విజయవాడలోని  పాత గవర్నమెంట్ హాస్పిటల్ లో  దారుణమైన సంఘటన జరిగింది. ప్రసవ నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఒక నిండు గర్భిణీని కనీసమైనా పట్టించుకోకుండా వదిలేయడంతో ఆ మహిళ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. వారి బందువులు పడుకోపెట్టటానికి  స్ట్రెచర్ కోసం అడిగినా కూడా ఇవ్వలేదని వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళ్ళా,వేళ్ళా  పడినా కూడ  కనీస కనికరం కూడా చూపలేదని వారి బందువులు ఆరోపిస్తున్నారు.  అదేమని అడిగితే , మా దగ్గర రూల్స్ మాట్లాడుతారా  అంటూ ఆగ్రహం వ్యక్తంచేసారని  బంధువులు చెబుతున్నారు. ఎంతకీ హాస్పిటల్ సిబ్బంది సహకరించ పోవడంతో  నేలపైనే ఆ గర్భిణీని  పడుకోబెట్టి ప్రసవం చేసారు. ప్రసవం తరువాత  ఆ మహిళ తీవ్ర వాంతులు అయ్యాయి. ఆ వాంతులు చేసుకునే సమయంలో కడుపులోని శిశువు జారి కిందకు పడటంతో  ఆ బిడ్డ  తల నేలకు తగిలి బొడ్డు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇప్పుడు ఆ తల్లి బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారి కుటుంబ సభ్యులు చేబుతున్నారు.

తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ టీడీపీ శంఖారావం కార్యక్రమం నిర్వహించబోతుంది. దీనికోసం టిడిపి శ్రేణులు భారీ ఫ్లెక్సీలతో , హోర్డింగ్లతో, పసుపు జండాలతో ఖమ్మం మొత్తం పసుపుమయం చేసేసారు. ఈ సభ కు వరంగల్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, జిల్లాల నుంచి టిడిపి కార్యకర్తల రానున్నారుది. దాదాపు 25 శాసనసభ నియోజకర్గాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు వస్తారని అంచనా. మహిళలు పెద్ద ఎత్తున ఈ మీటింగ్ లో పాల్గుంటారని టిడిపి ఆశిస్తుంది. మొదట చంద్రబాబు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, ఆ తరువాత కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి భారీ కాన్వాయ్ తో ర్యాలీగా ఖమ్మం జరగబోయే సభకు వెళ్లనున్నారు.

పల్నాడులో మరొకసారి వైసిపి శ్రేణులు రెచ్చిపోయాయి. ఈసారి ఏకంగా తెలుగుదేశం సీనియర్ కార్యకర్తను, వైసిపి కార్యకర్తలు హ-త్య చేసారు.  రెండు రోజుల క్రితం వైసిపి నేతలు పల్నాడులో  చేసిన బీబత్సం మర్చిపోకముందే, ఈ రౌడీ మూక మరోసారి రెచ్చిపోయింది. నరసరావుపేటలో టీడీపీ కార్యకర్త ఇబ్రహీంను దారుణంగా  నరికి చంపారు. పల్నాడులోని  మసీదు స్థలం గురించిన విషయంలో ఇబ్రహీంపై  దా-డికి తెగించారు వైసీపీ కార్యకర్తలు. ఈ సంఘటనలో ఇబ్రహీం అక్కడికక్కడే చనిపోయాడు.  మరో తెలుగుదేశం కార్యకర్త రహమత్ అలీ  తీవ్రగాయాలతో బయటపడ్డాడు. దీనితో పెద్ద ఎత్తున  టీడీపీ నేతలు, కార్యకర్తలు హాస్పిటల్  చేరుకున్నారు.

ఈ రోజు ఆంద్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఉద్యోగుల సంఘం ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందులో తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. దీని కోసం 30 మంది అబ్యర్ధులు పోటీ చేయనున్నారు. సచివాలయంలో అధ్యక్ష పదవి కోసం వెంకట్రామిరెడ్డి, రామకృష్ణ పోటీపడనున్నారు. ఈ ఎన్నికల్లో 1,225 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు ఉదయం 10 నుంచి పోలింగ్ జరగనుంది. ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెల్లడిస్తారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి వెంకట్రామిరెడ్డి పై పడింది. వెంకట్రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు ఉంది. ఉద్యోగులకు ఇన్ని సమస్యలు ఉన్నా, జీతాలు పడక పోయినా, వెంకట్రామిరెడ్డి కనీసం పోరాటం చేయటం లేదనే అసంతృప్తి ఉద్యోగుల్లో ఉంది. వెంకట్రామిరెడ్డిని ఎలాగైనా ఓడించాలని చాలా మంది ఉద్యోగులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పై నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న వెంకట్రామిరెడ్డి, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ, మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమి జరుగుతుందో మరి.

Advertisements

Latest Articles

Most Read