చేసారు. ఇంటింటికీ తిరిగారు. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచార రధం ఇవ్వమని పోలీసులని అడిగినా, ఇవ్వక పోవటంతో, చంద్రబాబు నడుచుకుంటూ వెళ్ళారు.నిన్న అర్ధరాత్రి వరకు చంద్రబాబు పర్యటన సాగింది. నేడు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం, కుప్పం మండలాల క్లస్టర్ ఇన్‍ఛార్జ్ లతో చంద్రబాబు సమావేశం ఉంటుంది. నిన్న జరిగిన ఘటన పై, పోలీసులు ఎలాంటి కేసులు పెడతారో చూడాలి మరి.

కుప్పం నియోజకవర్గం, పెద్దూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. తన పర్యటన ను అడ్డుకోవడం పై ప్రభుత్వం, పోలీసులపై విరుచుకుపడిన టీడీపీ అధినేత "నేను ఏడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. కుప్పం వస్తానని పోలీసులకు ముందే చెప్పా. ఈనెల 2వ తేదీన ఈ ప్రభుత్వం జీవో - 1 తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా రోడ్ షో లు పెట్టకూడదని నిబంధనలు పెట్టారు. పోలీసులు, సీఎం దయాదాక్ష్యన్యాలతో మీటింగ్ పెట్టుకోవాలని నిబంధనలు తెచ్చారు. మంగళవారం సీఎం జగన్ రాజమండ్రిలో సభ పెట్టి కాలేజీ, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్, స్కూలు బస్సులన్నీ తీసుకుని బలవంతంగా జనాన్ని తరలించారు. సీఎం సభకు రాకుంటే పింఛన్ కట్ చేస్తామని డ్వాక్రా వాళ్లను బెదిరించి సభకు తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల సభకు రాకుంటే ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆరోగ్యం బాగోలేదన్నా వదిలిపెట్టడం లేదు. అనారోగ్యంతో ఉన్నామంటే డైపర్ పెట్టుకుని రావాలని హెచ్చరిస్తున్నారు. జీవో-1 తెచ్చాక విజయనగరంలో వైసీపీ నేతలు ర్యాలీలు చేసి మీటింగ్ పెట్టారు. టీడీపీ సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారు...దీనికి కారణం ప్రజల్లో వచ్చిన చైతన్యం. జగన్ పని అయిపోయింది. ఇక గెలవడు..ఇంటికిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ప్రజలు గట్టిగా భావిస్తున్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే జగన్ కాలు బయటపెట్టేవాడా.? నా సొంత నియోజకవర్గానికి నేను రాకుండా ఆంక్షలు పెడుతున్నారు. నా ప్రజల్ని నేను కలసి మాట్లాడకూడదా.? రోడ్లపై సభలు పెట్టి మాట్లాడకుండా ఆకాశంలో పెట్టుకోవాలా.? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో విధంగా నా మీటింగులు జరగకుండా చేయాలని చూస్తున్నారు. ఎందుకు తిరగనివ్వడంలేదో రాసివ్వాలని డీఎస్పీని అడిగా. 1861 పోలీసు చట్టానికి 1946లో చేసిన సవరణను ప్రస్తావించలేదు. అవసరమైతే ఎడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ చేసుకున్నాక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేసుకోవచ్చని స్పష్టంగా ఉంది.

ఏ చట్టం కింద నా రోడ్ షోను ఆపుతున్నారు? రోడ్ షో కాకుండా ఇంటింటికీ వెళ్లి మాట్లాడాలని డీఎస్పీ అన్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నా...మీరు తీసుకొచ్చిన జీవోకు చట్ట బద్దత ఎక్కడుంది.? ఆ జీవోను ఏచట్ట ప్రకారం తీసుకొచ్చారు.? చట్టంలో ఉంటే కొత్తగా జీవో ఎందుకు తెచ్చారు..? చట్టం అమల్లో లేకపోతే జీవోను ఎలా తెచ్చారు.? ప్రజలంతా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల విసిగిపోయారు. ఎక్కడ సభలు పెట్టినా యువత, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా టీడీపీ సభలకు తరలివస్తున్నారు. ప్రజలు వాళ్ల సమస్యలు చెప్పుకుని, నాకు సంఘీభావం చెప్పడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటే ఒడిపోతామని అర్థం అయ్యి... చేతకాని పనుల చేస్తున్నాడు ఈ సైకో సీఎం. మీరు తెచ్చిన జీవో నెంబర్ - 1 ఏ చట్ట ప్రకారం తెచ్చారో సమాధానం చెప్పాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్షం గొంతునొక్కాలని చూస్తున్నారు. మీరు నొక్కేది ప్రతిపక్షాల గొంతుకాదు.. ప్రజల గొంతు. ఇప్పటికే ప్రశ్నిస్తున్న మీడియా గొంతు నొక్కారు. ఏ చట్టం కింద నా నియోజకవర్గానికి డీఎస్పీ రానివ్వడం లేదు.? ఎందుకు రోడ్ షో నిర్వహించనీయడం లేదు.? ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించకూడదా.? డీఎస్పీ అంటున్నారు..ఇంటింటికీ వెళ్లి చెప్పండని..ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఇంటింటికీ వెళ్లి 5 కోట్ల మందికి చెప్పాలా? డీఎస్పీగా.. మీరూ ఇంటింటికీ వెళ్లి చెప్తారా.?

పద్ధతి ప్రకారం పనిచేయడం పోలీసులు నేర్చుకోవాలి. పద్ధతి ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు తిరిగితే ఈ జగన్ రెడ్డి పారిపోవడం ఖాయం. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలని చూస్తున్నారా.? నియంతగా మారాలని చూస్తున్నావా జగన్.? అందుకే నేను చెప్తున్నా.. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి. కుప్పంలో ఎవర్ని కదిలించినా వారి గుండెలల్లో ఉండేది టీడీపీనే. మీటింగులు పెట్టడానికి వీలులేదని రాత పూర్వకంగా ఇవ్వాలి. నేను హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు చేయను. ప్రజల కోసమే నేను రాజకీయాలు చేస్తా.. మీరు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తానంటే నా దగ్గర సాగవు. పనికి మాలిన దద్దమ్మ, సైకో సీఎంను మొదటిసారిగా చూస్తున్నా. నా నియోజకవర్గంలో నన్ను నడిరోడ్డపై నిలబెడతారా.? సైకో ఏదైనా చేయగలుగుతానన్న ధీమాతో ఉన్నాడు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నాకు నోటీసులు ఇచ్చి సంతకం చేయాలని అంటున్నారా.? జగన్ కంటే బ్రిటీష్ వాళ్లే చాలా నయం. బ్రిటీష్ వాళ్లు కూడా గాంధీజీని ఉద్యమాలు చేయనిచ్చారు. జగన్ రెడ్డీ.. రాజకీయాలంటే పిల్ల చేష్టలు కాదు. పోలీసులు అక్రమంగా నా ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. 45ఏళ్లుగా నా ప్రచార వాహనాన్ని ఎవరూ ఆపలేదు...కానీ జగన్ రెడ్డి ఆపారు. కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ ని ఖండిస్తున్నా.

చిత్తూరుజిల్లా కుప్పంలో ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో, పోలీసులు  అడుగడుగునా ఆంక్షలు విధించారు. చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు  పర్మిషన్  లేదంటూ పోలీసులు అడ్డు చెబుతున్నారు. ఈ రోజు శాంతిపురం వెళ్లాల్సిన తెలుగుదేశం ప్రచార రధాలను , సౌండ్ సిస్టం లవాహనాలను పోలీసులు నిలిపివేశారు. ప్రచార రధాలను నడిపే డ్రైవర్లను, సహాయక సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని గుడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు చంద్రబాబునాయుడు కుప్పంలోని శాంతిపురం మండలం పెద్దూరు రానుండటంతో, ఆ ఏరియా లో పోలీసులు భారీగా మోహరించడంతో, అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది.

కుప్పం నియోజకవర్గంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. భారీగా పోలీసుల మోహరింపుతో శాంతిపురం మండలం 121 పెద్దూరు వద్ద ఉద్రిక్తంగా మారింది.  రోడ్ షో, స‌భ‌, ప‌ర్య‌ట‌న‌కి అనుమ‌తి లేద‌ని డిఎస్పీ సుధాకర్ రెడ్డి చంద్ర‌బాబుకి నోటీసు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.  సభలు, సమావేశాలు, ర్యాలీలు ఎందుకు నిర్వహించకూడదని పోలీసులను చంద్రబాబు ఎదురు ప్ర‌శ్నించారు. పోలీసుల వైఖరిపై టిడిపి అధినేత మండిప‌డ్డారు. ఎట్టి ప‌రిస్థితుల్లో టూర్ కొన‌సాగుతుంద‌ని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. డిఎస్పీ ఇచ్చిన నోటీసు తీసుకునేందుకు చంద్రబాబు నిరాక‌రించారు. త‌న‌కు ఎందుకు నోటీస్ ఇస్తున్నారో వివరణతో రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. మ‌రోవైపు ప్ర‌తీ జంక్ష‌న్లోనూ చంద్ర‌బాబుకి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌పై పోలీసులు లాఠీచార్జి చేశారు.

Advertisements

Latest Articles

Most Read