సున్నా వడ్డీల రుణాల పై ఈ రోజు అసెంబ్లీలో ఛాలెంజ్ లు జరిగాయి. అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే, చంద్రబాబు నీకు ఛాలెంజ్ , నువ్వు ఒప్పుకోక పొతే రాజీనామా చెయ్య అని, జగన్ అనేదాకా వెళ్ళాయి. కరువు పై చర్చ సందర్భంలో, జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు సున్నా వడ్డీకి, రైతులకు ఒక్క రూపాయి కూడా రుణాలు ఇవ్వలేదని, ఇది నా ఛాలెంజ్ అని, నేను ఇది నిరూపిస్తే, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో అనేదాకా వెళ్ళింది. దీని పై చంద్రబాబు మాట్లాడుతూ, రికార్డులు మీ దగ్గరే ఉంటాయని, ప్రభుత్వం మీదని, మేము ఎంత ఇచ్చేమో, అసలు ఇచ్చామో, లేదో సభ ముందు పెట్టండి అని అన్నారు. అయినా జగన్ పదే పదే, మీరు చెప్పండి, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ అనటం, వెనుక నుంచి వైసీపీ సభ్యులు ఒప్పుకో , ఒప్పుకో అంటూ చెప్పటం జరిగాయి. అయితే చంద్రబాబు విసుగు చెంది, తన కార్యాలయం నుంచి అన్ని ఆధారాలు తెప్పించారు. ఇదే విషయం స్పీకర్ కు సమాచారం పంపించారు. జగన్ విసిరిన ఛాలెంజ్ కు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని, మేము సమాధానం చెప్తామని అన్నారు.

అప్పటికి ఇంకా కరువు పై చర్చ నడుస్తూనే ఉంది. అయితే, ఉన్నట్టు ఉండి సభను వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. వాయిదా పడుతున్న సందర్భంలో, ఆధారాలు తీసుకుని, సార్ ఒక్క నిమిషం, మేము మాట్లాడతాం అంటూ టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు స్పీకర్ దగ్గరకు వెళ్ళినా, ఉపయోగం లేకుండా పోయింది. 151 మంది సభ్యులు ఉంచుకుని, ఛాలెంజ్ చేసి, 23 మంది సభ్యులు ఉన్న చంద్రబాబు సై అనగానే, సభ వాయిదా వేసుకుని పారిపోయారు. దీంతో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ, అన్ని డాక్యుమెంట్లు మీడియాకు వదిలి, వాస్తవాలు చెప్పారు. "రికార్డులు తెప్పిస్తా, మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేస్తారు. రికార్డులతో నేను సభలోకి వస్తే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకుని పరారు కావడం చూశాం. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వ్యక్తికి సున్నా వడ్డీ రుణాలు, లక్ష నుంచి 3లక్షల లోపు తీసుకున్నవారికి పావలా వడ్డీ వర్తిస్తుంది. అసలు ఎవరికి సున్నా వడ్డీ వర్తిస్తుందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడాలి..? "

"మార్చి 2016లో జరిగిన ఎస్ ఎల్ బిసి మీటింగ్ లో 2013-14నుంచి 2015-16 వరకు వడ్డీలేని రుణాల బకాయిలు ఎంత ఉన్నాయో లెక్క చూడటం, ప్రభుత్వం వాటిని క్లియర్ చేయడం జరిగింది. మొత్తం రూ.415కోట్లు 2016లోనే విడుదల చేశాం. ఆ చెల్లింపుల్లో రబీ 2011నుంచి బకాయిలను కూడా క్లియర్ చేశాం. 2013-14 నుంచి 2018-19 వరకు పావలా వడ్డీ కింద రూ.25.14 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ కింద రూ.979. 45కోట్లు చెల్లించాం. 2017-18కు సంబంధించి రూ.507కోట్లు పెండింగ్ ఉంది. 2018-19 కు సంబంధించి ఇంకా క్లెయిమ్స్ రాలేదు. వాస్తవాలు ఇలావుంటే, అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం ఇదే తొలిసారి చూస్తున్నాం. ఇప్పుడు ఈ రికార్డులు మీడియా ద్వారా విడుదల చేస్తున్నాం. మరి మీరు రాజీనామా చేస్తారా..? రాజీనామా చేయకపోతే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పండి.. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి పారిపోవడం ఎప్పుడన్నా చూశామా..? అడ్డంగా దొరికారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిపోయారు. దొంగ ఛాలెంజ్ లు చేసి ఆఘమేఘాల మీద అర్ధంతరంగా అడ్జర్న్ చేసుకుని పోయారు. అబద్దాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది. రేపే శాసన సభలో దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read