అసెంబ్లీ వేదికగా అబద్ధాలు ఆడటానికి కుదరదు. బయట ఎన్ని అయినా చెప్పచ్చు కాని, సభలో మాత్రం , నీ శత్రువు మంచి చేసినా, నిజాలే చెప్పాలి. లేకపోతే అబద్ధాలు ఆడినందుకు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారు. అందుకే బుగ్గన గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ 3.7 లక్షల కోట్లు అప్పు అని చెప్పి, అసెంబ్లీలో ప్రశ్న అడిగితె మాత్రం, 2.61 కోట్లు అని వేరే ఫిగర్ చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా, మరో విషయం బయట పడింది. చంద్రబాబు వల్ల అసలు ఉద్యోగాలే రాలేదు, చంద్రబాబు మొఖం చూసి ఒక్క కంపెనీ కూడా రాలేదు, చంద్రబాబు విదేశీ పర్యటనలు ఎంజాయ్ చెయ్యటానికి వెళ్లారు అని ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు శాసనమండలి వేదికగా నిజాలు చెప్పాల్సి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు చేసిన కష్టం, ఎంత దాచాలి అన్నా, దాగని పరిస్థితి. వాళ్ళ నోటితో, వాళ్ళే నిజం ఒప్పుకున్నారు.
ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుగారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పారు. ఐటీలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఇవన్నీ సభ్యులు అడిగిన ప్రశ్నకు, జగన్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇదే విషయం పై ఎమ్మెల్సీ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా, ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం కాపీని పెట్టి, వివరాలు అన్నీ పెట్టారు. పాదయాత్రలో మీరు ఆడిన అబద్ధాలు, ఒక్కొక్కటీ అబద్ధం అని తేలుతున్నాయని, మరిన్ని వివరాలు బయట పెట్టి, మీ అవినీతి పత్రిక సాక్షి కధనాలు అన్నీ అబద్ధం అని తెలిసేలా చెయ్యాలని, జగన్ ను కోరుతున్నాని లోకేష్ అన్నారు.