పార్లమెంటు సాక్షిగా వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా బూటకమేనని కేంద్రం గణాంకాలతో సహా వెల్లడిస్తోంది. తాజాగా ఏపీ సర్కారు డొల్లతనం బయటపడింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం 0.5 శాతం మాత్రమేనని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో జగన్ సర్కార్‌కు పదో స్థానంలో నిలిచింది. రాజ్యసభలో సభ్యులు విదేశీ పెట్టుబడులపై వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు మొత్తం 42,509 మిలియన్ డాలర్ల పెట్టుబడి రాగా.. అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో నిలిచిన కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి. 1,287 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో తెలంగాణ ఉంది. తొమ్మిది నెలల కాలంలో 217 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించిన ఏపీ పదో స్థానంలో నిలిచింది.
news
మరోసారి వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, బాంబు పేల్చిన డీఎల్ రవీంద్రా రెడ్డి
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరు అవినీతి పై ఆయన అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై, ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ సలహాదారులు తిరుపాల్‌రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపాటు... "సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు.. చాపాడు మండలం నక్కల దీన్నేలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తండ్రి నాగన్న దున్నపోతులతో సేద్యం చేసేవాడు... ఎమ్మెల్యే రఘురాం రెడ్డి నన్ను ఏ పార్టీ దగ్గరకు రానివ్వదు అన్నారు.. నేను ప్రాకులాడే వ్యక్తిని కాదు వారికి అవసరమైతేనే నన్ను దగ్గరికి తీసుకుంటారు... ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి చాలెంజ్ చేసి చెప్తున్నా... నేను రాజకీయాలకు వచ్చేసరికి ఆరు ఎకరాల భూమి మాత్రమే ఉందన్నావు... 1977లో నా తండ్రి బాగ పరిష్కారాల కింద 31 ఎకరాల వ్యవసాయ భూమి కడపలో ఇల్లు బంగారు అదేవిధంగా నా చెల్లెలు పెళ్లి కోసం పది ఎకరాల పొలము ఇచ్చాడు... రఘురాం రెడ్డికి కళ్ళు ఉంటే వచ్చి చూసుకోవచ్చు డాక్యుమెంట్లు ఇస్తాను... నేను స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు నువ్వు నీ తండ్రి కలిసి తిరిగిన కూడా నేను మిమ్మల్ని ఓడించాను... నేను ఆస్తులు అమ్ము కుంటు వచ్చానే కానీ నీలా చేయలేదు... రఘురామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ఏ ఆస్తి అమ్మడో చెప్పాలి... రఘురాంరెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక దోచుకున్నాడు తప్ప ఏమి చేయలేదు... తిరుపాల్రెడ్డికి సిగ్గు ఉంటే నేను వెన్నుపోటు దారుదని మాట్లాడిన నువ్వు చర్చ కు సిద్ధమా... మొదటినుండి నా ప్రత్యర్థి రఘురాం రెడ్డి కుటుంబం వాళ్లతోనే పోటీ చేస్తున్నాను... నేను తెలుగుదేశం పార్టీకి సహకారం అందించాను పార్టీలో చేరలేదు. . నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా సకల శాఖ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి నా ఇంటికి వచ్చాడు... సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా చాపాడు మండల ప్రచారం చేసాం... నేను జగన్మోహన్ రెడ్డి నక్కల దీన్నే కు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయన అన్న కొడుకులతో ఊరు కల్లాపి పసుపుతో శుద్ధి చేయించాడు...
రఘురాం రెడ్డి రాజకీయ స్వార్థం మనుగడ కోసం జగన్ చెంత చేరి నన్ను విమర్శించేవారా... రఘురాం రెడ్డికి తిరుపాల్ రెడ్డి పైన కోపం దేనికంటే ప్రజారాజ్యం కంటెస్ట చేసి తన ఓటమికి కారణమయ్యాడని... తిరుపాల్‌రెడ్డి నా ఇంటికి వచ్చి నేను విజయమ్మ కు మూడు కోట్ల రూపాయలు ఇచ్చాను సహాయం చేయమని అడిగాడు... అప్పటి మంత్రి,సెక్రటరీకి చెప్పి పుల్లారెడ్డి పేట సొసైటీ ఎన్నికల జరిగేలా సహకారం అందించాను.. డి సీసీ బ్యాంకు ప్రెసిడెంట్ అయ్యేందుకు సహకారం అందిస్తే అవన్నీ మర్చిపోయాడు... తిరుపాల్‌రెడ్డి నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నీచుడు నికృష్టుడు నన్ను అధ్యక్షుడుగా తొలగించేందుకు కారణమయ్యాడు అతని ఓడించడమే నా పని అని నా చుట్టూ తిరిగాడు... తిరుపాల్‌రెడ్డి మా ఇంటికి వచ్చి శంకర్ రెడ్డి నన్ను దిగిపోయేందుకు కారణం అయ్యారు.. శంకర్ రెడ్డి ని ఓడించేందుకు సహకారం అందించాలని బ్రతిమలాడారు.. తిరుపాల్రెడ్డికి మూడు రక్తనాళాలు బ్లాక్ అయితే నేను స్వయంగా వైద్యం చేయించాను... అలాంటి తిరుపాల్ రెడ్డి నన్ను విమర్శించడం వెన్నుపోటుదారుడు అనడం అతని ముర్కత్వం, నోరు ఆయన అదుపులో పెట్టుకోవాలి... ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తిరుపాల్ రెడ్డికి చాలెంజ్ చేస్తున్న నేను వెన్నుపోటు దారుడు అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం...
ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, తిరుపాల్‌రెడ్డి లాగా నేను ఎవరికి వెన్నుపోటు పొడవును... రఘురాం రెడ్డికి చాలెంజ్ చేస్తున్నా నేను పోటీలో నిలబడతా నేనే నిన్ను ఓడ కొడతా... ఎన్నో పర్యాయాలు నిన్ను ఓ డగొట్టాను.. రఘురాం రెడ్డి గాలిలో తప్ప ఎప్పుడూ స్వయంగా గెలవలేదు... గాలిలో మాత్రమే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు... నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు గాని నీ తండ్రికి కూడా లేదు... రఘురాం రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కూడా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కి భయపడి ప్రోటోకాల్‌లో అర్హత ఉన్న మీటింగ్ కు వెళ్లలేదు... మైదుకూరు మున్సిపాలిటీ సుధాకర్ యాదవ్ 30 కోట్ల పండ్ తీసుకొని వస్తే అందులో అవినీతి జరిగితే స్పందించలేదు... నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అవినీతి నిరూపించి సంబంధిత అధికారులను జైలుకు పంపించాను... ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని బిఎన్ నాగేశ్వరి కౌన్సిలర్ అప్పుడు ఏం చేశారని నిలదీస్తే సమాధానం చెప్పలేకపోయారు... మరుగుదొడ్ల కుంభకోణంలో కూడా ఎమ్మెల్యే రఘురాంరెడ్డి లాలూచీపడి అవినీతిని నిరూపించుకున్నారు... 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే రఘురాంరెడ్డి దుకాణం తెరిచాడు .. ఎవరైతే డబ్బు ఇస్తే వారికి పనులు చేయడం మొదలుపెట్టాడు... సుబ్బారాం రెడ్డికి అతని తమ్మునికి 15 లక్షలు డబ్బులు తీసుకుని భూమి దారాధత్వం చేశాడు... 50 లక్షల రూపాయలు డబ్బులు చుక్కల భూమి కి అప్రూవల్ ఇప్పిస్తానని తీసుకున్నావు... దువ్వూరులో పాశం వారి భూమిని రఘురాంరెడ్డి వియ్యంకు ని పేరుపైన రాయించుకున్నావు... రఘురామిరెడ్డి 24 గంటలు ఎవరు ఎంత ఇస్తారు అని ఆలోచిస్తూ ఉంటాడు... అటువంటి నీచమైన వ్యక్తిత్వం కలిగిన నువ్వు నన్ను విమర్శించడం ఏంటి... నిబద్ధత గల వ్యక్తి ఏదైనా నిర్ణయం తీసుకుంటే చివరివరకు దాన్ని నిరూపించాలి.. ఉదాహరణకు నేను మైదుకూరు మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని వెలికి తీశాను.. అప్కో చైర్మన్ గుజ్జుల శీను ఎమ్మెల్యే రఘురాంరెడ్డికి 20 లక్షలు పార్టీ పండ్ ఇచ్చాడు... వందల కోట్ల రూపాయలు సంపాదించి 20 లక్షలె నా ఇచ్చేది అని సొసైటీ ప్రెసిడెంట్లను అవినీతి గురించి తెలుసుకొని సీఎం దగ్గర ఎంక్వయిరీ వేయించాడు... ఎంక్వైరీ పైన శీను స్టే తెచ్చుకున్నాడు.. రఘురాం రెడ్డి మళ్ళీ వెళ్లి ఏసీబీ ఎంక్వయిరీ వేయించాడు దానిపైన శ్రీను కోర్టులో స్టే తెచ్చుకున్నాడు... తరువాత సిఐడి ఎంక్వయిరీ వేయించారు... తరువాత సీనుతో లాలూచిబడి సీఎం దగ్గర ఎంక్వయిరీ ఆపేయమన్నాడు... కానీ సీఎం మాట వినకుండా ఎంక్వయిరీ చేయించాడు పెద్ద మొత్తంలో డబ్బు బంగారు దొరికింది..
రఘురాం రెడ్డి కొడుకుకు హైదరాబాదు కాజాగూడా లో అపార్ట్మెంట్ తీయించుకున్నావు.. మరో కొడుకుకు బెంగుళూరులో అపార్ట్మెంట్ .. హైకోర్టు అసిస్టెంట్ పీపీగా ఉన్న రఘురామిరెడ్డి కొడుకుకు అపార్ట్మెంట్ విజయవాడలో ఉంది.. ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతోమంది దగ్గర ముడుపులు తీసుకుని మైదుకూరులో ఇల్లు కొనుగోలు చేశాడు... చట్టబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టే ఉద్దేశం చేశారు... ఇంటిని స్థలంగ ఎలా రిజిస్టర్ నేను సబ్ రిజిస్టర్ కు ఎలా చేస్తారని నేను లేఖ రాశాను... నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాను... నాకు ఉన్న కళాశాలలో ఎక్కడ అవినీతికి పాల్పడలేదు... విద్యార్థులు ఇచ్చినది తీసుకుంటున్నాం... చేన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థలమిచ్చారు దాని పక్కన తక్కువ ధరలో స్థలాలు కొనుగోలు చేశాను.. ప్రతి దానిపైన నేను ఇన్కమ్ టాక్స్ కడుతున్నాను పారదర్శకంగా ఉన్నాను... నా ఆస్తులను చూస్తే రఘురాం రెడ్డికి హార్ట్ ఎటాక్ వస్తుంది... నేను లక్షల్లో కొంటే నా ఆస్తులు వేల కోట్ల రూపాయలు అయ్యాయి... కడప జిల్లాలోని శాసనసభ్యులు వైసిపి ఎమ్మెల్యేల అవినీతి గురించి నేను మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటారు... రైతు పంపు సెట్ కు బిగించే మీటర్ల విషయంలో శ్రీకాకుళంలో ఒక్కోమీటర్ ఆరు వేల రూపాయలు ఖర్చయింది... మిగతా జిల్లాల్లో ఒక్కో మీటర్‌కు 36వేల రూపాయలు అవుతుందనీ చెప్తున్నారు... ఈ కుంభకోణంలో 4000 రూపాయలు జగన్ రెడ్డి అకౌంట్ కు వెళ్తుంది... ప్రభుత్వం దగ్గర జీతాలకే దిక్కులేదు రైతులకు తిరిగి డబ్బులు ఇస్తారా... ఇసుక మైనింగ్ లలో విచ్చలవిడి అవినీతి జరుగుతుంది... రఘురాంరెడ్డి బినామీలతో అక్రమ మైనింగ్ ఎర్రమట్టి తోలుస్తున్నారు... ఐదు కోట్ల రూపాయల వర్క్ లో 50 లక్షలు తీసుకొని కనీసం ఎర్రమట్టి ఇవ్వలేదు... రఘురాంరెడ్డి మైదుకూరులో ఖాళీ స్థలం కనిపిస్తే కర్చీఫ్ వేస్తున్నారు...
ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని గుడిపాడు లో ఒక మహిళ నిలదీసింది... ప్రతి నాయకుడితో ఎమ్మెల్యే రఘురాంరెడ్డి డబ్బులు తీసుకున్నారు.. నేను ఇన్కమ్ టాక్స్ లో చూపని ఆస్తులు ఏవైనా ఉంటే నువ్వే తీసుకో... నా ఆస్తులు చూస్తే రఘురాం రెడ్డికి కళ్ళు తిరిగి హార్ట్ ఎటాక్ తో పోతారు... ఆస్తులు ఇంత విలువ పెరగడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణం... ఆంధ్రాలో అసమర్థపాదనతోనే తెలంగాణలో విలువ పెరిగింది.. సురేష్ బాబు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లోనే మందు తాగుతూ నా గురించి మాట్లాడుతున్నారు... 1999లో నక్కల దీన్నేలో లింగారెడ్డి కి రఘురాం రెడ్డి ఓట్లు వేయించాడు... తిరుపాల్‌రెడ్డి నిజంగా వ్యవసాయ సలహాదారులు అయితే ప్రతి రైతు భరోసా కేంద్రం తిరిగి పురుగు మందు ఎరువులు ధాన్యం కొనుగోలు గురించి చూడండి... సజ్జల రామకృష్ణారెడ్డి నా ఇంటికి పదిసార్లు తిరిగి బ్రతిమలాడి సహాయం చేయాలని కోరారు... సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను స్వయంగా ఆహ్వానించి కండువా కప్పారు... ఇటువంటి దారుణమైన పార్టీలో ఉన్నా నాకు కూడా సిగ్గుచేటు.. నేను ఏనాడు రఘురాంరెడ్డి ఇంటికి వెళ్ళలేదు ఆయనే నా ఇంటికి వచ్చి నన్ను నా బార్య ను బ్రతిమలాడి సహాయం చేయమని కోరారు.. మా అన్న కొడుకును నా చిన్నాన్న ను రఘురాం రెడ్డి హత్య చేయించారు... నాలుగు మండలాల హెడ్ క్వార్టర్లలో మాత్రమే వైసీపీకి ఓటు వేయాలని చెప్పాను... నా గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు... ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు చీపుర్లతో కొడతారు... 2019 ఎన్నికల తరువాత సీఎం జగన్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు... జగన్ 30 సంవత్సరాలు సీఎం గా ఉండాలంటే నీతి కరమైన పరిపాలన సాగించాలని చెప్పాను... సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల సలహాదారుడు... నేను ఎవరి దగ్గరికి వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు... నాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వదని వి ళ్లు చెప్పడానికి వారికి అర్హత లేదు... రఘురాంరెడ్డి మొహం చూసి 32 వేల మెజార్టీ వచ్చేది కాదు... జగన్ గాలితోనే ఆ మెజార్టీ వచ్చింది
కడప వెళ్తున్న జగన్ ని ఆడుకుంటున్న సోషల్ మీడియా... ట్రోల్ అవుతున్న జగన్...
అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమని ప్రగతిపథంలోకి తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాటలు నీటిమూటలేనని మరోసారి స్పష్టమైందని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ, మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మూడేళ్లు పూర్తి అయినా ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనిపై సోషల్‌మీడియా వేదికగా ప్రతిపక్ష టిడిపి నేతలు వ్యంగ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 15వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే స్టీల్ ఫ్యాక్టరీకి 2019 డిసెంబరు 23న సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. పనిలో పనిగా తనకు అస్సలు సూటు అవ్వని చిత్తశుద్ధి, నిజాయితీ, విశ్వసనీయత అంటూ ఏవో కబుర్లు కూడా చెప్పారు. మూడేళ్లు పూర్తయ్యింది. కడప స్టీల్ ఫ్లాంట్ శిలాఫలకం వెక్కిరిస్తోంది. దీనిపై ప్రతిపక్ష టిడిపి నాడు జగన్ ఇచ్చిన హామీలు, నేటి దుస్థితిని వివరిస్తూ పోస్టులతో ప్రశ్నిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం వల్లే ఏపిలో రైల్వే ప్రాజెక్ట్ లు లేట్ అవుతున్నాయి అంటున్న కేంద్రం...
రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లనే కోటిపల్లి నర్సాపూర్ న్యూలైన్(57.21 కి.మీ.) ప్రాజెక్ట్ ఆగిందని కేంద్రం తేల్చి చెప్పింది. ఆగిందన్న ప్రాజెక్టులో వాళ్లు ఇవ్వాల్సిన వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకుండా ఆటలాడుతుందని, ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించడం లేదాని కేంద్రం ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం అయ్యే రూ.2,120 కోట్ల రూపాయలని, అందులో కేంద్రప్రభుత్వం రూ.1091 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు రూ.2.69 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా రూ.354 కోట్లు చెల్లించాల్సి ఉందని, కేంద్ర రైల్వే మంత్రి రాజ్యసభలో చెప్పారు. తెలుగుదేశం ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు, రైల్వే మంత్రి ఈ సమాధానం చెప్పడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.