నూట ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను మరచిపోవాల్సిందేనని రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ స్పష్టం చేశారు. ‘‘విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే...వాల్తేరు డివిజన్‌ కావాలని అడుగుతారేమిటి?’’ అంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రశ్నించారు. రద్దుచేసిన వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరించబోమని తెగేసి చెప్పారు. ఎన్నికలప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల (వాల్తేరు డివిజన్‌) లేని జోన్‌ ఇచ్చారని, దానివల్ల ప్రయోజనం ఏమిటని విశాఖలో విలేకరులు ప్రశ్నించగా, అదంతా టీడీపీ దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు.

loksabha 03042019

‘‘మూడు డివిజన్లతో కూడిన పెద్ద జోన్‌ ఇచ్చాం. దాని కేంద్రం విశాఖలో ఏర్పాటుచేశాం. జనరల్‌ మేనేజర్‌ను నియమించాం. ఇంత చేసినా, ఇంకా డివిజన్‌ కావాలని అడగడం చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని తలపిస్తోంది. పెద్ద చాక్లెట్‌ చేతికి ఇస్తే...ఇంకో చిన్న ముక్క కూడా కావాలని ఏడ్చినట్లు ఉంది’’ అని వ్యాఖ్యానించారు. రద్దు చేసిన వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించగా, మళ్లీ వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరించే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తుంటే...ఆ పథకాలకు సీఎం చంద్రబాబు తన పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

loksabha 03042019

చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని, తన సొంత సంస్థ హెరిటేజ్‌ అభివృద్ధికే ఆయన పాటు పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ రెండింటికీ రాష్ట్ర అభివృద్ధిపై అజెండా ఏమీ లేదని ఆరోపించారు. చంద్రబాబు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, ఫరూక్‌ అబ్దుల్లాలది అవినీతిపరుల అనుబంధమన్న ఆయన, కాంగ్రెస్‌ మేనిఫెస్టో నిండా అభూత కల్పనలే ఉన్నాయని విమర్శించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి రహిత పాలన అందించే ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు పలకాలని, బీజేపీకిపట్టం కట్టాలని మేధావులను మంత్రి కోరారు. విజయనగరంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల ఆత్మీయ సమావేశంలో గోయల్‌ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పలికేందుకు ప్రజలు కాపలాదారులు కావాలని మంత్రి కోరారు.

పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ బృతి, పెన్షన్ లు.. ఇవన్నీ ఈ నెలలో లబ్దిదారుల బ్యాంక్ ఎకౌంటు లో పడాలి. దీని కోసం ఇది వరుకే నిర్ణయం తీసుకున్నారు కూడా. అయితే ఈ లోపే ఏప్రిల్ 11న ఎన్నికలు అని ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందే, ప్రభుత్వం ఈ పధకాలు అమలు చేస్తూ ఉండటంతో, ఈసీ అభ్యంతరం చెప్పలేని పరిస్థితి. అయితే, జగన్ మాత్రం, ఇవన్నీ ఆపటానికి స్కెచ్ చేసారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘పసుపు-కుంకుమ’ పథకం కింద ఏప్రిల్‌ 5న మూడో విడతలో చెల్లించనున్న సొమ్మును, మరోవైపు ‘అన్నదాతా-సుఖీభవ’ పథకం చెల్లింపులను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో కొంత మంది చేత కేసు వేయించారు.

annadata 036042019

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం, నిరుద్యుగ బృతికి మాత్రమే అడ్డంకి చెప్పింది. అది కూడా, వెయ్య రూపాయాలు ఇచ్చుకోవచ్చని, పెంచిన రెండు వేలు మాత్రం, ఇప్పుడు ఇవ్వద్దు అని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా, ఈ రోజు మాత్రం ఏపీ రైతులకు శుభవార్త వినిపించారు చంద్రబాబు. రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని సర్కారు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇవాళ మొదటి విడత మొత్తం మిగిలిన రూ.3వేలు వారి ఖాతాల్లోకి బదిలీ చేసింది. దాదాపు 45 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.1349.81 కోట్లు మేర సర్కారు ఇవాళ జమ చేసింది.

annadata 036042019

పెట్టుబడి సాయం కింద ఏటా 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.15వేలు, పెద్ద రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ‘రాష్ట్రంలో కోటి మంది మహిళలు నాకు అండగా ఉన్నారు. మహిళలకు ఎన్టీఆర్‌ ఆస్తి హక్కు కల్పిస్తే.. నేను 33శాతం రిజర్వేషన్లు కల్పించా. వారు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేయిస్తా. ఈ నెలలో ఒకటో తేదీన పింఛన్ల పండగ. 5న మహిళలకు పసుపు-కుంకుమ డబ్బులు అందుతాయి. ఆ వెంటనే నాలుగు, ఐదో విడత రైతుల రుణ మాఫీ సొమ్ము ఖాతాల్లో వేస్తున్నాం. అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికే రూ.వెయ్యి ఇచ్చాం. ఇప్పుడు తొలి విడత కింద రూ.4వేలు వేస్తున్నాం. ఈ నెలంతా మీకు పండగే. మీరంతా తెలుగుదేశాన్ని గెలిపించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రజల ఆదరణ ఎలాగూ లేదని జగన్ పార్టీకి అర్ధమైంది, అందుకే రకరకాల కుట్రలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓటర్లను ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టిస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. మైదుకూరులో మీడియా సర్వే అంటూ తెలంగాణకు చెందిన కొంతమంది ఇంటింటికి తిరుగుతూ ప్రలోభాలు పెడుతున్న 13 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మరువకముందే ఇప్పుడు వైసీపీ వారు ముద్రించిన నమూనా బ్యాలెట్‌లో టీడీపీ గుర్తు వరుస నెంబరు మార్చి తప్పుగా కొట్టించి ప్రచారంలో ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఓటు ఎవరికి వేయాలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఎన్నికల కమిషన్‌ బ్యాలెట్‌ పత్రంపై అభ్యర్థి వరుస నెంబరుతో పాటు పేరు, పార్టీ, పార్టీ గుర్తును ముద్రిస్తారు.

maidukur 03042019

ఈ నమూనా బ్యాలెట్‌తో ఓటర్లకు అవగాహన కుదిర్చేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఫలాన నెంబరుకు లేదా ఫలానా గుర్తు అంటూ పంపిణీ చేయడం అనవాయితీగా మారింది. అయితే మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి 4వ నెంబరని, 3వ నెంబరు సైకిల్‌ గుర్తు అంటూ ఓటర్లను తప్పుదోవ పట్టించేలా నామూనా బ్యాలెట్‌ను ముద్రించారు. వైసీపీ వారు ముద్రించిన నమూనా బ్యాలెట్‌లో టీడీపీ అభ్యర్థి 3వ నెంబరు అని గ్రహించే అవకాశముందనే కేవలం ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని పై ప్రజల్లో అవగహన కలిగించి, వీరి కుట్రల పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

maidukur 03042019

కాగా తెలుగుదేశం పార్టీ తరపున ముద్రించిన నమూనా బ్యాలెట్‌ సరిగానే ముద్రించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నమూనా ప్రకారమే 2వ నంబరులో టీడీపీ సైకిల్‌ గుర్తు, 4వ నంబరులో వైసీపీ ఫ్యాను గుర్తుని ముద్రించిన కరపత్రాలనే ఓటర్లకు పంపిణీ చేసి వారి సద్బుద్ధిని చాటుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు నమూనా బ్యాలెట్‌ను అందచేశామని, ఆ ప్రకారమే నమూనా బ్యాలెట్‌ను ముద్రించి ప్రచారం చేసుకోవాలని, అలా కాకుండా తప్పుగా ముద్రించి పంపిణీ చేయడం సరికాదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సతీష్‌ చంద్ర వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

 

నిన్నంతా హైదరాబాద్‌లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేరస్థుల పార్టీని ఎక్కడా నమ్మటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. పింఛన్‌ డబ్బులు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లోనే పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతాయన్నారు. అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికే వెయ్యి రూపాయలు జమయ్యాయని, మరో రూ.3 వేలు కూడా జమవుతున్నాయని పేర్కొన్నారు.

cbn 03042019 1

చెక్కులు చెల్లవని ప్రచారం చేస్తున్న వారికిది చెంపచెట్టు కావాలన్నారు. లబ్ధిదారుల సంక్షేమానికి అడ్డుకునేందుకు ఎంతటి కుట్రలకైనా వైకాపా తెగపడుతుందని విమర్శించారు. ఐదేళ్ల తెదేపా ప్రభుత్వం వల్ల లాభం జరిగిందా? అంటే.. ప్రజలు చేతులెత్తి జైకొట్టే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం చెప్పారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, టీడీపీ అంటే ప్రజలు జైకొడుతున్నారని అన్నారు.

cbn 03042019 1

నేరస్థుల పార్టీని ఎక్కడా నమ్మటానికి వీల్లేదని పార్టీ నేతలతో చెప్పారు. పింఛన్‌ డబ్బులు ఇప్పటికే లబ్దిదారులకు అందాయని, పసుపు- కుంకుమ, అన్నదాతా సుఖీభవ.. రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఈ నాలుగైదు రోజుల్లోనే లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తామని సీఎం పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే వెయ్యి జమయ్యాయని, త్వరలో మరో రూ. 3 వేలు కూడా జమవుతాయని తెలిపారు. చెక్కులు చెల్లవని ప్రచారం చేసిన వారికి ఇది చెంపపెట్టు కావాలన్నారు. లబ్దిదారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలకైనా తెగిస్తుందని చంద్రబాబు దుయ్యబట్టారు.

Advertisements

Latest Articles

Most Read