ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంటోంది. నెల రోజుల క్రితం జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఈనెల 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనుండడంతో ఒక్కసారిగా బెట్టింగ్‌రాయుళ్లలో హుషారు కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం వైపు నుంచి బెట్టింగ్‌ వేసేందుకు పలువురు ముందుకు వస్తుండగా.. వైసీపీ శ్రేణుల్లో మాత్రం దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగి బెట్టింగ్‌కు పలువురు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వైసీపీ గెలుపుపై బెట్టింగ్‌ కట్టేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలియవచ్చింది. ఆ పార్టీ తరపున ఇప్పటికే బెట్టింగ్‌ కట్టిన వారు తమ సొమ్ము వెనక్కు ఇవ్వాలని కొందరి వెంట పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా పూర్తిస్థాయి సమాచారం తమవద్ద ఉన్నప్పుడే బెట్టింగ్‌ రూపంలో డబ్బు కట్టేందుకు ఎవరైనా సిద్ధపడతారు.

game 27032019

అయితే ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌ అనంతరం వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేసుకోవడంలో ఆ పార్టీ శ్రేణులు సక్సెస్‌ అయ్యాయి. దీంతో ఆ ప్రచారం ఉచ్చులో పడి పలువురు ఆ పార్టీ తరపున బెట్టింగ్‌కు సిద్ధపడ్డారు. అయితే వేడి తగ్గేకొద్దీ వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూండడంతో పందెంరాయుళ్లలో దడ పట్టుకుంది. దీంతో ఇప్పటికే పందెం కట్టిన వారు తమ సొమ్ము వెనక్కుఇవ్వాలని బేరసారాలు మొదలు పెట్టినట్లు సమాచారం, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయనే సంకేతాలు అందుతున్నాయని భావించి సొమ్ము వెనక్కు అడుగుతున్నట్లు తెలిసింది. 20 రోజుల క్రితం వైసీపీ గెలుస్తుందని రూ. 5 లక్షలు బెట్టింగ్‌ కట్టిన ఓ వైసీపీ నాయకుడు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుని బెట్టింగ్‌ సొమ్ము వెనక్కు ఇవ్వాలని మధ్యవర్తి వెంటపడినట్లు తెలిసింది.

game 27032019

అలాగే మరికొందరు మొన్నటి వరకు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్‌ కట్టేందుకు ముందుకొచ్చి చేతిలో రూ. పది లక్షల వరకు పెట్టుకుని టీడీపీ వైపు నుంచి బెట్టింగ్‌ కట్టే వారి కోసం నిరీక్షించారు. క్రమేపీ వాతావరణంలో మార్పు కనిపించడంతో ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుని వారు కూడా టీడీపీ గెలుస్తుందనే అంచనాకు వచ్చి ఆ పార్టీ వైపు నుంచి రూ. పది లక్షలు బెట్టింగ్‌ కట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే వైసీపీ నుంచి బెట్టింగ్‌ కట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ముందుగా కట్టిన సొమ్మే వెనక్కు అడుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా బెట్టింగ్‌ రాయుళ్లలో ముందు కనిపించిన వేడి ఇప్పుడు కనిపించడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బెట్టింగ్‌ కట్టేందుకు మాత్రం ఆ పార్టీలోని కొందరు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తటస్థులు సైతం టీడీపీ వైపే బెట్టింగ్‌కు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ వైపు ఉన్న పందెంరాయుళ్లు యూటర్న్‌ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. వైసీపీ గెలుస్తుందనే ధీమాతో ఉన్న వారు సైతం డీలాపడడం వెనుక ఒక్కొక్కటిగా వస్తున్న సర్వేలే కారణమని తెలుస్తోంది.

రాహుల్ గాంధీ పొరపాటున నోరు జారినా, తాను చెప్పాలి అనుకున్నది సరిగ్గా చెప్పకపోయినా, అతన్ని బీజేపీ ఐటి సెల్ ఎలా టార్గెట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇలా పొరపాట్లు మాట్లడుకున్నందుకు, రాహుల్ గాంధీని పప్పు అంటూ హేళన చేసేవారు కూడా. అయితే అన్ని శాస్త్రాలు తెలిసిన బీజేపీ పార్టీకి, ఇప్పుడు కర్మ సిద్దాంతం అంటే ఎంతో తెలిసి వచ్చింది. రాహుల్ గాంధీలాగా పొరపాటు కాదు, తనకు ఏదీ రాదని తెలిసినా, అన్నీ వచ్చు అంటూ ఎదో బిల్డ్ అప్ ఇచ్చి, మోడీ దొరికిపోయారు. బాలాకోట్‌ దాడుల వ్యూహరచనలో తన పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఊహించని తిప్పలు తెచ్చిపెట్టాయి. మబ్బుల చాటున ప్రయాణించడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకోవచ్చని తాను వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్‌పై దాడి చేసిందని ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ప్రధాని చెప్పారు.

game 27032019

అయితే వాస్తవానికి రాడార్ల పనితీరును మేఘాలు ప్రభావితం చేయలేవు. మేఘావృత వాతావరణంలో కూడా రాడార్లు పనిచేస్తాయి. దీంతో ప్రధాని అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెటిజన్లయితే వ్యంగ్య వ్యాఖ్యానాలతో మోదీని ఓ ఆటాడుకున్నారు. టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘‘దాడి చేద్దామనుకున్న రోజు రాత్రి వాతావరణం ప్రతికూలంగా మారడంతో మరో రోజుకు వాయిదా వేద్దామని నిపుణులు సూచించారు. కానీ, దట్టమైన మబ్బులు, వర్షాలు వారి (పాక్‌) రాడార్ల దృష్టి నుంచి మనం తప్పించుకునేందుకు ఉపయోగపడొచ్చని చెప్పా. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో.. దీనివల్ల లాభపడతామేమో అనిపిస్తోంది, ముందుకే వెళ్లండని చెప్పా’’ అని ప్రధాని అన్నారు.

game 27032019

జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల గురించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్పును బీజేపీ ట్విటర్‌లో పెట్టింది. కానీ ప్రధాని వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వెంటనే ఆ క్లిప్‌ను తొలగించింది. ట్వీట్‌ను తొలగించడంపైనా జమ్ముకశ్మీరు మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘చూస్తుంటే ఆ ట్వీట్‌ మేఘాల్లోకి వెళ్లిపోయినట్లుంది. అదృష్టవశాత్తూ ఆ ట్వీట్‌ స్ర్కీన్‌షాట్లు సోషల్‌ మీడియాలో చాలా తిరుగుతున్నాయి’ అని ట్వీట్‌ చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై నెటిజన్లు భారీగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇక.. దాడులు జరిగిన రోజు యుద్ధవిమానాలు నడిపిన పైలట్లలో తాను(మోదీ) కూడా ఉన్నానని చెప్పడమే తరువాయి’ అని ఓ నెటిజన్‌ ఎద్దేవా చేశారు. ‘చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రి వేళ సూర్యుడిపైకి అంతరిక్ష నౌకను పంపమన్నట్లుంది మోదీ వ్యవహారం’ అంటూ మరో వ్యక్తి ట్విటర్‌లో చమత్కరించారు.

వైకాపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా టివి9 రవిప్రకాష్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా హుందాగా వ్యాఖ్యానించాల్సిన విజయసాయిరెడ్డి కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. 'టివి9' నుంచి 'రవిప్రకాష్‌'ను తొలగించిన వైనంపై ఆయన స్పందిస్తూ...'మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి 'రవిప్రకాష్‌' బండారం బయటపడింది.ఈయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. 'కమ్మ'ని నీతులకు కాలం చెల్లింది. 'చంద్రబాబు' ప్రయోగించిన తుప్పుపట్టిన మిసైళ్లల్లో 'రవిప్రకాష్‌' ఒకరు అంటూ..ట్విట్‌ చేశారు.దీనిపై..రాజకీయ, సామాజికవర్గాలు విమర్శలు చేస్తున్నాయి.

vsreddy 12052019

ఒక కులంలోని వ్యక్తి తప్పు చేస్తే..ఆ తప్పును ఒక కులానికి మొత్తానికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నిస్తున్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన 'విజయసాయిరెడ్డి' 'జగన్మోహన్‌రెడ్డి'ల గురించి..అదే విధంగా కులపరంగా వ్యాఖ్యానిస్తే..సంస్కారంగా ఉంటుందా..? వీరిద్దరు చేసిన అవినీతిని వారి సామాజికవర్గానికి అంటగడితే..వాళ్లు ఒప్పుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి 'విజయసాయిరెడ్డి' ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, గతంలో 'పవన్‌కళ్యాణ్‌'ను ఉద్దేశిస్తూ..'ఉల్లిపాయ' అంటూ వ్యాఖ్యానించి..కులాన్ని ఆపాదించారని, ఇప్పుడు 'రవిప్రకాష్‌' విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తూ..ఆయా కులాలను కించపరుస్తున్నారు.

vsreddy 12052019

ఆయన ఇటువంటి తప్పుడు విధానాలు మానుకోకపోతే బుద్ది చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని, ఆయా సామాజికవర్గాలకు చెందిన ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.మరి ఇప్పటికైనా..ఆయన తన వైఖరిని మార్చుకుంటారా..? లేక మరింత దూకుడుగా 'కుల' వ్యాఖ్యలు చేస్తారా..వేచి చూడాల్సిందే... ఇది ఇలా ఉంటే, అదే సామాజిక వర్గం వారు వైసీపీ లో కూడా ఉన్నారు. కాని వారు విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై నోరు మెదపలేదు. కమ్మ సామాజికవర్గం అంటే, కేవలం చంద్రబాబు మాత్రమే అని అనుకుంటున్నారో ఏమో కాని, వీళ్ళు మాత్రం నోరు ఎత్తలేదు. ఇప్పటికే కులాల మధ్య నలిగిపోతున్న సమాజంలో, ఒక ప్రాధాన పార్టీలో నెంబర్ 2 గా ఉన్న వ్యక్తి ఇలా కులాల పేరుతొ సమాజాన్ని విచ్చిన్నం చెయ్యటం ఎంత వరకు సమంజసం. ఒక పార్టీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి ఇలాంటివి ఖండిస్తే మంచిది.

మంత్రివర్గ సమావేశంపై మళ్లీ పునరాలోచన ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వివేది ద్వారా నివేదిక పంపినప్పటికీ, సోమవారం సాయంత్రానికి దీనికి అనుమతి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అనుమతి వచ్చినా మే 14వ తేదీ అంటే మంగళవారం వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయటం సాధ్యంకాదనే భావనలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది, ఆ తర్వాత ఏదోక రోజు కేబినెట్ సమావేశం ఏర్పాట చేయటమా లేక ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వటమా అనే అంశంపై చర్చ సాగుతోంది. తాజాగా శనివారం ప్రారంభమైన ఈ పునరాలోచనపై ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

game 27032019

ఒకవేళ సోమవారం మధ్యాహ్నం నాటికి కేబినెట్‌ భేటీకి అనుమతి వచ్చినా గంటల వ్యవధిలో మంత్రులకు సమాచారం చేరవేసి.. అధికారులను సిద్ధం చేసి సమావేశం నిర్వహించడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని తొలుత భావించినా, ఈ సమావేశం ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్‌కి స్పష్టం చేశారు. పైగా ఎజెండా ఏమిటో కూడా తనకు పంపాలని, ఆ మేరకు నోట్‌ను సర్క్యులేట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఫణి తుఫాన్ పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, మంచినీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.

game 27032019

ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఈ అంశాలకు ఆమోదం తెలిపింది. ఆయా శాఖల నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని తెప్పించింది. ఈ నివేదికను ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపి.. అక్కడ్నుంచి ఢిల్లీకి పంపారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరో విడత లోక్ సభ ఎన్నికలు ఆదివారం జరుగుతుండటంతో పూర్తి హడావుడిగా ఉంది. అందువల్ల సోమవారం సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటుకు అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చినప్పటికీ, అప్పటికప్పుడు మంత్రులందరికీ మరుసటిరోజు అంటే 14వ తేదీన కేబినెట్ సమావేశం ఉంటుందనే సమాచారం పంపడం, అధికారులకు కూడా వర్తమానం పంపించాల్సిన అవసరం ఉండటంతో అంతా హడావుడిగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని భావిస్తున్నారు. అందువల్లే మరో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించటమా లేక కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి తగిన ఆదేశాలు ఇవ్వటమా అనే అంశంపై కూడా సీఎంవో కార్యాలయం ఆలోచన చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడిననంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం వెల్లడించకూడదని సీఎంవో కార్యాలయం భావిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read