నిన్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడా అంటూ సభ సాక్షిగా చేసిన వ్యాఖ్యల పై లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆ రోజు చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అడ్డుకోవటానికి ఎలాంటి పోరాటం చేసారు అని ప్రస్తావిస్తూ, ఆ రోజు ఏకంగా సాక్షి తెలంగాణ ఎడిషన్ లో, చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అడ్డు పడుతున్నారు అంటూ అక్కడ తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాసిన పేపర్ క్లిప్పింగ్ తో పాటు, ఇతర పేపర్ లో వచ్చిన వార్తలు కూడా జగన్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘‘కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ, జగన్‌ గారు సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. కాళేశ్వరం పై చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చింది."

"ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదు. ఎందు కంటే.. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో అని లోకేష్‌ అన్నారు. నిన్న కాళేశ్వరం పై చర్చలో జగన మాట్లాడుతూ, కేసీఆర్ ఎంతో దయా హృదయంతో, మనకు నీళ్ళు ఇస్తున్నారని, అందుకే ఆ ప్రాజెక్ట్ తెలంగాణా భూభాగంలో కట్టటానికి ఒప్పుకున్నామని జగన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నేను వెళ్ళినా, వెళ్ళకపోయినా అక్కడ ఓపెనింగ్ ఏమి ఆగేది కాదని, అందుకే వెళ్లానని జగన్ అన్నారు. ఇదే సందర్భంలో జగన మాట్లాడుతూ, కాళేశ్వరం కడుతుంటే, అప్పుడు చంద్రబాబు సియంగా ఉన్నారని, అప్పుడు ఆపకుండా, గాడిదలు కాసరా అని జగన్ అన్నారు. దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, జగన్ లాంటి వ్యక్తి, గాడిదలు కాస్తున్నాడా అని అంటారా అని, తీవ్ర అభ్యంతరం చెప్పారు.

జగన్ మోహన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. నిన్న పట్టిసీమ నీటిని వాడుకునే మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతూ జగన్ కు లేఖ రాసిన వంశీ, ఈ రోజు జగన్ ను వచ్చి మరీ పర్సనల్ గా కలిసారు. పట్టిసీమ నుంచి నీరు వదలటంతో, పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు 500 మోటార్లు పెట్టుకున్నామని, వాటికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని జగన్ ను వంశీ కోరారు. ఇప్పటికే ఈ విష్యం పై జగన్ కు లేఖ రాసిన వంశీ, తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా తన సొంత ఖర్చుతో, రైతుల కోసం 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకున్నామని, అప్పట్లో చంద్రబాబు గారు, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం తరుపున ఉచితంగా ఇచ్చారని చెప్పారు.

గతంలో ఇచ్చినట్టే, ఈ సంవత్సరం కూడా ఉచిత విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు. మరి వంశీ విజ్ఞప్తికి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయం పై, విద్యుత్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన మంత్రులకు కూడా లేఖల్ని పంపానని వంశీ చెప్పారు. పోలవరం కుడి కాల్వ కోసం, అక్కడి రైతులు తమ భూమిని త్యాగం చేసారని, పట్టిసీమ కోసం ఆ భూములు తామే తీసుకుని, పోలవరం కుడి కాలువ పూర్తి చేసామని, ఈ రోజు కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది అంటే, ఆ రైతుల త్యాగమే అని, అందుకే వారిని ఆదుకోవాలని వంశీ కోరారు. అయితే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఇలా జగన్ ను కలవటం పై రకరకాల వార్తలు వస్తున్నా, వంశీ మాత్రం, తన నియోజకవర్గ రైతుల కోసమే కలిసానని, ఎవరు ఏమి ప్రచారం చేసినా నష్టం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే హాట్ హాట్ గా సాగాయి. ముఖ్యంగా కాళేశ్వరం పై చర్చ సందర్భంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు మాటల యుద్ధం జరిగింది. అలాగే ఈ రోజు కరువు పై చర్చ జరిగింది. కరవు పై చర్చ జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కరువ్టు పై జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేస్తూ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో కరువు బాగా ఉందని, అందుకే నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఒక కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నా అని చెప్పారు. ఆ నిధులతో ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న కరువు పై వారికి ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పారు. సహజంగా ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేస్తే, అది అందరి ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది. కాని జగన్ మాత్రం, తాను ఎదో త్యాగం చేసినట్టు, ఇది అధికార పక్ష ఎమ్మెల్యేలకే కాదు, ప్రతిపక్షానికి కూడా ఇస్తున్నాం, చంద్రబాబుకు కూడా ఒక కోటి ఇస్తాను, ఆయన కూడా ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

ఈ సమయంలో, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ఎంతో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మికమైన నిర్ణయం అని, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు అభినందనలు తెలపాలని అన్నారు. గతంలో చంద్రబాబు వద్దకు వెళ్లి అడిగితే, ఆర్ధిక పరిస్థితి బాగోలేదు, ఇవ్వలేం అన్నారని, ఇప్పుడు జగన్ మాత్రం ఉదారంగా ఇచ్చారని అన్నారు. పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. జగన్‌ చెప్పేది ఒకటి, చేసేది మరొకటంటూ చంద్రబాబు విమర్శించారు. ఎస్సీ ఎమ్మెల్యే అయిన బాలవీరాంజనేయ స్వామిను వైసీపీ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే స్వామికి మీ జగన్ క్షమాపణ చెబితే, అప్పుడు ఎమ్మెల్యేలకు నిధుల నిర్ణయాన్ని అభినందిస్తూ నేను కూడా ధన్యవాదాలు చెప్తానని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేను కూడా దబాయించే పరిస్థితికి వచ్చారని, ఒక పక్క ఎమ్మెల్యేలను ఇలా అవమానిస్తూ, ఇక్కడ నీతులు చెప్తున్నారని చంద్రబాబు అన్నారు.

సున్నా వడ్డీల రుణాల పై ఈ రోజు అసెంబ్లీలో ఛాలెంజ్ లు జరిగాయి. అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే, చంద్రబాబు నీకు ఛాలెంజ్ , నువ్వు ఒప్పుకోక పొతే రాజీనామా చెయ్య అని, జగన్ అనేదాకా వెళ్ళాయి. కరువు పై చర్చ సందర్భంలో, జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు సున్నా వడ్డీకి, రైతులకు ఒక్క రూపాయి కూడా రుణాలు ఇవ్వలేదని, ఇది నా ఛాలెంజ్ అని, నేను ఇది నిరూపిస్తే, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో అనేదాకా వెళ్ళింది. దీని పై చంద్రబాబు మాట్లాడుతూ, రికార్డులు మీ దగ్గరే ఉంటాయని, ప్రభుత్వం మీదని, మేము ఎంత ఇచ్చేమో, అసలు ఇచ్చామో, లేదో సభ ముందు పెట్టండి అని అన్నారు. అయినా జగన్ పదే పదే, మీరు చెప్పండి, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ అనటం, వెనుక నుంచి వైసీపీ సభ్యులు ఒప్పుకో , ఒప్పుకో అంటూ చెప్పటం జరిగాయి. అయితే చంద్రబాబు విసుగు చెంది, తన కార్యాలయం నుంచి అన్ని ఆధారాలు తెప్పించారు. ఇదే విషయం స్పీకర్ కు సమాచారం పంపించారు. జగన్ విసిరిన ఛాలెంజ్ కు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని, మేము సమాధానం చెప్తామని అన్నారు.

అప్పటికి ఇంకా కరువు పై చర్చ నడుస్తూనే ఉంది. అయితే, ఉన్నట్టు ఉండి సభను వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. వాయిదా పడుతున్న సందర్భంలో, ఆధారాలు తీసుకుని, సార్ ఒక్క నిమిషం, మేము మాట్లాడతాం అంటూ టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు స్పీకర్ దగ్గరకు వెళ్ళినా, ఉపయోగం లేకుండా పోయింది. 151 మంది సభ్యులు ఉంచుకుని, ఛాలెంజ్ చేసి, 23 మంది సభ్యులు ఉన్న చంద్రబాబు సై అనగానే, సభ వాయిదా వేసుకుని పారిపోయారు. దీంతో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ, అన్ని డాక్యుమెంట్లు మీడియాకు వదిలి, వాస్తవాలు చెప్పారు. "రికార్డులు తెప్పిస్తా, మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేస్తారు. రికార్డులతో నేను సభలోకి వస్తే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకుని పరారు కావడం చూశాం. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వ్యక్తికి సున్నా వడ్డీ రుణాలు, లక్ష నుంచి 3లక్షల లోపు తీసుకున్నవారికి పావలా వడ్డీ వర్తిస్తుంది. అసలు ఎవరికి సున్నా వడ్డీ వర్తిస్తుందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడాలి..? "

"మార్చి 2016లో జరిగిన ఎస్ ఎల్ బిసి మీటింగ్ లో 2013-14నుంచి 2015-16 వరకు వడ్డీలేని రుణాల బకాయిలు ఎంత ఉన్నాయో లెక్క చూడటం, ప్రభుత్వం వాటిని క్లియర్ చేయడం జరిగింది. మొత్తం రూ.415కోట్లు 2016లోనే విడుదల చేశాం. ఆ చెల్లింపుల్లో రబీ 2011నుంచి బకాయిలను కూడా క్లియర్ చేశాం. 2013-14 నుంచి 2018-19 వరకు పావలా వడ్డీ కింద రూ.25.14 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ కింద రూ.979. 45కోట్లు చెల్లించాం. 2017-18కు సంబంధించి రూ.507కోట్లు పెండింగ్ ఉంది. 2018-19 కు సంబంధించి ఇంకా క్లెయిమ్స్ రాలేదు. వాస్తవాలు ఇలావుంటే, అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం ఇదే తొలిసారి చూస్తున్నాం. ఇప్పుడు ఈ రికార్డులు మీడియా ద్వారా విడుదల చేస్తున్నాం. మరి మీరు రాజీనామా చేస్తారా..? రాజీనామా చేయకపోతే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పండి.. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి పారిపోవడం ఎప్పుడన్నా చూశామా..? అడ్డంగా దొరికారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిపోయారు. దొంగ ఛాలెంజ్ లు చేసి ఆఘమేఘాల మీద అర్ధంతరంగా అడ్జర్న్ చేసుకుని పోయారు. అబద్దాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది. రేపే శాసన సభలో దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read