"డిల్లీలో కూర్చొని ఫోజులు కొట్టే అరోరాకి, ఓటేసి హైదరాబాద్ ఎళ్లిన జగన్ కి, హైదరాబాద్ లో కూర్చొని .. నా మీద ఫిర్యాదులిచ్చే మాజీ బ్యూరోకాట్లు, వీళ్లకేమి తెలుసండి ..ఓటెయ్యటానికి తెల్లారిందాకా లైన్లలో నుంచొని ఆంధ్రులు పడ్డ ఇబ్బంది" ఇది ఈ రోజు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్. బుధవారం సాయంత్రం అమరావతిలో ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫారం -7 దొంగల ఐపీ అడ్రస్‌లు ఎందుకు ఇవ్వరు? ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నారు? ఎన్నికల్లో అవకతవకలు జరగడం ఎవరి తప్పు? గెలిచేస్తున్నాం, వచ్చేస్తున్నాం అంటూ వైసీపీ నేతలు అనవసరంగా ఆయాసపడిపోతున్నారని, ఎక్కడికి మీరు వచ్చేది? ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారని చంద్రబాబు స్పష్టం చేజశారు.

polavaram 17042019

జగన్ పోలింగ్ అవగానే హైదరాబాద్ వెళ్లిపోయి విహారయాత్ర చేసుకుంటాడు, మీరెందుకు ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తారు? అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర పాలనను జగన్ కేంద్రం చేతిలో పెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాడంటూ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి, కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్పీని బదిలీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం సొంత బాబాయిని చంపి అరాచకం చేశారని సీఎం ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించి ఆలస్యం అయిందని, మళ్లీ ఈవీఎంలు పనిచేయడం మొదలుపెట్టగానే వైసీపీ హింసకు తెరలేపిందని మండిపడ్డారు. అంత బీభత్సం చేసి మళ్లీ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తూ నటిస్తారా? అంటూ నిలదీశారు.

polavaram 17042019

రాష్ట్ర పరిపాలనను కేంద్రం చేతిలో పెట్టాలని జగన్ ఉబలాటపడుతున్నారని దుయ్యబట్టారు. పోలింగ్ పూర్తిగానే జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారని, విహార యాత్రలకు వెళ్లారని విమర్శించారు. ఇక్కడ ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టాలని జగన్ యత్నించారని సీఎం నిప్పులు చెరిగారు. పోలవరంపై సమీక్ష చేయకూడదని ప్రతిపక్షం మాట్లాడ్డం విడ్డురంగా ఉందని, ఎన్నికల సమయంలో మాత్రమే సమీక్ష చేయలేదని.. ఈసీ పాత్ర ఎన్నికల నిర్వహణ వరకు మాత్రమే ఉంటుందని, పాలనలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాష్ట్రంలో లేకుండా విమర్శలు చేస్తున్న వైసీపీని ఉద్దేశించి సమీక్ష చేయకూడదని నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వకూడదని వైసీపీ నేతలు ఎలా కోరతారని.. మోడీ మీరు చెప్పినట్లే ఎలా నడుచుకుంటారని ప్రశ్నించారు.

ఈ దేశాన్ని 55ఏళ్లు పాలించిన పార్టీ.. రానున్న ఐదేళ్లలో ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోలేని స్థాయికి దిగజారిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కేవలం మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. చాలా కాలం తరవాత ప్రజలు.. అధికారంలో ఉన్న ప్రభుత్వమే తిరిగి రావాలనుకోవడం చూస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఇంటింటికీ తిరిగి ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని మాధాలో జరిగిన సభలో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఐదేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నానని అభిప్రాయపడ్డారు.

modidramas 17042019

కార్యకర్తలను ఉద్దేశిస్తూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో ఇప్పుడు అర్థమవుతోందని మోదీ అన్నారు. గాలి ఎక్కడ వీస్తే పవార్‌ ఆ గూటికి చేరతారని విమర్శించారు. భాజపా పాలనకు ముందు ముంబయి.. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండేదన్నారు. ఒకప్పుడు కేవలం నన్ను మాత్రమే దూషించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు సమాజం మొత్తాన్ని విమర్శిస్తుందన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన కారణంగానే కాంగ్రెస్‌ తనని లక్ష్యంగా చేసుకుందన్నారు. దేశంలో ఓ వర్గం మొత్తాన్ని దొంగలుగా అభివర్ణిస్తున్నారన్నారు. పరోక్షంగా ‘దొంగలంతా మోదీ పేరుతో ఉన్నార’ని రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు.

modidramas 17042019

దేశం అభివృద్ధి దిశలో సాగాలంటే తిరిగి భాజపాయే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఎన్సీపీ నుంచి భాజపాలో చేరిన రంజిత్‌ సిన్హా, ఆయన తండ్రి ఎన్సీపీ నేత విజయ్‌సిన్హా పాటిల్‌.. మోదీతో కలిసి వేదికను పంచుకోవడం గమనార్హం. అయితే మోడీ వైఖరి పై ప్రతిపక్షాలు స్పందించాయి. ఇప్పటి వరకు తాను ప్రభుత్వంలో ఏమి చేసింది చెప్పకుండా, నెహ్రు, పాకిస్తాన్ అంటూ కాలం గడిపేసి, ఇప్పుడు మళ్ళీ నేను తక్కువ కులం వాడిని అంటూ, కొత్త డ్రామా మొదలు పెట్టారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మోడీ చెప్పే డైలాగ్ ఇదే అని, రేపో మాపో, నన్ను చంపటానికి చూస్తున్నారు అంటూ కూడా మోడీ అంటారని, ఇలాంటి డైలాగులు ప్రతి ఎన్నికల ప్రచారంలో వినేవే అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో అకాల వర్షాలు, పిడుగులు పడి సుమారు 34 మంది మరణించారు. పీఎంఓ దీనిపై ఒక ట్వీట్‌ చేస్తూ, గుజరాత్‌ మృతుల కుటుంబాలకు మాత్రమే ప్రధాని సంతాపం తెలపడంతో పాటు పీఎం సహాయనిధి నుండి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సాయం ఆమోదించినట్టు పేర్కొంది. అయితే ఈ ట్వీట్ పై పెద్ద దుమారం రేగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా వర్షాలకు మనుషులు చనిపోతే, వారిని కనీసం తలవకుండా, కేవలం గుజరాత్ లో చనిపోయిన వారిని మాత్రమే, ప్రధాని ట్విట్టర్ లో సంతాపం తెలిపి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే, ఈ విషయం పై అందరూ తీవ్రంగా స్పందించారు.

moditweet 170042019 1

గుజరాత్ కు మాత్రమే, మోడీ ప్రధాని అని మరో సారి రుజువైందని కామెంట్ లు పెట్టారు. ఉత్తర భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో 34 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ గుజరాత్ మృతుల పట్ల మాత్రమే ప్రధాని ఆవేదన వ్యక్తం చేయడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మీరు దేశానికి ప్రధానా? గుజరాత్‌కు మాత్రమే ప్రధానా?' అంటూ ఓ ట్వీట్‌లో నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారని, మరి గుజరాత్ ప్రజలపైనే మోదీకి ఎందుకు సానుభూతని నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా ప్రజలు మాత్రం ఉన్నారని గుర్తుచేశారు. వారిపై కూడా పీఎం సానుభూతి చూపించి ఉండొచ్చన్నారు.

moditweet 170042019 1

గంటలోనే స్పందన... కమల్‌నాథ్ ట్వీట్ చెయ్యటం, పెద్ద ఎత్తున నెటిజెన్ లు మండి పడటంతో, ప్రధాని మోడీ దిగిరాక తప్పలేదు. గంటలోనే ప్రధాని కార్యాలయం తిరిగి ట్వీట్ చేస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలకు మృతి చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50,000 సాయం ప్రధాని ప్రకటించారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొంది. అయితే ప్రధాని గుజరాత్ పై చూపిస్తున్న ప్రేమ, మాత్రం మరోసారి బయట పడింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలను, మోడీ ఎలా చూస్తున్నారో చెప్పటానికి ఇదే తాజా ఉదాహరణ.

 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తెలిసిందే. కాని ఆ విమర్శలు నానాటికీ తారస్థాయికి చేరుకుంటున్నాయి. సమాజంలో తమ స్థాయిని మర్చిపోయి ఎదుటివారిపై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురించి భాజపా మాజీ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘మోదీ ఇంటి నుంచి బయటకి వచ్చే ముందు ముఖానికి 10 సార్లు పౌడర్‌ రాసుకుంటారని, రోజులో 10 సార్లు దుస్తులు మారుస్తారని కుమారస్వామి అన్నారు. మోదీ ముఖంలోనే ఆ తేజస్సు ఉంది. కాని కుమారస్వామి 100 సార్లు స్నానం చేసినా బర్రెలానే ఉంటారు’ అని వ్యాఖ్యానించారు.

barre 17042019

ప్రధాని మోదీకి టీవీల్లో ప్రచారం బాగా లభిస్తుందంటూ కుమారస్వామి గతంలో అన్నారు. ‘మోదీ ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు 10 సార్లు పౌడర్‌ రాసుకుని వస్తారు. టీవీల్లో బాగా కనిపించడానికే మోదీ అలా చేస్తున్నారు. మేము సాధారణ మనుషులం. ఉదయం స్నానం చేసి బయటకి వస్తాం. మళ్లీ మరునాడు ఉదయం స్నానం చేస్తాం. ఈలోపు ఒకటి రెండు సార్లు ముఖం కడుక్కుంటాం. అందుకే మా ముఖాల్లో అంత తేజస్సు కనిపించదు. ఈ కారణంతోనే కొందరు పాత్రికేయులు మోదీని చూపించినట్లుగా మమ్మల్ని టీవీల్లో సరిగా చూపించడం లేదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజు కాగే కుమారస్వామిని వ్యక్తిగతంగా విమర్శించారు.

barre 17042019

ఇదే తరహాలో సినీనటి జయప్రద గురించి ఎస్పీ పార్టీకి చెందిన ఒక నేత వ్యక్తిగత విమర్శ చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. నాయకులు తాము చేసిన అభివృద్ధి, చేయదలచిన అభివృద్ధి, పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం మానేసి ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి విమర్శల స్థాయి దిగజారే కొద్దీ వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గడమే కాకుండా వారిపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని, తద్వారా అల్లర్లు కూడా చెలరేగుతాయంటూ హెచ్చరిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read