ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపునపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం.. నిన్న మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించింది. ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలోనే ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో 55 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో 25వేల మంది సిబ్బంది పోల్గొననున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సీఈవో ద్వివేది విజయవాడ క్యాంప్‌ కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లతో పాటు కమిషనర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీసి, ఓట్ల లెక్కింపునపై పలు సూచనలు చేశారాయన. ఫారం 17సి విషయంలో ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులు తప్పనిసరిగా అమలు చెయ్యాలన్నారు. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈవీఎంలకు మూడు సీల్స్‌ ఉంటాయని , చీటింగ్‌కు అవకాశమే లేదన్నారు ద్వివేది. ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదని, కరెక్ట్‌గా ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు. మధ్యాహ్నం 2 కల్లా ఈవీఎంల కౌటింగ్‌ పూర్తవుతుందని తెలిపారు. టేబుళ్లు, ఓట్లను బట్టి ఫలితం వెలువడతాయని అన్నారు ద్వివేది. మరోవైపు ఏపీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వినోద్ జుటీషి. ఓట్ల లెక్కింపులో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరిణితి తో వ్యహరించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు తో బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు ఒక సమావేశం నిర్వహించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా అమలు చేయాలని జుటేషి స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాల్లో కి సరిఅయిన గుర్తింపు కలిగి ఉన్నవారిని అనుమతించాలన్నారు. మరో వైపు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌. ప్రతి కౌటింగ్‌ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని చెప్పారాయన. మెుదటి దశలో సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, రెండోదశలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో దశలో జిల్లా పోలీసులు, నాలుగో దశలో పెట్రోలింగ్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

ఇక జిల్లాల విషయానికి వస్తే, ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఒంగోలులోని రైస్‌, పేస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజవకవర్గ పరిధిలోని ఒంగోలు, కొండపి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని కందుకూరు నియోజకవర్గం మొత్తం 8 స్థానాల లెక్కింపు రైస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో, బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పేస్ ఇంజనీరింగ్‌ కాలేజీలో నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీలో 2, లయోలా పబ్లిక్ స్కూల్‌ లో ఒక కేంద్రంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. అనంతపురం లోక్‌సభస్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌటింగ్‌ JNTU లో, హిందూపురం పార్లమెంట్‌ నియోజక వర్గ పధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్కే యూనివర్సిటీలో జరగనుంది.

కడప శివారులో కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని రెండు బ్లాక్ ల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 26 గదుల్లో 314 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కడప పార్లమెంట్‌కు సంబంధించి కమలాపురం, ప్రొద్దుటూరు మినహా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్ జరగనుంది. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మాత్రం కడపలో జరగనుంది. రాజంపేట ఎంపీ సీటు ఫలితాన్ని చిత్తూరులోనే ప్రకటిస్తారని చెప్పారు కలెక్టర్ హరికిరణ్. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్ల ఓట్ల లెక్కింపు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోనే నిర్వహిస్తున్నారు. మొత్తం 33 గదుల్లో 14 టేబుల్ల పైనా కౌంటింగ్‌ చేస్తారు. అరకు ఎంపీ ఫలితం ఎక్కువ సమయం తీసుకునే అవకాశముందని చెప్పారు కలెక్టర్ భాస్కర్. : కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సర ర్యాలీపై నిషేధం విధించారు.

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు’ ఇది ఓ సినిమాలోని పాట అయినప్పటికీ ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పార్టీల పరిస్థితికి, ఆ పార్టీలను అభిమానించే శ్రేణుల పరిస్థితికి అద్దం పడుతోంది. దాదాపు 43 రోజుల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. దీంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బెట్టింగ్‌ రాయుళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ మిశ్రమ అంచనాలు వ్యక్తం చేయడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. కొన్ని సర్వేలు టీడీపీదే అధికారమని, మరికొన్ని సర్వేలు వైసీపీదే అధికారమని అంచనా వేశాయి. దీంతో ఏది నిజమో, ఏది అబద్ధమో ఒక అంచనాకు రాలేక బెట్టింగ్ రాయుళ్లు బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.

counting 2302019

జనసేన తక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసిన సర్వే సంస్థలు ఆ పార్టీ పోటీ వల్ల జరిగే ఓట్ల చీలిక ఎక్కువగా నష్టపోయే పార్టీ ఏదనే ప్రశ్నకు సమాధానమివ్వలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్‌కు తోడు ఛానల్స్‌లో రాజకీయ విశ్లేషకులు ఆ ఎగ్జిట్ పోల్స్‌పై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఏపీ ఫలితాలపై ఆసక్తి ఉన్న ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ రాజకీయ విశ్లేషకుడు చేసిన విశ్లేషణ సరైందని కొందరు.. లేదు.. లేదు.. ఈ రాజకీయ విశ్లేషకుడు ఏం అంచనా వేస్తే అదే గతంలో జరిగిందని మరికొందరు ఇలా విశ్లేషణలపై విశ్లేషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రచ్చబండ మనుషుల పిచ్చాపాటి చర్చల నుంచి రాజకీయ పార్టీ నేతల చర్చల దాకా.. అందరూ చర్చించుకుంటున్న అంశం ఏపీ ఫలితంపైనే కావడం గమనార్హం.

counting 2302019

ఏ టీ కొట్టు దగ్గర నిల్చున్నా, ఏ రెస్టారెంట్‌లో తింటున్నా అంతా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చలే తప్ప మరొక్కటి కనిపించని పరిస్థితి. ఏపీ అసెంబ్లీ ఫలితం.. అందుకే సీఎం ఎవరనే చర్చ ఆ రాష్ట్రంలో జరుగుతుందని భావిస్తే పొరపాటే. కేవలం ఏపీలో మాత్రమే కాదు.. తెలంగాణ పల్లెల్లో.. హైదరాబాద్ గల్లీల్లో.. ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం కోసం పార్టీల నేతలు, ఆ పార్టీల శ్రేణులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కష్టం చేసుకునే కామన్ మ్యాన్ మాత్రం ఎవరొచ్చినా తమ కష్టం తప్పదంటూ నిట్టూరుస్తున్నారు.

ఎన్నికల రిగ్గింగ్‌లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో అంటూ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ సంచలన ఆరోపణ చేశారు. మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చడంపై ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ‘‘మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే ఎన్నికల రిగ్గింగులో సుప్రీం ప్రమేయం ఏమైనా ఉందా? ఎన్నికల కోసం ప్రభుత్వ పనులు మూడు నెలలు పూర్తిగా స్థంభించిపోయాయి. వీవీప్యాట్లను లెక్కించడానికి రెండు-మూడు రోజులు సమయం తీసుకోవడంలో అభ్యంతరమేంటి?’’ అనే అర్థంలో ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

vvpat 22052019

ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంపై ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిననాటి నుంచే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ అనేక విమర్శల్ని ఈసీ ఎదుర్కుంటోంది. ఇక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ముగింపు వచ్చేసరికి వీవీప్యాట్ల లెక్కింపు అంశాన్ని విపక్షాలు ప్రధానంగా తెరపైకి తెచ్చాయి. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 22 పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా వీవీపీ ప్యాట్ల లెక్కింపు అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకువచ్చారు. సమావేశానంతరం ఇదే విషయాన్ని ఈసీ ముందుకు విపక్ష నేతల బృందం తీసుకెళ్లింది. దీనిపై ఈరోజు (బుధవారం) ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఈసీ ప్రకటించింది.

వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించి వాటిని ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలంటూ తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త పోరాటం చేస్తోంది. ఇప్పటికే 21 విపక్ష పార్టీలతో కలిసి పలు దఫాలు ఎన్నికల సంఘాన్ని కలిసింది. తమ డిమాండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇక్కడ మరో కొత్త సమస్యను తెదేపా వెలుగులోకి తెచ్చింది. ఒక వీవీప్యాట్‌లో ముద్రితమయ్యే స్లిప్‌ల సంఖ్య 1500 మాత్రమేనని ఎన్నికల సంఘమే స్పష్టంచేస్తోంది. 1500కు మించి ఓటర్లు ఉన్న బూత్‌లలో అంతకుమించి ఓట్లు పోలైతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తెరపైకి తెచ్చింది. అవన్నీ వీవీప్యాట్లలో స్లిప్‌ల రూపంలో నిక్షిప్తమవుతాయా లేదా అన్న అనుమానాన్ని ఎన్నికల సంఘం ముందు లేవనెత్తింది.

ec 22052019 1

అయితే ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించిన ‘హ్యాండ్‌ బుక్‌ ఫర్‌ ఏజెంట్‌’ అనే పుస్తకంలోనూ 1500 స్లిప్‌లే ముద్రితమవుతాయని స్పష్టంచేసింది. అందులోనూ 100 స్లిప్‌లు మాక్‌ పోలింగ్‌ కింద పోతాయని వెల్లడించింది. మిగిలిన పేపర్‌ ద్వారా పోలైన ఓట్లలో 1400 ఓట్లు మాత్రమే ముద్రించడం వీవీప్యాట్లకు సాధ్యమని ఎన్నికల సంఘమే వివరించింది. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో సగటున 2వేలకు పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఓట్ల లెక్కింపు రోజున వీవీప్యాట్లు ర్యాండమ్‌ పద్ధతిలో లెక్కించడానికి తీసుకున్నప్పుడు.. ఈవీఎంలలో 1500 మించి ఓట్లు కన్పించి.. వీవీప్యాట్లలో 1400 మించి కన్పించకపోతే ఎలా సరిపోల్చుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ec 22052019 1

తేడా ఆధారంగా నియోజకవర్గం మొత్తం రీకౌంటింగ్‌ చేసినా అక్కడ 1500కు మించి పోలైన అన్ని యంత్రాల్లోనూ ఈ లోటు కన్పిస్తుంది. కాబట్టి కచ్చితత్వం అనేదే రాదని తెదేపా బలంగా వాదిస్తోంది. 2వేల ఓటర్లు ఉన్న ప్రతి బూత్‌లోనూ ఇదో పెద్ద సమస్యగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 300 పోలింగ్‌ బూత్‌లలో 1400 కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెదేపా అంచనా వేస్తోంది. ఈవీఎం, వీవీప్యాట్‌ స్లిప్‌లలో తేడాలు వస్తే వీవీప్యాట్ల ఆధారంగానే గెలుపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈసీ నిబంధనలు చెబుతున్నాయి. మరి ఈవీఎం, వీవీప్యాట్లలో పోలైన ఓట్లకు వ్యత్యాసం వస్తే ఏం చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని తెదేపా డిమాండ్‌ చేస్తోంది.

Advertisements

Latest Articles

Most Read