సాధారణ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ఎంపీ గల్లా జయదేవ్‌ ఆడిటర్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలను ఆడిటర్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. గల్లా జయదేవ్‌‌కు చెందిన బ్యాంక్ అకౌంటెంట్‌ను ప్రశ్నిస్తున్నారు ఐటీ సిబ్బంది. అయినా సోదాలు నిర్వహించడం పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల ఒక రోజు ముందు ఇలా చేసి, భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

galla 09042019

మరో పక్క ఈ రోజు ఉదయం, గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇవాళ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీపీ కాంతారావు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు గురజాలలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... మరోవైపు ఈ దాడులు జరగడం తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఇప్పటికే ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ నేతలను టార్గెట్ చేసి కేంద్రంలోని నరేండ్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ కుమ్మక్కై... కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే.

galla 09042019

ఐటీ దాడుల పై ఏపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. ఎవరి ఆదేశాలతో సీఎం రమేశ్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని ఆయన మండిపడ్డారు. సాధారణ తనిఖీలేనంటున్న పోలీసులు అదే జిల్లాలోని జగన్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌రెడ్డి ఇళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ దాడులైతే అన్ని పార్టీల అభ్యర్థుల ఇళ్లపై చేయాలే గానీ ఒకే పక్షం అభ్యర్థులపై ఎందుకు నిర్వహిస్తున్నారని అని ప్రశ్నించారు. ఇటీవల ఉగ్రనరసింహరెడ్డి, బీద మస్తాన్‌రావు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇళ్లపైనా దాడులు చేశారని.. వీటిని ఏ కోణంలో చూడాలని ప్రశ్నించారు. ఇందులో కచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని తేల్చి చెప్పారు. వైసీపీలోనూ నేరస్థులు చాలా మంది ఉండగా.. రకరకాల వ్యాపారాలు చేస్తున్న వారిపై ఐటీ దాడులు ఎందుకు జరపడం లేదని ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ముగించుకుని, చివరిగా అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ఓవైపు ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే కాకుండా, మరోవైపు ప్రజలకు తన మనసులో మాటను తెలియజేశారు. తనది ధర్మపోరాటం అని, తాను కావాలో, ఆర్థిక నేరస్తుడు కావాలో ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. "సంక్షేమాన్ని కులంగా తీసుకున్నాను, అభివృద్ధిని మతంగా తీసుకున్నాను. 24 గంటలూ పనిచేస్తున్నాను. అందరివాడిగా ఉండాలన్నదే నా అభిమతం. ఏ కొద్దిమందికో చెందినవాడిగా ఉండడం నాకు నచ్చని విషయం. ఈ రోజు కులాలు, మతాలు, ప్రాంతాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎంతో దుర్మార్గమైన విషయం అది. ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి."

cbn 09042019 1

"నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో నేను వస్తే ఏంజరుగుతుంది? ఆర్థిక నేరస్తులు వస్తే ఏంజరుగుతుంది? నేనొస్తే మీ బిడ్డల భవిష్యత్తు పదిలంగా ఉంటుంది, అది నా బాధ్యత. ఆర్థిక నేరస్తుడు వస్తే అరాచకం పది రెట్లు పెరిగిపోతుంది. నేనొస్తే మీ భూముల భద్రత పది రెట్లు పెరుగుతుంది. వాళ్లొస్తే అవినీతి పదిరెట్లు పెరుగుతుంది, ఆగడాలు విపరీతం అవుతాయి. ఈ ప్రభుత్వంతో పసుపు-కుంకుమ పదిరెట్లు పెరిగితే, వాళ్లొస్తే పసుపు-కుంకుమ తీసేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు పదిరెట్లు వస్తాయి. వాళ్లొస్తే పరిశ్రమలు పారిపోతాయి. మేము పోలవరం, అమరావతి పూర్తిచేస్తాం. వీళ్లొస్తే రెండూ ఆగిపోతాయి. మా ప్రభత్వంలో మైనారిటీలను ఆదుకుంటాం. మైనారిటీల భద్రత, భవిష్యత్తు సుభిక్షంగా ఉంటుంది. ఆర్థిక నేరస్తుడికి ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటేసినట్టు అవుతుంది. అప్పుడే దేశంలో ఏ మైనారిటీకి కూడా భద్రత ఉండదు. బీసీలు, ఎస్సీ ఎస్టీలను, అగ్రవర్ణాల పేదలందరినీ ఆదుకుంటామని మరోసారి చెబుతున్నాను."

"ఈ రోజు శిరస్సు వంచి రాష్ట్ర ప్రజలందరికీ పాదాభిందనం చేస్తూ ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇది నాకోసం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. పెన్షన్లు పెంచేటపుడు పెద్ద కొడుకుగా ఆలోచించా. ఆడబిడ్డలకు పధకాలు తయారు చేసేటపుడు అన్న గా ఆలోచించా. పుట్టే బిడ్డకు తాతగా, నవ యువతకు గార్డియన్ గా ఆలోచించా. మీ పిల్లలు పెద్దయ్యేసరికి నేను ఉంటానో లేదో తెలియదు. కానీ ఈ తరం చల్లగా ఉండాలి. రాబోయే తరం బాగుండాలి అనేది నా ఆలోచన. రాష్ట్ర కుటుంబ పెద్దగా అది నా బాధ్యత గా భావిస్తున్నా. నేను శాశ్వతం కాదు. రాష్ట్రం శాశ్వతం. పూర్తవుతున్న పోలవరం శాశ్వతం. నిర్మిస్తున్న అమరావతి శాశ్వతం. రాయల సీమ లో పారె నీరు శాశ్వతం. నాగావళి, వంశధార శాశ్వతం. అలాంటి రాష్ట్రం కోసం మరోసారి అందరినీ వేడుకుంటున్నా. ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, అన్ని నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అనుకుని ఓటేయండి. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎన్నికల సందర్భంగా మీ అందరికీ అభినందనలు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సాగిస్తున్న ఈ ధర్మపోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను" అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు.

జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల ఛానల్ గా రిపబ్లిక్ టీవీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారు ఆంధ్రపదేశ్ పై చేసిన సర్వేలో మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైందో ఏమో కాని, నిన్న వదిలిన ఒక సర్వేలో మాత్రం, చంద్రాబాబుకు ఎక్కువ సీట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోడీకి అనుకూలంగా ఉండే జగన్ ను పక్కన పెట్టి మరీ చంద్రబాబుకు ఎక్కవ సీట్లు ఇచ్చారు.  ఏపీలో సైకిల్‌ జోరు కొనసాగనుందని రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్‌ సర్వే అంచనా వేసింది.  నవ్యాంధ్రలో తెలుగుదేశం పరిస్థితి బాగుందని రిపబ్లిక్‌ టీవీ-సీ వోటర్‌ సర్వే వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను టీడీపీ 14 గెలుచుకుంటుందని అంచనా వేసింది.

republic 09042019

ప్రతిపక్ష వైసీపీ 11 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది. అయితే ఈ 11 స్థానాల్లో నాలుగు చోట్ల రెండు పార్టీల మధ్య చాలా స్వల్ప తేడా ఉందని.. ఈ నాలుగూ టీడీపీ ఖాతాలోనే పడే అవకాశముందని వెల్లడించింది. ఇదే చానల్‌-సర్వే సంస్థ గత జనవరి 24న విడుదల చేసిన సర్వేలో వైసీపీకి 19 ఎంపీ స్థానాలు వస్తాయని.. టీడీపీ ఆరింటికే పరిమితమవుతుందని పేర్కొంది. రెండున్నర నెలల్లో సీన్‌ రివర్స్‌ అయుంది. రాష్ట్రంలో టీడీపీకి పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని తాజాగా తెలియజేసింది. టీడీపీకి 38.5% ఓట్లు లభిస్తాయని.. వైసీపీకి 36.5%  వరకు వస్తాయని అంచనా వేసింది. యూపీఏ, ఎన్డీఏ, ఇతరులకు సీట్లేమీ రావని.. కానీ వరుసగా 10.4%, 6.5%, 8.2% ఓట్లు పొందుతాయని విశ్లేషించింది. గత సర్వేలో వైసీపీ 41.3% ఓట్లు పొందుతుందని.. టీడీపీ 33.1% ఓట్లకే పరిమితమవుతుందని పేర్కొనడం గమనార్హం. జనసేన సహా ఇతరులకు 8.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక  కాంగ్రెస్‌, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని సర్వే తెలిపింది.

అంతా అనుకున్నట్టే జరుగుతుంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజల ఏపీకి వచ్చి ఓటు వేసే అవకాశం ఉందని తెలియటం, వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని తెలియటంతో, అక్కడ నుంచి ప్రజలు రాకుండా, ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, 10 సాయంత్రం రద్దు అయినట్టుగా, బుక్ చేసుకున్న వారికి మెసేజ్ లు వచ్చాయి. రేపటి లోపు చాలా బస్సులు ఇలాగే రద్దు చేస్తారనే సమాచారం రావటంతో, హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చే వారిని రప్పించటానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందు రాత్రి నుంచి ఎన్నికల రోజు మధ్యాహ్నం వరకు ఓట్లు వేసేందుకు జనం తరలి వెళుతుంటారు. వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

bus 09042019

మరో పక్క, రవాణా శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని ఏపీ వెళ్లే ప్రైవేటు బస్సులను అడ్డుకునే అవకాశం ఉందని ఆంధ్రా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్‌ లేదని, ఫిట్‌నెస్‌ లేదని, నిబంధనలు పాటించడం లేదని.. ఇలా ఏదో ఒక సాకుతో బస్సులను మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వీలైనంత ముందుగానే సొంతూర్లకు చేరుకునేందుకు ఏపీ ఓటర్లు ప్లాన్‌ మార్చుకుంటున్నారు. ఒకవేళ ప్రైవేటు బస్సులను మధ్యలోనే అడ్డుకుంటే.. సకాలంలో వెళ్లి ఓటేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ నెల 11న ఏపీలో ఓటు వేసేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నుంచి లక్షలాది మంది సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read